సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్లు ఫేస్‌బుక్, ట్విట్టర్‌లలో సెలబ్రిటీల ‘మనసులోని మాట’లు తాజాగా ఇలా...!
బడ్జెట్ దాటుతోంది
ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతల స్థాయి పెరగకుండా ఉండాలంటే, మనం వాతావరణంలోకి ఉద్గారం చేయ వలసిన కార్బన్ డై ఆక్సైడ్‌కు ఒక పరిమితి ఉంటుంది. కానీ మనం ఈ ‘కార్బన్ బడ్జెట్’ను మితిమీరి ఉపయో గిస్తున్నాం. ముఖ్యంగా శిలాజ ఇంధనాలు మండించడం, అడవులను నరకడం లాంటి చర్యల వల్ల.
– ఎడ్ హాకిన్స్, క్‌లైమేట్ సైంటిస్ట్
లక్షమంది భద్రం
అసామాన్యమైన ప్రమాదాలు, సంకటాలు ఉన్నప్పటికీ, కొద్ది రోజుల సమయంలోనే మేము లక్ష మందికిపైగా అఫ్గానిస్తాన్ నుంచి ఖాళీ చేయించగలిగాం. మేము మా మిషన్‌ను పూర్తి చేస్తాం, చేయగలం. మమ్మల్ని తీవ్రవాదులు ఆపలేరు. వారిని మా మిషన్‌ను ఆపనివ్వం. మా తరలింపును కొనసాగిస్తాం.
– జో బైడెన్, అమెరికా అధ్యక్షుడు
అసలైన పవర్
ఎవరైనా మన మనసు పాడుచేసినా కూడా మర్యాదగా, స్థిమితంగా ఉండగలిగే సామర్థ్యమే సూపర్‌పవర్.
– వాలా అఫ్షార్, డిజిటల్ ఇవాంజెలిస్ట్
నీళ్లింకా అందాలి
గ్రామీణ భారతంలో కేవలం 42 శాతం కుటుంబాలకు మాత్రమే నల్లా నీటి కనెక్షన్లు ఉన్నాయి. జల్ జీవన్ మిషన్ గణాంకాలు అదే చెబుతున్నాయి. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం చేయాల్సింది చాలా ఉంది.
– పూజా దంతేవాడియా, డేటా జర్నలిస్ట్
మనలాంటిదే
నేను ఎల్లప్పుడూ అమెరికా అనేది శాస్త్రీయ తకు ప్రాధాన్యత ఇచ్చే దేశమనీ, అక్కడ బూటకపు వైద్యాన్ని నిరో ధించడానికి ఎన్నో నియంత్రణలు ఉంటా యనీ నమ్మాను. కానీ హైడ్రాక్సీ క్లోర్లోక్విన్ వ్యవహారం, ఐవర్‌మెక్టిన్ స్కాములు, సెలబ్రిటీ వైద్యులు, టీకాల వ్యతిరేకులు, మాస్కుల వ్యతిరేకులు, రిపబ్లికన్ పార్టీ నా నమ్మకాన్ని పోగొట్టాయి.
– మధు పాయ్, ప్రొఫెసర్
వాస్తవాలు చెప్పరేం!
గ్రామీణ భారతంలో ఆగస్ట్ 15, 2019 నాటికి నల్లా నీటి కనెక్షన్లు ఉన్న కుటుంబాలు 16.85 శాతం. రెండేళ్లుగా కోవిడ్ మహమ్మారి, లాక్‌డౌన్లు ఉన్నప్పటికీ మోదీ ప్రభుత్వం ఈ 16.85 శాతాన్ని 41.79 శాతానికి చేర్చింది. 1947 నుంచి ఏ ప్రభుత్వం కూడా నల్లా తిప్పితే నీళ్లు రావడం గురించి ఆలోచించలేదు. అయినా దీన్ని ‘42 శాతం మాత్రమే’ అనడం అంటే అసలు వాస్తవాలను మరుగుపరచడమే.
– కాంచన్ గుప్తా, కేంద్రప్రభుత్వ సలహాదారు
ఇంత దిగజారడమా?
మిలిటెంట్ల ఆధీనంలోని విమానాశ్రయంలోకి ప్రవేశిం^è డానికిగానూ ఒక షరతుగా అమెరికా పౌరులు, అమెరికాకు సహాయం చేసిన అఫ్గాన్ పౌరుల పేర్లను అమెరికా అధికారులు తాలిబన్లకు అందించారు. సహజంగానే ఈ పేర్లున్న అందరినీ చంపాల్సిన జాబితాలో పెట్టారని ఒక రక్షణ అధికారి చెబుతున్నారు. ఆగస్ట్ 31 తర్వాత వారి పరిస్థితి ఏమిటి?
– లారా సెలిగ్‌మాన్, జర్నలిస్ట్
Comments
Please login to add a commentAdd a comment