పిల్లలేం చేసినా చూడముచ్చటగా ఉంటుంది. వారు చేసే చిలిపిపనులు ద్వారా తెగ ముద్దచ్చేస్తారు. తాజాగా ఒక బుడ్డోడు తండ్రితో కలిసి పోటాపోటీగా సంగీత కచేరీలో పాట పాడడం ద్వారా మంచి క్రేజ్ సంపాదించాడు. సంధ్య అనే జర్నలిస్ట్ షేర్ చేసిన బుడ్డోడి వీడియో క్లిప్పింగ్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వీడియోలో తండ్రి హార్మోనియం పెట్టెతో సంగీతం చేస్తూ కచేరీ సాగిస్తుంటాడు. తండ్రి శృతికి తగ్గట్టు పక్కనే ఉన్న కొడుకు కూడా పాట పాడుతూ ఉంటాడు. పాట పాడుతున్నంత సేపు ఆ బుడ్డోడు ఏదో ఒక ప్రొఫెషనల్ పాడినట్టుగా పాడుతూ తన హావభావాలతో ఆకట్టుకుంటాడు. మధ్యలో ఒకసారి తండ్రి పాటను వేగంగా పాడడంతో బుడ్డోడు మధ్యలో కల్పించుకొని కొంచెం స్లోగా పాడితే బాగుంటుంది అంటూ తండ్రితో చెప్పాడు. (చదవండి : కలిసికట్టుగా ఊడ్చేశారు..టీంవర్క్ అంటే ఇది)
ఆ బుడ్డోడు అంత బాగా పాటలు పాడడం వెనుక హార్మోనియం వాయిస్తున్న తండ్రి కృషి ఎంత ఉందో అర్థమవుతూనే ఉంది. సోషల్ మీడియాలో షేర్ చేసిన రెండు గంటల్లోనే 24వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. వీడియో చూసిన నెటిజన్లు బుడ్డోడి పాటను చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. తండ్రి తగ్గ తనయుడు.. నాట్య సంగీతం ఎంతో కష్టతరమైంది.. సాహిత్యానికి తగ్గట్టు పదాలను పలకడం కష్టం.. కానీ ఈ బుడ్డోడు మాత్రం ఏ మాత్రం బెరుకు లేకుండా పాడడం నిజంగా హ్యాట్సాప్... భవిష్యత్తులో మరో మంచి సంగీత కళాకారుడిని చూడబోతున్నాం.. అంటూ కామెంట్లు పెడుతున్నారు.
❤️❤️❤️😀😀😀😀😍😍😍
— Sandhya (@TheRestlessQuil) October 18, 2020
Little fella has no chill pic.twitter.com/ytp2q5PvbT
Comments
Please login to add a commentAdd a comment