సంచలనం రేపిన వీడియో: ‘రూ. కోటి ఇస్తాను.. ఆ బీజేపీ ఎమ్మెల్యేను ఫినిష్‌ చేయ్‌’ | Karnataka Congress Leader Caught on Camera Planning Murder of BJP MLA | Sakshi
Sakshi News home page

సంచలనం రేపిన వీడియో: ‘రూ. కోటి ఇస్తాను.. ఆ బీజేపీ ఎమ్మెల్యేను ఫినిష్‌ చేయ్‌’

Published Wed, Dec 1 2021 6:57 PM | Last Updated on Wed, Dec 1 2021 7:11 PM

Karnataka Congress Leader Caught on Camera Planning Murder of BJP MLA - Sakshi

Karnataka Congress Leader Caught on Camera Planning Murder of BJP MLA: కాంగ్రెస్ నేతకు సంబంధించిన ఓ వీడియో తాజాగా కర్ణాటకలో రాజకీయ కలకలం సృష్టిస్తోంది. బీజేపీ ఎమ్మెల్యేను ఫినిష్‌ చేయ్‌. నీకు కోటి రూపాయలు ఇస్తాను అంటూ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఓ వ్యక్తితో మాట్లాడిన వీడియో సంచలనం సృష్టిస్తోంది. ఆ వివరాలు..

కర్ణాటక కాంగ్రెస్‌ నాయకుడు గోపాలక్రిష్ణ, ఓ వ్యక్తితో మాట్లాడుతూ... యలహంక బీజేపీ ఎమ్మెల్యే ఎస్‌ఆర్‌ విశ్వనాధ్‌ను హత్య చేయాలని కోరుతున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మూడు నిమిషాల వ్యవధి ఉన్న ఈ వీడియోలో గోపాలక్రిష్ణ ఓ వ్యక్తితో మాట్లాడుతూ ఉంటాడు. ‘‘ఆ బీజేపీ ఎమ్మెల్యేని(విశ్వనాథ్‌) ఫినిష్‌ చేయ్‌. చంపేయ్‌. నీకు కోటి రూపాయలు ఇస్తాను. దీని గురించి ఎవరికి తెలియదు. ఈ విషయం మన ఇద్దరి మధ్యే ఉంటుంది’’ అని గోపాలక్రిష్ణ అవతలి వ్యక్తికి చెప్తాడు. 
(చదవండి: 1,744 కోట్ల ఆస్తి.. రహస్య వ్యాపారాలు లేవు)

ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌​ కావడంతో పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు ప్రారంభించారు. ఈ వీడియో ఎప్పటిది అనే దాని గురించి ఎలాంటి సమాచారం లేదన్నారు పోలీసులు. ఈ విషయం పెద్దది కావడంతో కర్ణాటక హోం మంత్రి అరగ జ్ఞానేంద్ర దీనిపై స్పందించారు. పోలీసులు దీని గురించి తీవ్రంగా విచారిస్తున్నారు. విశ్వనాథ్‌ దీని గురించి నాతో మాట్లాడారు అని జ్ఞానేంద్ర తెలిపారు.
(చదవండి: పార్లమెంట్‌లో కాంగ్రెస్‌తో సమన్వయంపై ఆసక్తి లేదు)

‘‘ఈ వీడియో గురించి మంగళవారం రాత్రి నాకు తెలిసింది. ఇప్పటికే పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. విశ్వనాథ్‌కు భద్రత కల్పించాలని భావిస్తున్నాం. ఇంటిలిజెన్స్‌ శాఖ దీనిపై నిర్ణయం తీసుకుంటుంది. ప్రస్తుతం పోలీసులు ఈ విషయాన్ని పరిశీలిస్తున్నారు’’ అని అరగ జ్ఞానేంద్రతెలిపారు. 

చదవండి: ఆ వారసత్వం నేటికీ రేపటికీ అవసరమే! 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement