న్యూఢిల్లీ: బ్రిటన్‌తో దైపాక్షిక బంధాన్ని బలోపేతం చేసుకోవడానికి కట్టుబడి ఉన్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఇరుదేశాలకు ప్రయోజనం చేకూర్చే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని (ఎఫ్‌టీఏ) ఖరారు చేసుకోవాలనే బ్రిటన్ ఆకాంక్షను స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు.
రెండురోజుల పర్యటన నిమిత్తం భారత్‌కు వచి్చన బ్రిటన్ విదేశాంగ మంత్రి డేవిడ్ లామీ బుధవారం ప్రధాని మోదీని కలిశారు. భారత్– యూకే సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత విస్తృతం, బలోపేతం చేసుకోవడానికి బ్రిటన్ నూతన ప్రధాని కియర్ స్టార్మర్ ప్రాధాన్యమివ్వడాన్ని మోదీ అభినందించారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment