
న్యూఢిల్లీ : భారత్‌తో కరోనా విజృంభిస్తోంది. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 93,337 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం బాధితులసంఖ్య 53,08,015 చేరింది. అయితే రికవరీ రేటు సైతం భారీగానే నమోదవుతుంది. గడిచిన 24 గంటల్లో 1247 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 85,619కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 42,08,432కు చేరుకోగా, యాక్టివ్ కేసుల సంఖ్య10,13,964గా ఉంది. దేశ వ్యాప్తంగా నమోదైన మొత్తం కరోనా కేసుల్లో యాక్టివ్ కేసులు 19.52 శాతం ఉన్నాయి. దేశంలో కరోనా రికవరీ రేటు 78.86 శాతానికి పెరగ్గా, మరణాల రేటు 1.62 శాతానికి పడిపోయిందని కేంద్రం తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment