చైనా ఉత్పత్తులను నిషేధిస్తే.. ఇక అంతేనట!
చైనా ఉత్పత్తులను నిషేధిస్తే.. ఇక అంతేనట!
Published Fri, Oct 14 2016 1:09 PM | Last Updated on Mon, Aug 13 2018 3:30 PM
స్వదేశీ వస్తు రక్షణ విధానం కోసం చైనీస్ కంపెనీలకు వ్యతిరేకంగా భారత తీసుకుంటున్న చర్యలపై ఆ దేశ మీడియా కఠిన హెచ్చరికలు చేసింది. తూర్పు ఆసియా దేశం నుంచి ఉత్పత్తులను బాయ్కాట్ చేయడం అంత మంచి కాదంటూ పేర్కొంది. రాజకీయ సమస్య కారణాలతో మాతో తెగదెంపులు చేసుకోవాలనుకుంటే ఇరు దేశాల మధ్య కేవలం ద్వైపాక్షిక సంబంధాలే కాక, భారత్కు వాణిజ్య లోటు ఏర్పడుతుందని ఆ దేశ మీడియా తెలిపింది. గ్లోబల్ టైమ్స్ పత్రిక జాతీయ టాబ్లాయిడ్లో ఇరు దేశాల మధ్య దౌత్య పరమైన ఆర్థిక పర ఒప్పందాలపై రెండు ప్రత్యేక కథనాలు ప్రచురించింది. భారత్ వంటి అతిపెద్ద మార్కెట్లోకి చైనీస్ ఉత్పత్తులను ఎలాంటి అవరోధాలు లేకుండా అనుమతించాలని ఈ కథనాల్లో పేర్కొంది. ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాక్ట్ర్చర్ను విస్తరించుకోవడానికి, మెరుగుపరుచుకోవడానికి భారత్ దృష్టిసారించాలని ఉచిత సలహాలు ఇచ్చింది.
రేపటి నుంచి గోవాలో జరుగబోతున్న బ్రిక్స్ సదస్సులో భారత ప్రధాని నరేంద్రమోదీ, ఆ దేశ అధ్యక్షుడు క్సి జిన్పింగ్లు వాణిజ్య లోటుపై చర్చించబోరని అంచనావేస్తున్నట్టు ఈ కథనంలో పేర్కొంది. కానీ ఈ సమస్య మాత్రం పట్టిపడీస్తూనే ఉంటుందని తెలిపంది. ఓ ఆర్టికల్లో చైనీస్ గవర్నమెంట్ విడుదలచేసిన గణాంకాలను ప్రస్తావించింది. చైనా నుంచి ఎక్కువగా ఎగుమతి చేసుకునే వాటిలో ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్, టెలికాం పరికరాలు, కెమికల్, ఫార్మాస్యూటికల్ ప్రొడక్ట్స్ ఉన్నాయని, అదేవిధంగా భారత్ ఎక్కువగా ఎగుమతి చేసే వాటిలో ఓర్, ప్లాస్టిక్, కాటన్లు ఉన్నాయని తెలిపింది. అదేవిధంగా చైనాకు భారత్ ఎగుమతిచేసే ఉత్పత్తులు 922 మిలియన్ డాలర్లుండగా.. చైనా నుంచి భారత్ దిగుమతి చేసుకునేవి 5.4 బిలియన్ డాలర్లుగా ఉన్నట్టు పేర్కొంది. 2015-16 ప్రథమార్థంలో భారత గణాంకాల పరంగా ద్వైపాక్షిక వాణిజ్యం 72.34 బిలియన్ డాలర్లనుంచి 70.73 బిలియన్ డాలర్లకు పడిపోయినట్టు తెలిపింది. అయితే వాణిజ్య లోటు ఎంత ఏర్పడుతుందనే దానిపై సరియైన వివరణ ఇవ్వలేదు.
భారత వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి చైనాతో వాణిజ్య లోటు ఎక్కువగా పెరగడానికి ప్రధాన కారణం ఆ దేశం నుంచి ఎక్కువగా ఉత్పత్తులను దిగుమతి చేసుకోవడమేనని ఆగస్టులో పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో వెల్లడించారు. ఎగుమతులు పెంచుకోవాలని, మార్కెట్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ఇక్కడే ఉత్పత్తులను, సర్వీసులను తయారుచేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే వాణిజ్య లోటును తగ్గించుకోవడానికి భారత్, చైనీస్ స్మార్ట్ఫోన్ కంపెనీ ఎక్కువగా ఆకట్టుకుంటుందని, తయారీ ప్లాంటులను నెలకొల్పడానికి అనుమతులు ఇస్తున్నట్టు ఈ కథనాల్లో వివరించింది. అంతేకాక దేశీయ సంస్కరణలను కూడా భారత్ ప్రవేశపెడుతుందని, దీంతో చైనీస్ పెట్టుబడులను ఎక్కువగా ఆకట్టుకుంటుందని తెలిపింది. కానీ ఓ వైపు చైనీస్ పెట్టుబడులను ఆకట్టుకుంటూనే, మరోవైపు చైనీస్ ఉత్పత్తులను భారత్ బాయ్కాట్ చేస్తుందని ఆ దేశ మీడియా ఆరోపించింది. మొదటిసారి ఏఫ్రిల్లో కశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాలకు నిర్వర్తించడానికి మిలిటెంట్ గ్రూపు జైషే-ఈ-మహ్మముద్కు చైనా సహకరిస్తుందనే ఆరోపణలతో బాయ్ కాట్ చేసింది. అనంతరం జూలైలో న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్లో భారత్ చేరికకు చైనా సరియైన మద్దతు ఇవ్వకపోవడంతో మరోసారి, ప్రస్తుతం భారత్-పాక్ దేశాల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణ పరిస్థితుల్లో చైనా ఉత్పత్తులను భారత్ నిషేధిస్తోంది. ఈ చర్యలు భారత్కు వాణిజ్య లోటు తగ్గడానికి సహకరించవని, ఇరు దేశాల ద్వైపాక్షిక ఒప్పందాల దెబ్బతీయడానికే ఇవి దోహదం చేస్తాయని గ్లోబల్ టైమ్స్ పేర్కొంది.
Advertisement