గల్ఫ్ దేశాల్లో భారతీయులకు ఆదరణ పెరుగుతోందని, అక్కడ మనవారికి లభించినంత గౌరవం మరే ఇతర దేశాల వారికి కూడా దక్కదని అన్నారు కేరళ ప్రభుత్వ దౌత్యాధికారి ప్రొఫెసర్ వేణు రాజమోని. పాకిస్తాన్, చైనా దేశాల నుండి వచ్చేవారు కూడా భారతీయుల ముందు దిగదుడుపేనని వ్యాఖ్యానించారు.
ఆ విషయంలో భారతీయులు సూపర్...
కాంక్లేవ్ సౌత్ ఇండియా 2023 పేరుతో జరిగిన ఓ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన ప్రొఫెసర్ వేణు రాజమోని గల్ఫ్ దేశాల్లో భారతీయులకు పెరుగుతోన్న ఆదరణ గురించి ప్రస్తావించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... భారత దేశం నుండి గల్ఫ్ దేశాలకు జీవనోపాధి కోసం వెళ్లిన వారికి అక్కడ విశేష ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా దక్షిణాది నుండి వెళ్లేవారిలో అత్యధిక శాతం నైపుణ్యమున్న వారే కావడంతో మనవారికి అక్కడి దేశాల్లో ఎవరికీ దక్కనంత గౌరవం దక్కుతూ ఉంటుంది.
పాకిస్తాన్ నుండి, చైనా నుండి ఉపాధి కోసం వెళ్లేవారికైతే నైపుణ్యం విషయంలో అసలు భారతీయులతో పోలికే లేదన్నారు. అరబ్ దేశాలు కూడా భారతదేశం పట్ల ప్రత్యేక అభిమానాన్ని చూపిస్తూ భారతీయులకు జీవనోపాధి కల్పించే విషయంలో ఎంతగానో సహకరించడమే కాదు భారత ఆర్ధిక పురోగతికి కూడా పరోక్షంగా తోడ్పడుతున్నాయని అన్నారు.
Pol Science students of DU's Hindu College interviewed me for their annual publication ‘Siyasat’ on the topic ‘The Awakening: Life Amidst Conflict & Crisis,' I shared insights on the role diplomats & statesmen play trying to forge peace in a tumultuous & unpredictable world pic.twitter.com/5ygE2jqhMh
— Venu Rajamony (@venurajamony) May 20, 2023
చదవండి: బీజేపీ నా పార్టీ కాదు... మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment