Bottle -cap
-
అయ్యో వేదిక.. చిన్నారి ఊపిరి తీసిన బాటిల్ క్యాప్
కోజికోడ్: అప్పటిదాకా ఆ చిన్నారి ఆటలు, బోసినవ్వులు, వచ్చిరానీ మాటలు చూసి మురిసిపోయిన ఆ తల్లిదండ్రులకు.. ఒక్కసారిగా గుండె ఆగిపోయినంత పని అయ్యింది. బాటిల్ క్యాప్ మింగేయడంతో ఊపిరి ఆడక ఆ చిన్నారి ఎంత విలవిలలాడిపోయిందో?. చివరికి.. ఆ తల్లిదండ్రులకు గుండె కోత మిగిలింది. కేరళ కోజికోడ్ ముక్కమ్‌లో ఆదివారం ఈ విషాదం చోటు చేసుకుంది. మూడేళ్ల వేదిక, తల్లిదండ్రులు బీజూ, ఆర్యలతో కలిసి ఆడుకుంది. అక్కడే ఉన్న ఓ వాటర్ బాటిల్ క్యాప్‌ను మింగేసింది ఆ చిన్నారి. దీంతో ఊపిరి ఆడక విలవిలలాడిపోవడంతో.. ముక్కమ్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి, అక్కడి నుంచి కోజికోడ్ మెడికల్ కాలేజీకి తీసుకెళ్లారు. అయితే చికిత్స అందినప్పటికీ అప్పటికే ఊపిరి అందడంలో జాప్యం జరగడంతో ఆ చిన్నారి కన్నుమూసింది. -
‘బాటిల్‌ని తన్నకండి.. నీటిని కాపాడండి’
సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక చాలెంజ్ ట్రెండ్ అవుతూనే ఉంటుంది. కొన్ని రోజుల క్రితం వరకూ ‘కీకీ చాలెంజ్’, ‘10 ఇయర్స్ చాలెంజ్’ అంటూ వివిధ రకాల చాలెంజ్‌లు సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ జాబితాలో ‘బాటిల్ క్యాప్ చాలెంజ్’ చేరింది. కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోన్న ఈ ‘బాటిల్ క్యాప్ చాలెంజ్’లో సెలబ్రిటీల నుంచి రాజకీయ నేతల వరకు చాలా మంది పాల్గొన్నారు. అయితే వీరిలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్, హాలీవుడ్ నట దిగ్గజం జాసన్ స్టాథమ్,అమెరికా గాయకుడు జాన్ మేయర్లు విజయవంతంగా బాటిల్ క్యాప్‌ను ఒకే కిక్‌తో తీశారు. మరి కొందరేమో చేత్తో మూత తీసి నీళ్లు తాగేసి గెలిచేశాం అని చెప్పుకొన్నారు. అయితే వీరందరి కంటే కాస్త భిన్నంగా ఈ చాలెంజ్‌ని పూర్తి చేశారు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్. అంతేకాక బాటిల్ క్యాప్ చాలెంజ్ ద్వారా అభిమానులకు మంచి సందేశం ఇచ్చారు సల్మాన్. చాలెంజ్‌లో భాగంగా బాటిల్ క్యాప్‌ను నోటితో ఊది నీళ్లు తాగుతూ ‘బాటిల్‌ను తన్నకండి.. నీటిని కాపాడండి’ అన్నారు సల్మాన్. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియోను ఇప్పటివరకు దాదాపు 60 వేల మందికిపైగా లైక్ చేశారు. సల్మాన్ సందేశాన్ని తెగ మెచ్చుకుంటున్నారు నెటిజన్లు -
దమ్ముంటే ఇలా మూత తీయండి..!
-
దమ్ముంటే ఇలా బాటిల్ మూత తీయండి..
మొన్న ఐస్ బకెట్, నిన్న కికి చాలెంజ్... నేడు బాటిల్ క్యాప్ చాలెంజ్. సామాజిక మాధ్యమాల్లో కొత్త చాలెంజ్ రావడానికి ఎంత సమయం పడుతుందో కానీ అది ట్రెండ్ అవడానికి అర క్షణం చాలు..! ఇంటర్నెట్లో ప్రస్తుతం బాటిల్ క్యాప్ చాలెంజ్ హవా నడుస్తోంది. సామాన్యులు, సెలబ్రిటీలు అనే తేడా లేకుండా అందరూ దీని వెంటపడుతున్నారు. ఇది హాలీవుడ్‌ను ఒక ఊపు ఊపేసి బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికే ఎందరో నటులు ఈ చాలెంజ్‌కు సై అంటూ సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేశారు. ప్రస్తుతం గల్లీబాయ్ చిత్రంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సిద్ధాంత్ చతుర్వేది ఈ సవాలును స్వీకరించి దాన్ని దిగ్విజయంగా పూర్తి చేసిన మొదటి బాలీవుడ్ నటుడిగా నిలిచారు. ఇక యూట్యూబ్ స్టార్ భువన్ బామ్ కూడా తనదైన స్టైల్లో కాసింత హాస్యాన్ని జోడించి మరీ బాటిల్ క్యాప్ తీశాడు. స్లో మోషన్లో ఉన్న ఈ వీడియోలో భువన్ కాలితో తన్నకుండా చివర్లో నోటితో తీస్తాడు. భువన్ ఇన్‌స్టాగ్రామ్‌లో అప్లోడ్ చేసిన ఈ వీడియో నవ్వుల్ని పూయిస్తోంది. ‘నీలా ఎవరూ చేయలేరు.. నీకు నువ్వే సాటి’ అంటూ బాలీవుడ్ నటులు జాన్వీకపూర్-ఇషాన్ ఖట్టర్, సిద్ధాంత్లు ప్రశంసలు కురిపించారు. భువన్. బాటిల్ క్యాప్ చాలెంజ్ పూర్తి చేయాలంటూ హార్దిక్ పాండ్యా, విక్కీ కౌశల్, అమాండసెర్నీలకు ట్యాగ్ చేశారు. ‘బాటిల్ క్యాప్ చాలెంజ్’లో బాటిల్ మూతను ముందుగానే కాస్త వదులు చేసి ఉంచుతారు. ఆ తర్వాత కాలితో తన్ని బాటిల్ మూతను తీయాలి.. అదీ బాటిల్ కిందపడకుండా! బాలీవుడ్లో మొదటగా ఈ చాలెంజ్‌లో పాల్గొన్న సిద్ధాంత్ దాన్ని పూర్తి చేయడమే కాక నటుడు ఇషాన్ ఖట్టర్‌కు సవాలు విసిరాడు.మరోవైపు హాలీవుడ్ నటుడు జేసన్ స్టాథమ్‌ను స్ఫూర్తిగా తీసుకుని అక్షయ్ కుమార్ సైతం ఈ చాలెంజ్‌లో పాల్గొన్నారు. అక్షయ్ ఒక్క తన్నుతో బాటిల్ మూతను గాలిలో గింగిరాలు తిప్పి తన ఫిట్నెస్ను నిరూపించుకున్నారు. మరో నటుడు టైగర్ ష్రాఫ్ కొంచెం కొత్తగా ట్రై చేద్దామనుకున్నాడో ఏమో! ఏకంగా కళ్లకు గంతలు కట్టుకుని మరీ చాలెంజ్‌ను పూర్తి చేశాడు. టైగర్ చేసిన ఈ వీడియో చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే! -
‘బాటిల్ క్యాప్ చాలెంజ్’.. ఒకే కికితో తీశాడు!
-
ఫీట్‌గా మారిన బాటిల్ క్యాప్ చాలెంజ్
-
బాటిల్ మూతలో ఇరుక్కున్న నాలుక
తీవ్రంగా ఇబ్బంది పడ్డ చిన్నారి పలమనేరు: పాలలో కలుపుకుని తాగే పేరొందిన ఓ బ్రాండ్ పొడి తీసుకుంటే ఉచితంగా వచ్చే వాటర్ బాటిల్ సిప్పర్‌లో నీళ్లు తాగుతూ ఓ బాలిక తన నాలుకను అందులో ఇరికిచ్చుకుంది. బాలిక నాలుకకు మత్తు మందు ఇచ్చి వైద్యుడు చాకచక్యంగా తొలగించిన ఘటన శనివారం సాయంత్రం చిత్తూరు జిల్లా పలమనేరులో చోటుచేసుకుంది. పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో రంజిత అనే బాలిక రెండో తరగతి చదువుతోంది. శనివారం బాలిక పాఠశాలకు వెళ్లేటపుడు తల్లిదండ్రులు సిప్పర్(వాటిర్ బాటిల్)ను ఇచ్చిపంపారు. బాలిక సిప్పర్‌తో నీరు తాగుతుండగా నాలుక అందులో ఇరుక్కుపోయింది. దానిని తొలగించేందుకు వీలు కాకపోవడంతో సమీపంలోని సాయిరామ్ ఆస్పత్రికి తీసుకెళ్లగా డా.యుగంధర్ తొలు త బాటిల్‌ను వేరుచేసి, నాలుకకు మత్తు మందు ఇచ్చారు. తర్వాత లాక్ అయిన సిప్పర్‌ను చాకచక్యంగా వేరు చేశారు. నీరు ఎలా తాగాలో కూడా తె లియని చిన్నారులకు సిప్పర్‌ను ఇవ్వడం ప్రమాదకరమని, తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు.