సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి కొనసాగుతోంది. దీంతో ఒక్కో రాష్ట్రం లాక్‌డౌన్ ఆంక్షలను పొడగిస్తున్నాయి. అయితే కరోనా వైరస్‌కు సంబంధించి ‘ఇండియన్ వేరియంట్’ అని సూచించే ఎటువంటి సమాచారమైనా సామాజిక మాధ్యమాల నుంచి తొలగించాలని శుక్రవారం కేంద్ర సమాచార సాంకేతిక (ఐటి) మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా సంస్థలకు లేఖ రాసింది. ఇక B.1.617 అనేది ‘ఇండియన్ వేరియంట్’ అని చెప్పేందుకు ఎక్కడా ఆధారాల్లేవని కేంద్రం స్పష్టం చేసింది.
ఈ వేరియంట్‌ను కేవలం B.1.617గా డబ్ల్యూహెచ్‌ఓ వర్గీకరించిందని పేర్కొంది. ‘ఇండియన్ వేరియంట్’ అని ప్రస్తావించడం అసత్యాన్ని వ్యాప్తి చేయడం వంటిదేనని తెలిపింది. ఇది దేశ ప్రతిష్టకు భంగం వాటిల్లే ప్రమాదం ఉందని స్పష్టం చేసింది. ఇలాంటి వాటి వ్యాప్తి చేస్తే నోటీసులు పంపాలని కేంద్ర ప్రభుత్వం రాయిటర్స్ వార్త సంస్థను సూచించింది.
కాగా ప్రపంచవ్యాప్తంగా కరోనా వేరియంట్లను వైద్యులు, ఆరోగ్య నిపుణులు సాధారణంగా గుర్తిస్తారు. ఇందులో భాగమే దక్షిణాఫ్రికా, బ్రెజిల్ దేశాల్లో గుర్తించిన కరోనా వేరియంట్స్ అని స్పష్టం చేసింది. అయితే చాలా మీడియా సంస్థలు ఆన్‌లైన్ న్యూస్ పోర్టల్స్ B.1.617ను ‘ఇండియన్ వేరియంట్’ అంటూ కథనాలను ప్రచురించి ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నాయని కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
ఇక కేంద్ర సమాచార సాంకేతిక (ఐటి) మంత్రిత్వ శాఖ ఆదేశాలపై ఓ సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్ స్పందిస్తూ.. ‘ఇండియన్ వేరియంట్’ పదాన్ని ఉపయోగించిన సమాచారాన్ని తీసివేయడం చాలా కష్టమని తెలిపారు. ఇటువంటి చర్య కీవర్డ్ ఆధారిత సెన్సార్‌షిప్‌కు దారి తీస్తుంది’ అని ఆయన పేర్కొన్నారు.
(చదవండి: ముదురుతున్న టూల్‌కిట్ వివాదం)
Comments
Please login to add a commentAdd a comment