సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర బృందం పర్యటన తర్వాత నష్టాన్ని అంచనా వేసి దాని ప్రాతిపదికగా సహాయం అందిస్తామని కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర విపత్తుల నిధి నుంచి తాత్కాలికంగా నిధులు ఖర్చు పెట్టాలని, కేంద్ర ప్రభుత్వం ఆ నిధుల్ని రీయంబర్స్‌మెంట్ చేస్తుందని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం అందించిన వివరాల ప్రకారమే, వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటించనుందని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో వరద బీభత్సం నేపథ్యంలో కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో వరదల కారణంగా జరిగిన నష్టంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించిందని తెలిపారు. (చదవండి: వరదలు: కేంద్ర మంత్రి 3 నెలల జీతం విరాళం)
ఇక వరదల కారణంగా తెలంగాణలో తలెత్తిన పరిస్థితుల గురించి మాట్లాడుతూ.. 2014కు ముందు, తర్వాత మూసి నది శాటిలైట్ చిత్రాలు చూస్తే ఆక్రమణలు ఎలా జరిగాయో తెలుస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలో జరిగిన ఆక్రమణలు, టీఆర్‌ఎస్ ప్రభుత్వంలోనూ కొనసాగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరద కాలువలు, డ్రైనేజీ సిస్టం దారుణంగా ఉన్నాయని, కనీసం వరద కాలువల్లో పూడిక తీయడం లేదని కేసీఆర్ సర్కారుపై కిషన్‌రెడ్డి మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment