ఇస్లామాబాద్ : సమాతే ఉద్ దవా చీఫ్, ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ 2018 సాధారణ ఎన్నికల్లు పోటీ చేస్తున్నట్లు శనివారం ప్రకటించారు. అయితే ఎక్కడి నుంచి పోటీ చేస్తాడనే విషయాన్ని మాత్రం ఆయన ప్రకటించలేదు. ముంబై దాడుల సూత్రధారి అయిన హఫీజ్ సయీద్.. ఈ మధ్యే గృహనిర్భంధం నుంచి విడుదలయ్యారు. హఫీజ్ సయీద్ ఇప్పటికే పాకిస్తాన్‌లో మిల్లీ ముస్లిం లీగ్ అనే పార్టీని ఏర్పాటు చేశారు. అయితే పాకిస్తాన్ ఎన్నికల సంఘం దానిని అధికారికంగా గుర్తించలేదు. ఎన్నికల సంఘం పార్టీని గుర్తించకపోయినా.. ఎంఎంఎల్ పార్టీ అభ్యర్థిగానే ఎన్నికల్లో పోటీ చేస్తానని హఫీజ్ సయీద్ చెప్పారు.
పాకిస్తాన్‌ను నిజమైన ముస్లిం సంక్షేమ రాజ్యంగా మలిచే శక్తి ఒక్క హఫీజ్ సయీద్‌కు మాత్రమే ఉందని ప్రముఖ మత బోధకుడు సైఫుల్లా ఖలీద్ అన్నారు. దేశంలోని ఇతర రాజకీయ నేతలతో పోలిస్తే.. హఫీజ్ సయీద్‌కు ప్రజల్లో మంచి ఆదరణ ఉందని ఆచన చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment