సాక్షి, న్యూఢిల్లీ: భారత దేశంలో కరోనా వైరస్ వ్యాక్సినేషన్ ప్రక్రియ చాలా వేగంగా జరుగుతోంది. దేశ వ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సిన్ కార్యక్రమం జనవరి 16న ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాగాజా శుక్రవారం దేశవ్యాప్తంగా అత్యధిక కోవిడ్ టీకా డోసులను ప్రజలకు పంపిణీ చేసి రికార్డు సృష్టించినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది. కోవిడ్ టీకా డ్రైవ్ ప్రారంభమై శుక్రవారం నాటికి 56 రోజులు అవుతుండగా రికార్డు స్థాయిలో ఒకే రోజు 20 లక్షల మందికి కరోనా టీకా డోసులను అందించినట్లు తెలిపింది. ఒకే రోజు 30,561 టీకా సెషన్లతో ఈ రికార్డు సృష్టించారని వెల్లడించింది.
ఇక దేశవ్యాప్తంగా 2,82,18,457 కరోనా వ్యాక్సిన్ డోసులను 4,86,314 టీకా సెషన్ల ద్వారా అందించారు. శుక్రవారం కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో 20,53,537 కరోనా డోసుల పంపిణీతో ఎనిమిది రాష్ట్రాల్లో 74శాతం వ్యాక్సినేషన్‌న్ పూర్తి చేసినట్లు పేర్కొంది. ఉత్తరప్రదేశ్ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉందని, 24 గంటల్లో యూపీలో మొత్తం 3.3 లక్షల మందికి కోవిడ్ వ్యాక్సిన్‌ను అందించినట్లు కేంద్రం వెల్లడించింది. ఇక గడిచిన 24 గంటలో దేశవ్యాప్తంగా 24,882 కొత్త కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 19,957 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్ బులిటెన్‌ను విడుదల చేసింది.
చదవండి:
100 రోజుల్లో 100 మిలియన్ల టీకాలే లక్ష్యం
ఆస్ట్రాజెనికా టీకాపై డబ్ల్యూహెచ్‌ఓ కీలక వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment