bilateral ties
-
Narendra Modi: ‘బ్రిటన్‌తో బంధాల బలోపేతానికి కట్టుబడి ఉన్నాం’
న్యూఢిల్లీ: బ్రిటన్‌తో దైపాక్షిక బంధాన్ని బలోపేతం చేసుకోవడానికి కట్టుబడి ఉన్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఇరుదేశాలకు ప్రయోజనం చేకూర్చే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని (ఎఫ్‌టీఏ) ఖరారు చేసుకోవాలనే బ్రిటన్ ఆకాంక్షను స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు. రెండురోజుల పర్యటన నిమిత్తం భారత్‌కు వచి్చన బ్రిటన్ విదేశాంగ మంత్రి డేవిడ్ లామీ బుధవారం ప్రధాని మోదీని కలిశారు. భారత్– యూకే సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత విస్తృతం, బలోపేతం చేసుకోవడానికి బ్రిటన్ నూతన ప్రధాని కియర్ స్టార్మర్ ప్రాధాన్యమివ్వడాన్ని మోదీ అభినందించారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. -
భారత మూలాలు... నాకెంతో గర్వకారణం...!
న్యూఢిల్లీ: ఆయన రిషి సునాక్. బ్రిటన్ ప్రధాని. ఆ పీఠమెక్కిన తొలి భారత మూలాలున్న నేత. అత్తామామలు ఇన్ఫోసిస్ వంటి దిగ్గజం ఐటీ కంపెనీ వ్యవస్థాపకులు. అంతా కలిస్తే భోజనాల బల్ల దగ్గర వాళ్ల మధ్య ఏ అంశాలు చర్చకు వస్తాయి? రాజకీయాలా? అస్సలు కాదట. కేవలం క్రికెట్ గురించి మాత్రమే మాట్లాడుకుంటారట. చివరికి రిషి ఇద్దరు కూతుళ్లు కూడా క్రికెట్ అంటే ప్రాణం పెడతారట. ఎంతగా అంటే, సర్వ కాల సర్వావస్థల్లోనూ భారత జట్టునే సమరి్థంచేటంతగా. అయితే, ఫుట్‌బాల్‌లో మాత్రం ఇంగ్లాండ్ జట్టును సమరి్థంచాలన్నదే వారికి ఆయన విధించే ఏకైక షరతు! సునాక్ తల్లిదండ్రులు ఇద్దరూ భారత మూకాలున్న వారే. తూర్పు ఆఫ్రికా నుంచి ఇంగ్లాండ్ వెళ్లారు. ఇక ఆయన భార్య అక్షతా మూర్తి నారాయణ మూర్తి, సుధా మూర్తి దంపతుల ఏకైక సంతానం. జీ 20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు భారత్ వస్తున్న నేపథ్యంలో బుధవారం పీటీఐ వార్తా సంస్థకు ఇచి్చన ఇ– మెయిల్ ఇంటర్వ్యూలో రిషి పలు అంశాలు పంచుకున్నారు. సరదా సంగతుల నుంచి భారత్, ఇంగ్లాండ్ ద్వైపాక్షిక బంధం దాకా అన్ని అంశాలనూ స్పృశించారు. భారత మూలాలు తనకెంతో గర్వకారణమని పునరుద్ఘాటించారు రిషి. బ్రిటన్ ప్రధానిగా తాను బాధ్యతలు చేపట్టినప్పుడు భారతీయుల నుంచి వ్యక్తమైన హర్షాతిరేకాలు చెప్పలేని అనుభూతి ఇచ్చాయని గుర్తు చేసుకున్నారు. అత్తామామలతో ముచ్చటించేటప్పుడు భారత రాజకీయాలు, టెక్నాలజీ, ప్రధానిగా బ్రిటన్ను నడిపించడంలో ఆయన ఎదుర్కొంటున్న సమస్యల వంటివి ఎంతమాత్రమూ ప్రస్తావనకు రావని ఒక ప్రశ్నకు బదులుగా రిషి చెప్పారు. ‘ రాజకీయాలను, కుటుంబాన్ని విడిగా ఉంచడం ముఖ్యమని అభిప్రాయపడ్డారు. మోదీతో భేటీ కోసం ఎదురు చూస్తున్నా... ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నట్టు రిషి చెప్పారు. అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కోవడంలో భారత్, ఇంగ్లాండ్ ద్వైపాక్షిక కృషి పాత్రపై లోతుగా చర్చిస్తామన్నారు. గత ఏడాది కాలంలో భారత్‌లో పర్యటించిన తన మంత్రివర్గ సహచరులు రెట్టించిన ఉత్సాహంతో తిరిగొచ్చారని చెప్పారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం భారత్–ఇంగ్లాండ్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరేందుకు మరి కాస్త సమయం పడుతుందని రిషి అభిప్రాయపడ్డారు. కానీ ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 కల్లా రెట్టింపు చేయడమే లక్ష్యంగా అధునాతన ఒప్పందం కుదురుతుందని విశ్వాసం వెలిబుచ్చారు. ‘బ్రిటన్ వాణిజ్య మార్కెట్లో 4.8 కోట్లకు పైగా భారతీయ చిన్న, మధ్యతరహా వ్యాపార సంస్థలున్నాయి. భారత ఎగుమతిదారులకు వాటితో యాక్సెస్ కల్పించేలా ఒప్పందం ఉండాలి. వార్షిక ద్వైపాక్షిక వర్తకం ఇప్పటికే రూ.3.5 లక్షల కోట్లు దాటేసింది‘ అని అన్నారు. ఇంగ్లాండ్‌లో 16 లక్షలకు పైగా భారతీయులున్నారు. భారత్ కు జీ 20 సారథ్యం... జీ 20 సారథ్యానికి భారత్ సరైన దేశమని రిషి అన్నారు. అపార వైవిధ్యానికి నెలవు భారత్. కొన్నేళ్లుగా అన్ని రంగాల్లోనూ అసాధారణ విజయాలు సాధిస్తూ ప్రపంచ దేశాలన్నింటికీ ఆదర్శంగా నిలుస్తోంది. అలాంటి దేశం జీ 20 సదస్సుకు సారథ్యం వహిస్తుండటం సరైన సమయంలో జరుగుతున్న చక్కని ఘటన‘ అని అభిప్రాయపడ్డారు. మోదీ నాయకత్వ సామర్థ్యానికి నిజంగా సెల్యూట్ చేస్తున్నా. ప్రపంచ సారథిగా భారత్ పోషిస్తున్న కీలక పాత్ర నిజంగా శ్లాఘనీయం‘ అన్నారు. ► బ్రిటన్ ప్రధాని కాగానే నేను చేసిన మొదటి పని అధికార నివాసం 10, డౌనింగ్ స్ట్రీట్‌లో దీపావళి విందు ఇవ్వడమే. భవనమంతా విద్యుద్దీపాలు, పూలతో మెరిసిపోతుంటే చూసి చెప్పలేనంత భావోద్వేగానికి లోనయ్యా. ఒక భారతీయునిగా నాకెంతో గర్వకారణమైన విషయమది. ► నా గాథ నిజానికి లోతైన భారత మూలాలున్న ఎంతోమంది బ్రిటన్ వాసుల కథే. ఈ భిన్నత్వంలో ఏకత్వం బ్రిటన్ బలం. ► నేను పాటించే విలువలకు నా భార్య, ఇద్దరు కూతుళ్లు, తల్లిదండ్రులు, అత్తామామలు దారి చూపే దీపాలుగా నిలుస్తారు. ముఖ్యంగా అత్తామామల ఘనతలు చూసి నేనెంతో గరి్వస్తాను. ఏమీ లేని స్థితి నుంచి మొదలై ప్రపంచంలోకెల్లా అతి పెద్ద ఐటీ దిగ్గజ కంపెనీని స్థాపించే దాకా వాళ్ల ప్రస్థానం అందరికీ స్ఫూర్తిదాయకం. భారత్, ఇంగ్లాండ్‌ల్లో వేలాది మందికి అది ఉపాధి కలి్పస్తోంది. ప్రతి పౌరుడూ అలాంటి విజయాన్ని సాధించేందుకు వీలు కలి్పంచేలా బ్రిటన్ను తీర్చిదిద్దాలన్నది నా సంకల్పం. ► జీ 20 సదస్సు కోసం భార్య అక్షతతో కలిసి భారత్ లో పర్యటించనుండటం పట్ల ఎంతో ఉత్సాహంగా ఉన్నా. బిజీ బిజీగా గడిపేలా ఇప్పటికే మొత్తం ప్లానింగ్ చేసుకున్నాం. భారత్‌లో మేం గతంలో వెళ్లాలని అనుకున్న పలు ప్రాంతాలకు వెళ్తాం. -
ఈజిప్ట్‌తో బంధం బలోపేతం
న్యూఢిల్లీ: ఈజిప్టుతో ద్వైపాక్షిక బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని భారత్ నిర్ణయించింది. గణతంత్ర వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ఎల్ సిసి (68)తో ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం సమావేశమయ్యారు. రక్షణ, భద్రత, వర్తకం రంగాలతో పాటు ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లో కూడా పరస్పరం మరింతగా సహకరించుకోవాలని నేతలు నిర్ణయించారు. ముఖ్యంగా సీమాంతర ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. 700 కోట్ల డాలర్లున్న ద్వైపాక్షిక వర్తకాన్ని ఐదేళ్లలో 1,200 కోట్ల డాలర్లకు పెంచాలని నిర్ణయించారు. ఆహార, ఇంధన, ఎరువులు తదితర రంగాలపై రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ప్రభావం తదితరాలు చర్చకు వచ్చాయి. ఐటీ, సైబర్ సెక్యూరిటీ, యువత, సమాచార, సాంస్కృతిక రంగాలకు సంబంధించి ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ఐదు ఒప్పందాలు కుదిరాయి. ‘‘ద్వైపాక్షిక సంబంధాలను వ్యూహాత్మక బంధం స్థాయికి పెంపొందించుకోవాలని భేటీలో నిర్ణయించాం. ఇరు దేశాల వ్యూహాత్మక సహకారం ఆసియా, ఆఫ్రికా ఖండాల్లో శాంతికి, ప్రగతికి బాటలు పరుస్తుంది’’ అని మోదీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రపంచమంతటా ఉగ్రవాదం పెచ్చరిల్లుతుండటంపై ఇరు దేశాలూ ఆందోళనతో ఉన్నాయి. ఇది మానవాళి భద్రతకు అతి పెద్ద సమస్యగా మారిందన్న వాస్తవాన్ని అంగీకరిస్తున్నాయి. ఉగ్రవాద భావజాల వ్యాప్తికి సైబర్ స్పేస్ దుర్వినియోగం చేస్తున్న తీరుకు అడ్డుకట్ట వేసేందుకు చేతులు కలపాలని నిర్ణయించాం’’ అన్నారు. కరోనా, యుద్ధంతో దెబ్బ తిన్న ఆహార, ఫార్మా సరఫరాలను బలోపేతం చేయడంపై చర్చించామన్నారు. చర్చలు అత్యంత ఫలప్రదంగా సాగినట్టు విదేశాంగ శాఖ కార్యదర్శి వినయ్ క్వట్రా తెలిపారు. ఇదే తొలిసారి గణతంత్ర ఉత్సవాలకు ఈజిప్టు అధ్యక్షున్ని ఆహ్వానించడం ఇదే తొలిసారి. ఈజిప్టు సైనిక బృందం కూడా గణతంత్ర పరేడ్‌లో పాల్గొంటోంది. మూడో ఇండియా–ఆఫ్రికా ఫోరం శిఖరాగ్రంలో పాల్గొనేందుకు సిసి 2015లో తొలిసారి భారత్‌లో పర్యటించారు. తర్వాత ఏడాదికే మరోసారి పర్యటించారు. యువతే అతిపెద్ద లబ్ధిదారులు అభివృద్ధి చెందిన భారతదేశంలో యువతే అతిపెద్ద లబ్ధిదారులుగా మారబోతున్నారని ప్రధానినరేంద్ర మోదీ చెప్పారు. భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే అతిపెద్ద బాధ్యత సైతం వారిపైనే ఉందన్నారు. గణతంత్ర పరేడ్‌లో పాల్గొననున్న ఎన్సీసీ కేడెట్లు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ‘‘అమృతకాలంలో దేశ ఆకాంక్షలు, కలలకు యువత ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నేటితరానికి ఎన్నెన్నో అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. భారతదేశం సాధిస్తున్న ఘనతల్లోనే ప్రపంచం తన భవిష్యత్తును వెతుక్కుంటోంది. జాతి లక్ష్యాలు, ఆకాంక్షలతో యువతను ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ అనుసంధానిస్తున్నాయి. యువత మాట్లాడడం ప్రత్యేకమైన అనుభూతినిస్తోంది. భారత్ సారథ్యం వహిస్తున్న జి–20 కూటమి గురించి పాఠశాలలు, కళాశాలల్లో చర్చించుకోవాలి’’ అని సూచించారు. స్వచ్ఛ భారత్ వంటి కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొనాలని యువతను కోరారు. -
ప్రధాని మోదీ ఆకాంక్ష
బ్రసీలియా: తాజా బ్రిక్స్ సదస్సుతో సభ్యదేశాల మధ్య ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలు మరింత బలోపేతం కావాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. రెండు రోజుల పాటు జరగనున్న 11వ బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా) సదస్సులో పాల్గొనేందుకు మోదీ బుధవారం బ్రెజిల్ రాజధాని నగరం బ్రసీలియాకు చేరుకున్నారు. ‘బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు బ్రెజిల్‌కు వచ్చాను. ఈ పర్యటన సందర్భంగా పలువురు ప్రపంచ దేశాధినేతలతో సమావేశమవుతున్నాను’ అని మోదీ ఈ సందర్భంగా ట్వీట్ చేశారు. బ్రిక్స్ సదస్సులో మోదీ పాల్గొనడం ఇది ఆరో సారి కానుంది. బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతల్లో ప్రస్తుతం బ్రెజిల్ ఉంది. ప్రస్తుత బ్రిక్స్ సదస్సును ‘సృజనాత్మక భవిష్యత్తు కోసం ఆర్థిక అభివృద్ధి’ అనే థీమ్‌తో నిర్వహిస్తున్నారు. మోదీకి పుతిన్ ఆహ్వానం బ్రిక్స్ సమావేశాల సందర్భంగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మోదీ భేటీ అయ్యారు. ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పరిపుష్టం చేయడంపై ఇద్దరు చర్చించారు. తరచుగా నిర్వహించే సమావేశాల వల్ల మన సంబంధాలు మరింత పటిష్టమవుతాయని మోదీ అన్నారు. ఈ సందర్భంగా మోదీని పుతిన్ రష్యాకు ఆహ్వానించారు. వచ్చే ఏడాది మే 9న మాస్కోలో నిర్వహించే విక్టరీ డే ఉత్సవాలకు హాజరుకావాలని మోదీని కోరారు. ఇరుదేశాల వాణిజ్యంలో 17 శాతం వృద్ధి నమోదైందన్నారు. -
అమెరికా దూరమవుతోందా ?
భారత్, అమెరికా మధ్య జులై 6న జరగాల్సిన అత్యంత కీలక సమావేశం 2+2 చర్చలను (ఇరు దేశాలకు చెందిన విదేశాంగ మంత్రులు, రక్షణ మంత్రుల మధ్య ముఖాముఖి చర్చలు) అమెరికా రెండోసారి వాయిదా వేసింది. అనివార్య కారణాలతో ఈ ద్వైపాక్షిక చర్చల్ని వాయిదా వేస్తున్నట్టు అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో మన విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌కు ఫోన్లో తెలియజేశారు. ఈ పరిణామంతో భారత, అమెరికా మధ్య దూరం పెరుగుతోందన్న అనుమానాలకు తావిస్తోంది. రెండోసారి చర్చల వాయిదాపై కొంతమంది అంతర్జాతీయ పరిశీలకులు వివిధ కారణాలను విశ్లేషిస్తున్నారు. వాణిజ్య యుద్ధం : యూరోపియన్ యూనియన్, చైనా, భారత్ వంటి దేశాలపై అమెరికా వాణిజ్య యుద్ధాన్ని ప్రకటించి వివిధ దిగుమతులపై భారీగా సుంకాలు పెంచేసింది. భారత్ కూడా అమెరికా నుంచి దిగుమతయ్యే వ్యవసాయ పరికరాలు, ఇనుము, ఉక్కు వంటి 29 ఉత్పత్తులపై సుంకాన్ని పెంచి దెబ్బకి దెబ్బ తీసింది. చాలా ఉత్పత్తులపై భారత్ 100 శాతం సుంకాలు విధిస్తోందంటూ వివిధ సందర్భాల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోవైపు మోటార్ బైక్స్‌ని ఉత్పత్తి చేసే ప్రఖ్యాత హార్లీ డేవిడ్సన్ కంపెనీ అమెరికా వెలుపల కూడా తమ కార్యకలాపాలను ప్రారంభిస్తామని ప్రకటించింది. భారత్‌లోనే ఆ కంపెనీ తన వ్యాపారాన్ని విస్తరిస్తుందని ఊహాగానాలు చెలరేగడం ట్రంప్ సర్కార్‌కి మింగుడు పడడం లేదు. అప్పటికీ మోటార్ సైకిల్స్‌పై 50శాతం వరకు భారత్ పన్ను తగ్గించింది. అయితే భారత్ పూర్తిగా సుంకాలు రద్దు చేయాలని ట్రంప్ పట్టుబడుతున్నారు. రష్యాతో సత్సంబంధాలు : రష్యా నుంచి ఆయుధాలు ముఖ్యంగా ఎస్400 క్షిపణి రక్షణ వ్యవస్థ కొనుగోలు చేయాలన్న భారత్ నిర్ణయం అమెరికాకు ఆందోళన కలిగిస్తోంది. రెండేళ్ల క్రితం జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా ప్రమేయం ఉందన్న అనుమానంతో అమెరికా రష్యాపై ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షల చట్టం ప్రకారం రష్యాతో ఎవరు సత్సంబంధాలు కలిగినా వారిపై తీవ్ర చర్యలు తీసుకునే వీలు ఉంది. అమెరికా హెచ్చరికల్ని ఖాతరు చేయకపోవడంతోభారత్పై కూడా ఆంక్షలు విధించే అంశాన్ని అమెరికా, కాంగ్రెస్ పరిశీలిస్తోంది. చమురు శత్రుత్వం : ఇరాన్ అణు ఒప్పందం నుంచి అమెరికా వైదొలిగిన తర్వాత ఆ దేశం నుంచి ముడి చమురు దిగుమతులు మానేయాలంటూ భారత్‌పై ట్రంప్‌సర్కార్ ఒత్తిడి పెంచుతోంది. నవంబర్ 4 కల్లా చమురు దిగుమతుల్ని పూర్తిగా నిలుపుదల చేయాలని లేదంటే ఆంక్షలు విధిస్తామంటూ ట్రంప్ డెడ్‌లైన్ విధించారు. ఆ హెచ్చరికలపై భారత్ స్పందించకపోవడం అమెరికాకు కంటగింపుగా మారింది. ఐక్యరాజ్యసమితి నిర్ణయాలను తప్ప మరే దేశం ఆదేశాలను పట్టించుకోమన్నది భారత్ విధానం. ఈ కారణంగా భారత్ ఇరాన్ నుంచి చమురు దిగుమతులు ఆపకపోవచ్చునని అమెరికా కాంగ్రెస్‌కు చెందిన పరిశోధనా సంస్థ నివేదిక స్పష్టం చేసింది. ఇలా వివిధ అంశాల్లో ఇరు దేశాల మధ్య విభేదాలు చోటు చేసుకున్న నేపథ్యంలో అమెరికా భారత్‌తో ద్వైపాక్షిక చర్చల్ని వాయిదా వేయడం ఇరు దేశాల మధ్య దూరం పెరుగుతోందని కొందరు చేస్తున్న వాదనలకు బలం చేకూరుతోంది. చైనాతో సంబంధాలు మెరుగవుతాయా ? అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య ఉద్రిక్తతల్ని పెంచి పోషిస్తూ ఉండడం ఆసియాలో అనూహ్యమైన పరిస్థితులకు దారి తీస్తోంది. భారత్, చైనా మధ్య సంబంధాలు కాస్త మెరుగయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారత్‌తో పాటు ఇతర ఆసియా దేశాల నుంచి దిగుమతి చేసుకునే 8,549 ఉత్పత్తులపై చైనా భారీగా సుంకాలు తగ్గించడమో, పూర్తిగా తొలగించడమో చేస్తోంది. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, భారత్ ప్రధాని నరేంద్ర మోదీ ఏప్రిల్‌నుంచి ఇప్పటివరకు రెండు సార్లు సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరిపారు. వాణిజ్య సహకారం పెంచుకోవాలని నిర్ణయించారు. సరిహద్దు, ఇతర సమస్యలపై రెండు దేశాల మధ్య అగాధం అలాగే ఉన్నప్పటికీ, ట్రంప్ వ్యవహారశైలి కారణంగా ఇరు దేశాల మధ్య కొన్ని అంశాల్లో సామరస్య పూర్వక వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని అంతర్జాతీయ వ్యవహారాలను పరిశీలించే లండన్ కాలేజీ ప్రొఫెసర్ హర్ష్ పంత్ అభిప్రాయపడ్డారు. - సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
భారత్‌తో కలిసి పనిచేయడానికి సిద్ధమన్న చైనా
-
భారత్, చైనా రెండు కాదు.. పదకొండు
బీజింగ్ : భారత్‌తో రాజకీయంగా పరస్పర నమ్మకంతో పనిచేయడానికి సిద్ధమని చైనా ప్రకటించింది. ఇరు దేశాల మధ్య సమస్యలను పరస్పర అవగాహనతో, సున్నితత్వంతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని చైనా అభిప్రాయపడింది. ఇండియా తమ సంబంధాలను మెరుగుపర్చుకోవడానికి సానుకూలంగా ఉన్నట్లు చైనా విదేశీ వ్యవహారాల ప్రతినిధి లుకాంగ్ అన్నారు. పరస్పర అభివృద్ధికై రెండు దేశాలు సహకరించుకొని ముందుకెళ్లాలని ఆశాభావం వ్యక్తం చేశారు. డోక్లాం ప్రతిష్టంభన నుంచి బయటపడి ఇరు దేశాలు చెరో మెట్టు దిగి ముందుకు సాగాలని లుకాంగ్ ఆకాక్షించారు. గతేడాది సెప్టెంబర్‌లో భారత్, చైనా దేశాధినేతల మధ్య జరిగిన ఒప్పందాల్ని ఆయన గుర్తు చేశారు. అంతర్జాతీయంగా కొనసాగుతున్న అనిశ్చిత పరిస్థితులను సమిష్టిగా ఎదుర్కోవడానికి, ఇరుదేశాలు వివాదాలకు అతీతంగా కలిసి పనిచేస్తాయని నరేంద్ర మోదీ, జిన్‌పింగ్‌లు ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ సందర్భంగా చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌యీ మాట్లాడుతూ చైనా భారత్ కలిస్తే (1+1=2) రెండు కాదని పదకొండు(11)తో సమానమంటూ వ్యాఖ్యానించారు. 2017లో ఇండియా-చైనా సరిహద్దుల్లో తీవ్ర అలజడి నెలకొంది. చైనా-పాకిస్తాన్ల మధ్య ఎకనమిక్ కారిడార్, పాకిస్తాన్‌కు చెందిన జైషే- ఇ- మహమ్మద్ ఛీఫ్ మసూద్ అజహర్‌ను అంతర్జాతీయ తీవ్రవాదిగా ప్రకటించే విషయంలో చైనా అడ్డుతగలడం, అణు సరఫరా దారుల కూటమిలో భారత్ చేరకుండా చైనా వ్యవహరించిన తీరుతో రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్నాయి. తమ దేశం నుంచి టిబెట్‌ను వేరు చేయాలనుకున్న దలైలమాకు భారత్ ఆశ్రయం కల్సించడం కూడా ఇండియా, చైనాల మధ్య ప్రతిష్టంభనకు కారణమైంది. -
ఎలిఫెంట్ - డ్రాగన్ డాన్స్ చేయాలి
బీజింగ్ : చైనీస్ డ్రాగన్, ఇండియన్ ఎలిఫెంట్ కలిసి డాన్స్ చేయాలే తప్ప కొట్టుకోకూడదని చైనా-భారత్ సంబంధాల గురించి చైనా విదేశాంగశాఖ మంత్రి వాంగ్ యీ వ్యాఖ్యానించారు. ఇరుదేశాల మధ్య తలెత్తిన విబేధాలు సమసిపోవాలంటే సామరస్యంగా పరిష్కరించుకోవాల్సిన అవసరముందని పేర్కొన్నారు. అపుడే ద్వైపాక్షిక ఒప్పందాల అమలు జరుగుతుందన్నారు. పార్లమెంట్ సెషన్లో భాగంగా నిర్వహించిన పత్రికా సమావేశంలో పాల్గొన్న వాంగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. గత సంవత్సర కాలంగా ఇరుదేశాల మధ్య నెలకొన్న విభేదాల గురించి ప్రశ్నించగా... డోక్లాం వివాదం వంటి కొన్నిఅంశాల కారణంగా విభేదాలు తలెత్తినప్పటికీ, చైనా- భారత్ తమ సంబంధాలు మెరుగుపరచుకునేందుకు కృషి చేస్తున్నాయన్నారు. చైనా తన హక్కులు కాపాడుకునేందుకు చట్టబద్ధంగా వ్యవహరిస్తూ ముందుకు సాగుతుందన్నారు. చైనా-భారత్ కలిసి పనిచేస్తే ఒకటి ఒకటి కూడితే రెండు కాదు.. పదకొండు అవుతుందని చమత్కరించారు. తమ మధ్య ఉన్న స్నేహానికి హిమాలయాలు కూడా అడ్డుగా నిలవలేవని వ్యాఖ్యానించారు. గతంలో నెలకొన్న ఘర్షణలు, విభేదాలు మరచిపోయి ఇరు దేశాలు అనుమానాలకు బదులు, నమ్మకాన్ని పెంపొందించుకుని.. సహకారం అందించుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇండో- పసిఫిక్ ప్రాంతంలో భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా అనుసరిస్తున్న విధానాలు చైనా బెల్ట్ రోడ్ ఇనిషియేటివ్ పై ప్రభావం చూపిస్తుందా అన్న ప్రశ్నకు సమాధామివ్వడానికి నిరాకరించారు. బెల్ట్ రోడ్ అంశానికి సుమారు 100 దేశాలు మద్దతునిచ్చాయని, అయినప్పటికీ ఈ విషయమై మీడియా అత్యుత్సాహం చూపిస్తోందని విమర్శించారు. ఆసియా దేశాలు, ఆఫ్రికా, చైనా, యూరప్‌ల మధ్య అనుసంధానానికి ఉద్దేశించిన ఈ నిర్మాణాన్ని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారన్నారు. కాగా ఈ నిర్మాణంతో, చైనా-పాక్ ఎకనమిక్ కారిడార్ అనుసంధానమై ఉండటంతో భారత్ దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ గుండా నిర్మిస్తున్న చైనా- పాక్ ఎకనమిక్ కారిడార్, జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజహర్‌ను అంతర్జాతీయ తీవ్రవాదిగా గుర్తించాలంటూ ఐక్యరాజ్య సమితిలో వ్యక్తమైన అభిప్రాయాలను చైనా వ్యతిరేకించడం, అణు సరఫరాదారుల బృందంలో భారత్ చేరకుండా అడ్డుపడటం వంటి అంశాల్లో ఇరు దేశాల మధ్య విభేదాలు నెలకొన్నాయి. గతేడాది 73 రోజులపాటు భారత్- చైనాలు డోక్లాం కోసం బలగాలు మొహరించాయి. పలు చర్చల అనంతరం ఆగస్ట్ 28 తర్వాత చైనా తన సైన్యాన్ని ఉపసంహరించుకుని, అక్రమంగా చేపట్టిన రోడ్డు నిర్మాణాన్ని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
అమెరికాతో స్నేహానికి భారత్ ప్రయత్నం
వాషింగ్టన్: అమెరికాలో భారతీయులపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ కార్యదర్శి జయశంకర్ గురువారం అమెరికా జాతీయ భద్రతా సలహదారు లెఫ్టినెంట్ జనరల్ హెచ్ ఆర్ మెక్ మాస్టర్‌తో వైట్ హౌస్‌లో భేటి అయ్యారు. ఈ భేటిలోఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు, ఉగ్రవాదం నిర్మూలన, విద్వేషపూరిత దాడులపై చర్చించారు. ఈ సమావేశంలో ముఖ్యంగా భారత్-అమెరికా భద్రతా సంబంధాలు, రక్షణలో సహకారం తదితర ఒప్పందాలు జరిగాయి. ఆ తర్వాత వైట్ హౌస్ స్పీకర్ పాల్ ర్యాన్‌తో కూడా జయశంకర్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఇటీవల అమెరికాలో చనిపోయిన భారత పౌరుడు శ్రీనివాస్ కూచిభోట్లకు నివాళులు అర్పించారు. ఇరు దేశాల ఆర్ధిక వ్యవహారాలు, రక్షణ సహకారాలపై చర్చించారు. స్వేచ్ఛ, ప్రజాస్వామ్య విలువలు ఇరుదేశాల బంధాలకు మూలాలని ర్యాన్ భేటి అనంతరం తెలిపారు. కొత్త అమెరికా ప్రభుత్వంలోని అధికారులను జయశంకర్ వరుసగా కలుస్తున్నారు. ఇరుదేశాల మధ్య స్నేహాపూర్వక వాతావరణం నెలకొల్పడమే లక్ష్యంగా ఆయన పర్యటన కొనసాగనుంది. -
చైనా ఉత్పత్తులను నిషేధిస్తే.. ఇక అంతేనట!
స్వదేశీ వస్తు రక్షణ విధానం కోసం చైనీస్ కంపెనీలకు వ్యతిరేకంగా భారత తీసుకుంటున్న చర్యలపై ఆ దేశ మీడియా కఠిన హెచ్చరికలు చేసింది. తూర్పు ఆసియా దేశం నుంచి ఉత్పత్తులను బాయ్‌కాట్ చేయడం అంత మంచి కాదంటూ పేర్కొంది. రాజకీయ సమస్య కారణాలతో మాతో తెగదెంపులు చేసుకోవాలనుకుంటే ఇరు దేశాల మధ్య కేవలం ద్వైపాక్షిక సంబంధాలే కాక, భారత్‌కు వాణిజ్య లోటు ఏర్పడుతుందని ఆ దేశ మీడియా తెలిపింది. గ్లోబల్ టైమ్స్ పత్రిక జాతీయ టాబ్లాయిడ్లో ఇరు దేశాల మధ్య దౌత్య పరమైన ఆర్థిక పర ఒప్పందాలపై రెండు ప్రత్యేక కథనాలు ప్రచురించింది. భారత్ వంటి అతిపెద్ద మార్కెట్లోకి చైనీస్ ఉత్పత్తులను ఎలాంటి అవరోధాలు లేకుండా అనుమతించాలని ఈ కథనాల్లో పేర్కొంది. ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాక్ట్ర్చర్ను విస్తరించుకోవడానికి, మెరుగుపరుచుకోవడానికి భారత్ దృష్టిసారించాలని ఉచిత సలహాలు ఇచ్చింది. రేపటి నుంచి గోవాలో జరుగబోతున్న బ్రిక్స్ సదస్సులో భారత ప్రధాని నరేంద్రమోదీ, ఆ దేశ అధ్యక్షుడు క్సి జిన్‌పింగ్‌లు వాణిజ్య లోటుపై చర్చించబోరని అంచనావేస్తున్నట్టు ఈ కథనంలో పేర్కొంది. కానీ ఈ సమస్య మాత్రం పట్టిపడీస్తూనే ఉంటుందని తెలిపంది. ఓ ఆర్టికల్‌లో చైనీస్ గవర్నమెంట్ విడుదలచేసిన గణాంకాలను ప్రస్తావించింది. చైనా నుంచి ఎక్కువగా ఎగుమతి చేసుకునే వాటిలో ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్, టెలికాం పరికరాలు, కెమికల్, ఫార్మాస్యూటికల్ ప్రొడక్ట్స్ ఉన్నాయని, అదేవిధంగా భారత్ ఎక్కువగా ఎగుమతి చేసే వాటిలో ఓర్, ప్లాస్టిక్, కాటన్లు ఉన్నాయని తెలిపింది. అదేవిధంగా చైనాకు భారత్ ఎగుమతిచేసే ఉత్పత్తులు 922 మిలియన్ డాలర్లుండగా.. చైనా నుంచి భారత్ దిగుమతి చేసుకునేవి 5.4 బిలియన్ డాలర్లుగా ఉన్నట్టు పేర్కొంది. 2015-16 ప్రథమార్థంలో భారత గణాంకాల పరంగా ద్వైపాక్షిక వాణిజ్యం 72.34 బిలియన్ డాలర్లనుంచి 70.73 బిలియన్ డాలర్లకు పడిపోయినట్టు తెలిపింది. అయితే వాణిజ్య లోటు ఎంత ఏర్పడుతుందనే దానిపై సరియైన వివరణ ఇవ్వలేదు. భారత వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి చైనాతో వాణిజ్య లోటు ఎక్కువగా పెరగడానికి ప్రధాన కారణం ఆ దేశం నుంచి ఎక్కువగా ఉత్పత్తులను దిగుమతి చేసుకోవడమేనని ఆగస్టులో పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో వెల్లడించారు. ఎగుమతులు పెంచుకోవాలని, మార్కెట్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ఇక్కడే ఉత్పత్తులను, సర్వీసులను తయారుచేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే వాణిజ్య లోటును తగ్గించుకోవడానికి భారత్, చైనీస్ స్మార్ట్‌ఫోన్ కంపెనీ ఎక్కువగా ఆకట్టుకుంటుందని, తయారీ ప్లాంటులను నెలకొల్పడానికి అనుమతులు ఇస్తున్నట్టు ఈ కథనాల్లో వివరించింది. అంతేకాక దేశీయ సంస్కరణలను కూడా భారత్ ప్రవేశపెడుతుందని, దీంతో చైనీస్ పెట్టుబడులను ఎక్కువగా ఆకట్టుకుంటుందని తెలిపింది. కానీ ఓ వైపు చైనీస్ పెట్టుబడులను ఆకట్టుకుంటూనే, మరోవైపు చైనీస్ ఉత్పత్తులను భారత్ బాయ్‌కాట్ చేస్తుందని ఆ దేశ మీడియా ఆరోపించింది. మొదటిసారి ఏఫ్రిల్‌లో కశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాలకు నిర్వర్తించడానికి మిలిటెంట్ గ్రూపు జైషే-ఈ-మహ్మముద్కు చైనా సహకరిస్తుందనే ఆరోపణలతో బాయ్ కాట్ చేసింది. అనంతరం జూలైలో న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్‌లో భారత్ చేరికకు చైనా సరియైన మద్దతు ఇవ్వకపోవడంతో మరోసారి, ప్రస్తుతం భారత్-పాక్ దేశాల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణ పరిస్థితుల్లో చైనా ఉత్పత్తులను భారత్ నిషేధిస్తోంది. ఈ చర్యలు భారత్‌కు వాణిజ్య లోటు తగ్గడానికి సహకరించవని, ఇరు దేశాల ద్వైపాక్షిక ఒప్పందాల దెబ్బతీయడానికే ఇవి దోహదం చేస్తాయని గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. -
భారత్‌పై చైనా కొత్త పల్లవి!
బీజింగ్: అణు సరఫరాదారుల బృందం (ఎన్ఎస్జీ)లో భారత సభ్యత్వానికి సర్వశక్తులొడ్డి మోకాలడ్డిన చైనా.. తాజాగా మన దేశంతో సంబంధాలపై కొత్త పల్లవి అందుకుంది. భారత్-చైనా ద్వైపాక్షిక సంబంధాల అభివృద్ధికి ఇరుదేశాల మధ్య నెలకొన్న సరిహద్దు వివాదంతోపాటు కొత్తగా తెరపైకి వస్తున్న అంశాలు పెద్ద సవాలుగా మారుతున్నాయని ఆ దేశం సన్నాయి నొక్కులు నొక్కుతోంది. ‘పొరుగుదేశాలైన భారత్-చైనా సంబంధాల అభివృద్ధికి చరిత్రాత్మకమైన అంశమైన సరిహద్దు వివాదంతోపాటు కొత్తగా తెరపైకి వస్తున్న అంశాలు అడ్డుగా ఉన్నాయి. ఈ అంశాలను ఎలా ఎదుర్కోవాలని అనేది ఇరుదేశాలకు పెద్ద సవాలుగా మారింది’ అని చైనా విదేశాంగ సహాయమంత్రి లీ హుయిలై చెప్పారు. పీటీఐ వార్తాసంస్థతో మాట్లాడిన లీ కొత్తగా తెరపైకి వస్తున్న అంశాలు ఏమిటన్న దానిపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. తాజాగా చైనాలో పర్యటించిన కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ సరిహద్దు వివాదం, ఇతర వివాదాలు భారత్-చైనా ద్వైపాక్షిక సంబంధాలపై కనీస ప్రభావాన్ని మాత్రమే చూపే అవకాశముందని పేర్కొనగా.. చైనా మాత్రం ఈ కొత్త రాగాన్ని తెరపైకి తెచ్చింది.