అరబ్‌ దేశాలకు విమానాల రద్దు! | Bengaluru Passengers Stranded As Dubai Airport Closes Amid Iran-US-Israel Tensions | Sakshi
Sakshi News home page

అరబ్‌ దేశాలకు విమానాల రద్దు!

Mar 1 2026 8:06 AM | Updated on Mar 1 2026 1:06 PM

Iran Attacks Dubai

యశవంతపుర(బెంగళూరు): ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ దేశాల యుద్ధంతో దుబాయ్‌ విమానాశ్రయంలో చిక్కుకుపోయినట్లు జేడీఎస్‌ ఎమ్మెల్సీ భోజేగౌడ తెలిపారు. యుద్ధం నేపథ్యంలో దుబాయ్‌ విమానాశ్రయాన్ని మూసివేయడంతో ఆయనతో పాటు బెంగళూరుకు రావాల్సిన అనేకమంది చిక్కుకున్నారు. అలాగే బెంగళూరు నుంచి దుబాయ్, అరబ్‌ దేశాలకు వెళ్లాల్సిన పలు విమానాలు రద్దయినట్లు తెలిసింది. దీని వల్ల వందలాది ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. ఇరాన్, సౌదీ, యూఏఈ, ఖతార్, బహ్రెయిన్‌ వంటి దేశాలకు మళ్లీ ఎప్పుడు విమానాలు వెళ్తాయో తెలియక బెంగళూరు ఎయిర్‌పోర్టులో ప్రయాణికులు అయోమయానికి గురవుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement