చిన్నారి వేదిక (ఫైల్ ఫొటో)
కోజికోడ్: అప్పటిదాకా ఆ చిన్నారి ఆటలు, బోసినవ్వులు, వచ్చిరానీ మాటలు చూసి మురిసిపోయిన ఆ తల్లిదండ్రులకు.. ఒక్కసారిగా గుండె ఆగిపోయినంత పని అయ్యింది. బాటిల్ క్యాప్ మింగేయడంతో ఊపిరి ఆడక ఆ చిన్నారి ఎంత విలవిలలాడిపోయిందో?. చివరికి.. ఆ తల్లిదండ్రులకు గుండె కోత మిగిలింది.
కేరళ కోజికోడ్ ముక్కమ్‌లో ఆదివారం ఈ విషాదం చోటు చేసుకుంది. మూడేళ్ల వేదిక, తల్లిదండ్రులు బీజూ, ఆర్యలతో కలిసి ఆడుకుంది. అక్కడే ఉన్న ఓ వాటర్ బాటిల్ క్యాప్‌ను మింగేసింది ఆ చిన్నారి.
దీంతో ఊపిరి ఆడక విలవిలలాడిపోవడంతో.. ముక్కమ్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి, అక్కడి నుంచి కోజికోడ్ మెడికల్ కాలేజీకి తీసుకెళ్లారు. అయితే చికిత్స అందినప్పటికీ అప్పటికే ఊపిరి అందడంలో జాప్యం జరగడంతో ఆ చిన్నారి కన్నుమూసింది.
Comments
Please login to add a commentAdd a comment