తిరువనంతపురం: నకిలీ పురాతన కళాఖండాలను విక్రయించిన కేసులో నిందితుడిగా ఉన్న యూట్యూబర్ మోన్సన్ మవున్‌కల్‌తో సన్నిహిత సంబంధాలున్న ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ జి లక్ష్మణ్‌ను కేరళ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. మోసపూరిత కార్యకలాపాలలో మోన్సన్‌కు సహాయం చేయడానికి తన పదవిని ఉపయోగించారనే ఆరోపణలపై హోం శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.
పురాతన వస్తువుల వ్యాపారిగా మాయమాటలు చెప్పి ప్రజల నుండి కోట్లాది రూపాయలను మోసం చేసినందుకు మోన్సన్ సెప్టెంబర్‌లో అరెస్ట్ అయ్యాడు. ఆ సమయంలోనే మోన్సన్ మవున్‌కల్‌కి కేరళ మాజీ పోలీసు చీఫ్ డీజీపీ లోక్‌నాథ్ బెహెరా, ప్రస్తుత రాష్ట్ర పోలీస్ చీఫ్ డీజీపీ అనిల్‌కాంత్‌తో సహా రాష్ట్రంలోని అనేక మంది పోలీస్ ఉన్నతాధికారులతో సంబంధం ఉన్నట్లు కొన్ని చిత్రాలు వెలుగులోకి వచ్చాయి.
ఈ నేపథ్యంలోనే లక్ష్మణ్‌పై చర్యలకు పోలీసు ప్రధాన కార్యాలయం సిఫారసు చేసింది. 1997 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారిపై శాఖాపరమైన చర్యలకు మార్గం సుగమం చేస్తూ ఐజీపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి పినరయి విజయన్ మంగళవారం రాత్రి ఆమోదం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment