పథకంలో మార్పులతో రాష్ట్రంలో అదనంగా 10 లక్షల మందికి లబ్ధి
తెలంగాణలో 17.2 లక్షల ‘పీఎంజేఏవై’ చికిత్సలు
రూ.3,626 కోట్ల విలువైన వైద్యసేవలు పొందిన లబ్ధిదారులు: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: వయోవృద్ధుల ఆరోగ్యానికి సంబంధించి ఇటీవల కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం 70 ఏళ్లు దాటిన వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ప్రస్తుతం ప్రధానమంత్రి జన ఆరోగ్య పథకం (పీఎంజేఏవై) పరిధిలో తెలంగాణలోని దాదాపు 30 లక్షల కుటుంబాలు ఉండగా.. ఇందులో సుమారు 1.15 కోట్ల మంది లబ్ధిదారులుగా ఉన్నారని చెప్పారు. అంతేగాక ఈ ఏడాది జూలై వరకున్న లెక్కల ప్రకారం.. రాష్ట్రంలో జరిగిన 17.2 లక్షల చికిత్సలకు రూ.3,626 కోట్ల విలువైన వైద్యసేవలను లబ్ధిదారులు పొందారని శుక్రవారం ఆయన ఒక ప్రకటనలో వివరించారు.
పీఎంజేఏవై పథకాన్ని అప్‌గ్రేడ్ చేసి 70 ఏళ్లు దాటిన వయోవృద్ధులందరికీ రూ.5 లక్షల వరకు వైద్య బీమా అందించేందుకు కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం.. దేశ సమగ్రాభివృద్ధిలో వయోవృద్ధుల సంక్షేమానికి సరైన ప్రాధాన్యం కలి్పంచే దిశగా తీసుకున్న చర్య అని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ పథకం ద్వారా తెలంగాణలో అదనంగా 10 లక్షల మంది 70 ఏళ్లు దాటిన వృద్ధు లు లబ్ధి పొందనున్నారని ఆయన తెలిపారు. అయితే.. ఇన్నా ళ్లుగా పీఎంజేఏవై పథకం దారి్రద్యరేఖకు దిగువన ఉన్నవారికి మాత్రమే వర్తిస్తోందని, ఈ నేపథ్యంలో పథకానికి పలు మార్పులు చేసి.. పేద, ధనిక అనే తేడాల్లేకుండా 70 ఏళ్లు దాటిన వయోవృద్ధులందరికీ వర్తింపజేయాలని భావించి కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని కిషన్‌రెడ్డి తెలిపారు.
లబ్ధిదారులకు ప్రత్యేక గుర్తింపు కార్డు
పీఎంజేఏవైకి అర్హులైన లబ్ధిదారులకు ప్రత్యేకమైన గుర్తింపు కార్డును అందిస్తారని, ఇందుకోసం వచ్చే రెండేళ్లలో రూ.3,437 కోట్లను కేంద్ర ప్రభుత్వం ఖర్చుచేయనుందని కిషన్‌రెడ్డి తెలిపారు. సీనియర్ సిటిజన్లందరికీ ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకాన్ని వర్తింపజేసినందుకు ఆయన ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు.
సెప్టెంబర్ 16న వందేభారత్ షురూ
ప్రారంభించనున్న ప్రధాని.. తెలుగు రాష్ట్రాలకు 2 రైళ్లు కేటాయించడంపై మోదీకి కిషన్‌రెడ్డి కృతజ్ఞతలు
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ వినాయక నవరాత్రుల కానుక అందించనున్నారు. నాగ్‌పూర్ –సికింద్రాబాద్, విశాఖపట్నం–దుర్గ్‌ల మధ్య రెండు వందేభారత్ రైళ్లకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. తెలంగాణకు సంబంధించి ఇప్పటికే నాలుగు వందేభారత్ రైళ్లు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి సేవలందిస్తుండగా.. తాజాగా 5వ వందేభారత్ రైలును ప్రధానమంత్రి కేటాయించారు. ఈ రైలు సికింద్రాబాద్–నాగ్‌పూర్ మధ్య పరుగులు పెట్టనుంది.
విశాఖపట్నం– దుర్గ్ (ఛత్తీస్‌గఢ్) మధ్య కూడా మరో వందేభారత్ రైలు సేవలందించనుండగా, ఈ రెండు రైళ్లను ఈ నెల 16న ప్రధానమంత్రి అహ్మదాబాద్ నుంచి వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. వీటితో పాటు దేశవ్యాప్తంగా మొత్తం 10 కొత్త వందేభారత్ రైళ్లను వచ్చే సోమవారం ప్రధానమంత్రి ప్రారంభించనున్నారు. నాగ్‌పూర్ నుంచి ప్రారంభమయ్యే రైలు సికింద్రాబాద్ చేరుకునే సందర్భంలో స్వాగతం పలకాలంటూ కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆహా్వన పత్రం పంపించారు. వందేభారత్ రైళ్లు కేటాయించిన ప్రధానికి కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment