Harmonium
-
ఈ కొరియన్ ఖవ్వాలీ విన్నారో.. వహ్వా వహ్వా..! అనక తప్పదు!
పాపులర్ ‘కె–పాప్’ మనకు సుపరిచితం. మరి ‘కె–ఖవ్వాలి అంటే?’ అని అడిగితే ‘అదేమిటీ!’ అని మిక్కిలి ఆశ్చర్యపోయేవారితో పాటు ‘ఎక్కడి ఖవ్వాలీ? ఎక్కడి కొరియా’ అని దూరాభారాలను కూడా లెక్కవేసే వాళ్లు ఉంటారు. ‘కొరియన్ సింగర్స్ సింగింగ్ ఖవ్వాలి’ ట్యాగ్‌లైన్‌తో పోస్ట్ చేసిన ఈ ‘కె –ఖవ్వాలి’ వీడియో వైరల్ అయింది. కల్చరల్ ఎక్స్చేంజ్కు అద్దం పట్టే ఈ వీడియోలో కొరియన్ గాయకులు సంప్రదాయక ఖవ్వాలి మెలోడీలను అద్భుతంగా ఆలపించే దృశ్యం, హార్మోని సుమధుర శబ్దం నెటిజనుల చేత ‘వహ్వా వహ్వా’ అనిపిస్తోంది. ‘బ్యూటీఫుల్ కల్చరల్ ఎక్స్చేంజ్’ లాంటి ప్రశంసలు కామెంట్ సెక్షన్లో కనిపించాయి. ఇవి చదవండి: ప్రముఖ కొరియన్ సింగర్ అనుమానాస్పద మరణం: షాక్‌లో ఫ్యాన్స్ -
‘హార్మోనియం’ను నెహ్రూ, ఠాగూర్ ఎందుకు వ్యతిరేకించారు? రేడియోలో 3 దశాబ్దాల నిషేధం వెనుక..
హార్మోనియం.. భారతదేశంలో ప్రసిద్ధి చెందిన సంగీత వాయిద్య పరికరం. ఇది నిజంగా భారత దేశానికి చెందినదేనా? అనే సందేహం చాలామందిలో దశాబ్దాలుగా ఉంది. అయితే కొందరు ఇది భారతీయులదేనని గాఢంగా నమ్ముతుంటారు. 1900ల ప్రారంభంలో స్వాతంత్ర్య పోరాటం ఊపందుకున్నప్పుడు భారతీయ శాస్త్రీయ సంగీతానికి హార్మోనియం అనువైనదా కాదా అనే చర్చ జరిగింది. మహాత్మా గాంధీ చేపట్టిన స్వదేశీ ఉద్యమంలో పలువురు హార్మోనియం భారతీయులది కాదంటూ వ్యతిరేకించారు. 1940లో ఆల్ ఇండియా రేడియో పాశ్చాత్య సంగీత విభాగ అధిపతి అందించిన కథనానికి స్పందనగా దాదాపు మూడు దశాబ్దాలపాటు ‘ఆకాశవాణి’లో హార్మోనియం నిషేధించారు. ఈ నిషేధం 1971లో పాక్షికంగా ఎత్తివేశారు. అనంతర కాలంలో ఈ నిషేధాన్ని పూర్తిగా తొలగించారు. ఫ్రెంచ్ ఆవిష్కర్త హార్మోనియం పేటెంట్ హార్మోనియం 1700లలో ఐరోపాలో ఆవిర్భవించింది. అనేక మార్పులకు లోనైన తర్వాత ఇది భారతదేశానికి చేరువయ్యింది. దీని మొదటి నమూనాను కోపెన్హాగన్ విశ్వవిద్యాలయానికి చెందిన ఫిజియాలజీ ప్రొఫెసర్ క్రిస్టియన్ గాట్లీబ్ క్రాట్జెన్స్టెయిన్ రూపొందించారని చెబుతారు. దీని తరువాత హార్మోనియంలో అనేక మార్పులు వచ్చాయి. 1842లో అలెగ్జాండ్రే డెబెన్ అనే ఫ్రెంచ్ ఆవిష్కర్త హార్మోనియం డిజైన్‌కు పేటెంట్ పొంది, దానికి 'హార్మోనియం' అని పేరు పెట్టారు. హార్మోనియంను 19వ శతాబ్దం చివరలో పాశ్చాత్య వ్యాపారులు, మిషనరీలు భారతదేశానికి తీసుకువచ్చారు. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ వెబ్సైట్ ప్రకారం భారతీయ చేతి వాయిద్యంగా మారిన హార్మోనియంను 1875లో కోల్‌కతాలో ద్వారకానాథ్ ఘోష్ రూపొందించారు. అన్ని రాగాలను సరిగ్గా పలికించలేదని.. 1915 నాటికి భారతదేశం హార్మోనియంల రూపకల్పనలో అగ్రగామిగా మారింది. అలాగే ఈ వాయిద్యం భారతీయ సంగీతంలో అంతర్భాగంగా మారింది. హార్మోనియంలో 12 స్వరాలు, 22 శృతులను పలికించవచ్చని చెబుతారు. అయితే భారతీయ శాస్త్రీయ సంగీత విద్వాంసులలోని ఒక విభాగం హార్మోనియం అన్ని రాగాలను సరిగ్గా పలికించలేదని, అన్ని శాస్త్రీయ స్వరాలను పరిపూర్ణంగా పలికించే సామర్థ్యాన్ని కలిగి లేదని ఎత్తి చూపింది. దీని గురించి ప్రఖ్యాత హార్మోనియం ప్లేయర్ రవీంద్ర కటోటి మాట్లాడుతూ పరిమితి అనేది విశ్వవ్యాప్త వాస్తవం. ప్రతి స్వరానికి, ప్రతి పరికరానికి దాని పరిమితులు ఉంటాయన్నారు. ఠాగూర్ వాదన ఇదే.. హార్మోనియం భారతీయమా కాదా, ఇది భారతీయ సంగీతానికి సరిపోతుందా లేదా అనే చర్చ నడుస్తున్నప్పుడు బహుముఖ ప్రజ్ఞాశాలి, నోబెల్ బహుమతి గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ వాయిద్య పరికరం భారతీయతకు సరిపోదన్నారు. ఇది గమకాలను పలికించలేదన్నారు. ఈ నేపధ్యంలోనే ఆకాశవాణిలో హార్మోనియంను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఒక సాహితీవేత్త కోల్‌కతాలోని ఆల్ ఇండియా రేడియోకి లేఖ రాశారు. ఆల్ ఇండియా రేడియో పాశ్చాత్య సంగీత విభాగం అధిపతి జాన్ ఫోల్డ్స్ భారతీయ శాస్త్రీయ సంగీతానికి ఎంతో అవసరమైన మైక్రోటోన్ల విషయంలో హార్మోనియం మ్యూట్‌గా ఉందని తన కథనాలలో వివరించారు. కంట్రోలర్ ఆఫ్ బ్రాడ్కాస్టింగ్గా ఉన్న లియోనెల్ ఫీల్డెన్.. ఫోల్డ్స్ వాదనతో ఏకీభవించారు. దీంతో 1940, మార్చి 1న ఆల్ ఇండియా రేడియో హార్మోనియంను నిషేధించింది. స్వాతంత్య్రానంతరం కూడా.. సంగీత విద్వాంసుడు అభిక్ మజుందార్ ఈ అంశం గురించి మాట్లాడుతూ.. కళా చరిత్రకారుడు ఆనంద్ కుమారస్వామి, స్వాతంత్ర్య సమరయోధునిగా జవహర్లాల్ నెహ్రూ కూడా హార్మోనియం భారతీయతకు చెందినది కాదన్నారు. స్వాతంత్య్రానంతరం కూడా ఈ వాయిద్య పరికరంపై నిషేధం కొనసాగిందని, సమాచార ప్రసార శాఖ మంత్రి బివి కేస్కర్, విద్వాంసుడైన గాయకుడు విఎన్ భత్ఖండే విద్యార్థి దీనికి కారణమని తెలిపారు. ఇది కూడా చదవండి: మూత్రం ఆపుకోలేని పిల్లాడిపై పోలీసుల ప్రతాపం.. జైలుకు తరలించి.. -
వైరల్ : ఈ బుడ్డోడు సామాన్యుడు కాదు
పిల్లలేం చేసినా చూడముచ్చటగా ఉంటుంది. వారు చేసే చిలిపిపనులు ద్వారా తెగ ముద్దచ్చేస్తారు. తాజాగా ఒక బుడ్డోడు తండ్రితో కలిసి పోటాపోటీగా సంగీత కచేరీలో పాట పాడడం ద్వారా మంచి క్రేజ్ సంపాదించాడు. సంధ్య అనే జర్నలిస్ట్ షేర్ చేసిన బుడ్డోడి వీడియో క్లిప్పింగ్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వీడియోలో తండ్రి హార్మోనియం పెట్టెతో సంగీతం చేస్తూ కచేరీ సాగిస్తుంటాడు. తండ్రి శృతికి తగ్గట్టు పక్కనే ఉన్న కొడుకు కూడా పాట పాడుతూ ఉంటాడు. పాట పాడుతున్నంత సేపు ఆ బుడ్డోడు ఏదో ఒక ప్రొఫెషనల్ పాడినట్టుగా పాడుతూ తన హావభావాలతో ఆకట్టుకుంటాడు. మధ్యలో ఒకసారి తండ్రి పాటను వేగంగా పాడడంతో బుడ్డోడు మధ్యలో కల్పించుకొని కొంచెం స్లోగా పాడితే బాగుంటుంది అంటూ తండ్రితో చెప్పాడు. (చదవండి : కలిసికట్టుగా ఊడ్చేశారు..టీంవర్క్ అంటే ఇది) ఆ బుడ్డోడు అంత బాగా పాటలు పాడడం వెనుక హార్మోనియం వాయిస్తున్న తండ్రి కృషి ఎంత ఉందో అర్థమవుతూనే ఉంది. సోషల్ మీడియాలో షేర్ చేసిన రెండు గంటల్లోనే 24వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. వీడియో చూసిన నెటిజన్లు బుడ్డోడి పాటను చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. తండ్రి తగ్గ తనయుడు.. నాట్య సంగీతం ఎంతో కష్టతరమైంది.. సాహిత్యానికి తగ్గట్టు పదాలను పలకడం కష్టం.. కానీ ఈ బుడ్డోడు మాత్రం ఏ మాత్రం బెరుకు లేకుండా పాడడం నిజంగా హ్యాట్సాప్... భవిష్యత్తులో మరో మంచి సంగీత కళాకారుడిని చూడబోతున్నాం.. అంటూ కామెంట్లు పెడుతున్నారు. ❤️❤️❤️😀😀😀😀😍😍😍 Little fella has no chill pic.twitter.com/ytp2q5PvbT — Sandhya (@TheRestlessQuil) October 18, 2020 -
కుక్క పాట పాడితే ఇలా ఉంటుంది..
కొన్ని పాటలు వినగానే దాన్ని పాడిన వ్యక్తులు టక్కున గుర్తొస్తారు. అలా కొన్ని పాటలు భీభత్సంగా క్రేజ్‌ను సంపాదించుకుంటాయి. ఇక సోషల్ మీడియా సెన్సేషన్ రణు మొండాల్.. తేరీ మేరీ సాంగ్‌తో ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిన విషయమే. ఈ పాటతో ఒక్కసారిగా ఆమె జీవితమే మారిపోయింది. రైల్వేస్టేషన్ నుంచి ఆమె ఒక్కసారిగా సెలబ్రిటీ స్థాయికి ఎదిగిపోయింది. తాజాగా ఆ పాటను ఓ వ్యక్తి హార్మోనియం వాయిస్తూ ఆలపించాడు. ఇక్కడ విశేషమేంటంటే అతనితోపాటు ఓ కుక్క కూడా అతనితో గొంతు కలిపింది. మొరుగుతూ, అరుస్తూ కుక్క భౌమంటూ పాట అందుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. కుక్క పాటకు నెటిజన్లు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతున్నారు. ఈ వీడియోలో అంతు చిక్కని విషయమేంటంటే.. అది పాడటానికి ప్రయత్నిస్తుందో.. లేక పాట భరించలేక ఆపేయమని అర్థిస్తుందో తెలిసి చావట్లేదని ఓ నెటిజన్ తన అనుమానాన్ని వ్యక్తం చేశాడు. ‘అతని పాటను శునకం భరించలేకపోతుంది. అందుకే అతను పాడకుండా చేయాలని శతవిధాలా ప్రయత్నిస్తోంది’, ‘పర్లేదు.. నాకన్నా ఆ కుక్కే బాగా పాడుతోంది’, ‘భలే.. ఇద్దరూ ఒకేలా పాడుతున్నారు’, ‘కుక్క పాట పాడితే ఇలా ఉంటుంది’ అంటూ నెటిజన్లు సరదా కామెంట్లు చేస్తున్నారు. వైరల్ : దాదాతో డ్యాన్స్ చేయించిన హర్భజన్ -
‘హార్మోనియం’ బతుకులు అబ్బా!
సాక్షి, న్యూఢిల్లీ: ‘దూరాన ఊరు కనిపిస్తోంది. ఆకాశం దట్టంగా మబ్బుపట్టింది. వర్షం వస్తుందన్న భయంతో వడి వడిగా అడుగులు వేస్తున్నాం. ఆడవాళ్ల చంకల్లో పిల్లలు ఆకలితో కేకలు వేస్తున్నారు. మగవాళ్లు మూట ముళ్లె, తట్టా బుట్టా, టెంటు పట్టుకొని ప్రయాస పడి నడుస్తున్నారు. నడవలేక నడవలేక ముసలి ముతక మూలుగుతూ దగ్గుతూ వెంట వస్తున్నారు. ఇంతలో ఊరు రానే వచ్చింది. అంతలో చినుకు, చినుకు మొదలయింది. పిల్లల్ని ఎత్తుకొని ఆడవాళ్లు చెట్ల కింద చేరగా రోడ్డుపక్కన టెంట్లు వేసేందుకు మగవాళ్లు ప్రయత్నిస్తున్నారు. స్థానికులు రానే వచ్చారు. ఎవరని దబాయించారు. చెప్పాం. పోలీసులను పిలిపిస్తామని బెదిరించారు. మరో ఊరు చూసుకోమని సూచించారు. చేసేది లేక మళ్లీ మూట మూళ్లె సర్దుకున్నాం. వర్షం పెరిగింది. అలా రాత్రంతా తడుస్తూ మరో ఊరు వైపు వెళ్లాం. తడిసి ముద్దయిన పిల్లలకు జ్వరాలు వచ్చాయి. ముసలి వాళ్లు వణికిపోతున్నారు. మా సంగతి పక్కన పెట్టండి. పిల్లలు, ముసలివాళ్లకు ఆ రాత్రి గంజి మెతుకులు లేవు’ అని మహారాష్ట్రలోని సింధూదుర్గ్ జిల్లా దోడామార్గ్ గ్రామంలో తమకెదురైన ఓ అనుభవం గురించి సజింద్ యాదవ్ మీడియాకు వివరించారు. ఆయన గ్రామం మధ్యప్రదేశ్‌లోని గాంధీగ్రామ్. ఆయన గావ్లీ సంచార జాతికి చెందిన వ్యక్తి. ఆ గ్రామంలో ఆయనతోపాటు 400 గావ్లీ కుటుంబాలు ఉన్నాయి. వారు వర్షాలు కురిసే మూడు నెలల పాటే గ్రామంలో ఉంటారు. మిగతా తొమ్మిది నెలల పాటు దేశవ్యాప్తంగా తిరుగుతుంటారు. వారు ఎక్కువ మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, గోవా రాష్ట్రాల్లోని గ్రామాలనే ఎంచుకుంటారు. ఏ గ్రామానికి వెళ్లిన ఆ గ్రామం శివారులో బట్టలు, చీరలతో టెంట్లు వేసుకుంటారు. వీరికి మిగతా సంచార జాతులకు కొంత తేడా ఉంది. మిగతా సంచార జాతుల వారు పిల్లా, జెల్లా, ముసలి, ముతకలను స్వస్థలంలో వదిలేసి వలసపోతుంటారు. వీరు మాత్రం అందరిని తీసుకునే సంచార యాత్ర మొదలు పెడతారు. ఇంతకు వీరు చేసే వృత్తి ఏమిటంటే భారత గ్రామీణ సంగీతంతో పెనవేసుకుపోయిన ‘హార్మోనియం’ను మరమ్మతు చేయడం. కొన్ని దశాబ్దాలుగా, తరాలుగా వీరు ఇదే వృత్తిని నమ్ముకొని జీవిస్తున్నారు. కొన్ని ఊళ్లలో పోలీసుల బెదిరింపులు, ప్రజల చీదరింపులు ఎదురయినా వీరు ఈ వృత్తిని వదిలి పెట్టడం లేదు. ఒకప్పుడు ఇంటింటా కాకపోయిన వీధి, వీధిన కనిపించే హార్మోనియంలను మరమ్మతు చేయడం వల్ల వీరికి బాగానే వచ్చేదట. ఇప్పడు నెలకు సరాసరి మూడు వేల రూపాయలు కూడా రావడం లేదని, పాడుపడిన హార్మోనియంను ఎంతో కష్టపడి రిపేరు చేస్తే వంద రూపాయలకు మించి ఇవ్వరని అఫ్సాన్ యాదవ్ కుమారుడు 22 ఏళ్ల సాజింద్ యాదవ్ తెలిపారు. తాము గత ఏడేళ్లలో మహారాష్ట్రలోని 15 గ్రామాలు తిరిగామని చెప్పారు. తమ స్వగ్రామంలో ఎలాంటి స్థలంగానీ, పనులుగానీ లేకపోవడం వల్ల నమ్ముకున్న వృత్తిపైనే ఆధారపడి తిరుగుతున్నామని చెప్పారు. తమకు ఎలాంటి గుర్తింపు కార్డులు లేనందున పొరుగూరులో తమకు ఎలాంటి పనులు ఇవ్వడం లేదని ఆయన చెప్పారు. పస్తుతం తమ బృందంలో 60 మంది ఉండగా, 20 మంది పిల్లలే ఉన్నారని అన్నారు. మిగతా కుటుంబాలు కూడా బృందాలుగా విడిపోయి ఊరూర తిరుగుతుంటారని చెబుతుంటారు. హార్మోనియం స్థానంలో ఇప్పుడు కొత్త ఎలక్ట్రిక్ పరికరాలు రావడంతో తమకు గిరాకీ లేకుండా పోయిందని వాపోయారు. హార్మోనియం ఎక్కడ పుట్టింది? పశ్చిమ దేశాల్లో పుట్టినా ఈశాన్య దేశాల్లోనే హార్మోనియం పునర్జీవం పోసుకుంది. భారత్‌లో ఎక్కువ ప్రాచుర్యం పొందింది కనుక భారత ఉప ఖండంలో పుట్టిందని భ్రమపడతారు. విదేశీ వస్తువుల బహిష్కరణ ఉద్యమం సందర్భంగా ఈ హార్మోనియంను బహిష్కరించాలా, వద్దా అన్న అంశం కూడా చర్చకు వచ్చింది. హార్మోనియం యూరప్‌లో పుట్టింది, బ్రిటన్‌కు ఎలాంటి సంబంధం లేదు కనుక బహిష్కరించాల్సిన అవసరం లేదన్న వాదన గెలిచింది. ఎందుకోగానీ ఆకాశవాణి (ఆల్ ఇండియా రేడియో) మాత్రం 1940 నుంచి 1971వరకు హార్మోనియంపై నిషేధం విధించింది. కోపెన్ హాగెన్ యూనివర్శిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ క్రిస్టియన్ గాట్లిబ్ క్రట్జెస్టైయిన్ తొలిసారిగా హార్మోనియం ప్రొటోటైప్‌ను సృష్టించారు. ఆయన సంగీతం కోసం కాకుండా మానవ శరీరంపై విద్యుత్ తరంగాల ప్రభావాన్ని అధ్యయనం చేయడం కోసం దీన్ని కనిపెట్టారు. ఈ సాంకేతిక పరిజ్ఞానానికి ఆధునికతను జోడించి ఫ్రాన్స్‌కు చెందిన గాబ్రియెల్ జోసఫ్ గెన్నీ 1810లో ‘ఆర్గూ ఎక్స్ప్రెసిఫ్’ (భావాలు పలికించే పరికరం)ను కనిపెట్టారు. అదే ఫ్రాన్స్‌కు చెందిన అలెగ్జాండర్ డెబ్రిన్ దాన్ని మరింత అభివృద్ధి చేసి ‘హార్మోనియం’ అని పేరు పెట్టారు. ఆయన పేటెంట్ కూడా తీసుకున్నారు. హార్మోనియం అంటే గ్రీకు భాషలో సమన్వయం అని అర్థం. అంటే స్వరాల మధ్య సమన్వయం కావొచ్చు. భారత్‌లోని కోల్‌కతాలో ద్వారకానాథ్ ఘోస్ ఈ సంగీత పరికరాన్ని మరింత అభివృద్ధి చేసి ‘డ్వార్కిన్ అండ్ సన్స్’ పేరిట కంపెనీ ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున వీటి ఉత్పత్తిని ప్రారంభించారు. ఈ కంపెనీ చేతుల్లో పట్టుకొనే హార్మోనియంను 1875లో తీసుకొచ్చింది. మొదట మన ఏటీఎం బాక్సులంతా పెద్దగా ఉండి, కాళ్లు, చేతులతో ఆపరేట్ చేసే స్థాయి నుంచి కేవలం చేతులతో వాయించే స్థాయికి వచ్చింది. భారత్‌లో మెలోడియన్ అని కూడా పిలిచే ఈ హార్మోనియం భారత సంగీత ప్రపంచానికి దూరం అవుతోంది. రవీంద్రనాథ్ ఠాకూర్ తన అన్ని గీతాలకు హార్మోనియంపైనే బాణి కట్టారు. హార్మోనియం లేకుండా పండిట్ భీంసేన్ జోషి, ఉస్తాద్ బడే గులాం అలీ ఖాన్, బేగం అఖ్తర్ లాంటి శాస్త్రీయ సంగీత విద్వాంసులను ఊహించలేం. చరిత్రలో దాదాపు రెండువందల సంవత్సరాలపాటు కనుమరుగై తిరిగి భారత్‌లో పునర్జీవం పొందిన హార్మోనియంకు మళ్లీ ‘అచ్చేదిన్’ రాకపోవచ్చని సంగీత ప్రియులు అభిప్రాయపడుతున్నారు. తమకు మాత్రం కనుచూపు మేరలో ‘అచ్చేదిన్’ కనిపించడం లేదని గావ్లీ సంచార జాతి ఆందోళన వ్యక్తం చేస్తోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో 5.10 కోట్ల మంది సంచార జాతులు ఉన్నాయి. వారిలో ఇప్పటికీ 90 శాతం మంది నిరక్షరాస్యులే.