సాక్షి,న్యూఢిల్లీ: కరోనా వైరస్ రోజవారీ కేసుల నమోదు గణనీయంగా తగ్గుతూ వస్తోంది. శనివారం నాటి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం గడిచిన 24 గంటల్లో 60,753 కొత్త కేసులు నమోదయ్యాయి. అలాగే రికవరీ రేటు శాతం 96.16 శాతంగా ఉంది. దేశంలో 74 రోజులు తరువాత అతి తక్కువ రోజువారీ కేసుల నమోదు ఇదేననిరికవరీ శాతంగా బాగా పుంజుకుందని మంతత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక మరణాల సంఖ్య కూడా క్రమంగా తగ్గుతూ వస్తోంది.1647 మరణాలు సంభవించాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య మూడు కోట్లకు(2,98,23,546) చేరువలోఉంది. అలాగే కరోనా కారణంగా ఇప్పటివరకూ మొత్తం 3,85,137 మంది కన్నుమూశారు. 7,60,019 యాక్టివ్ కేసులున్నాయి. 97,743 మంది డిశ్చార్జ్ అయ్యారు.
చదవండి : కోవిడ్ ముప్పు: అత్యవసర చర్యలపై లాన్సెట్ కీలక హెచ్చరిక
Comments
Please login to add a commentAdd a comment