శివనామస్మరణతో మారుమోగిన ఆలయాలు | Mahakaal Bhasma Aarti Devotees Gathered | Sakshi
Sakshi News home page

శివనామస్మరణతో మారుమోగిన ఆలయాలు

Published Mon, Aug 12 2024 9:00 AM | Last Updated on Mon, Aug 12 2024 9:00 AM

Mahakaal Bhasma Aarti Devotees Gathered

ఉత్తరాదిన ఈరోజు శ్రావణమాసంలోని నాల్గవ సోమవారం. ఈ సందర్భంగా భక్తులు శివాలయాలకు చేరుకుని పూజలు చేస్తున్నారు. దీంతో ఆలయాలలో భక్తుల రద్దీ కనిపిస్తోంది. ఈ నేపధ్యంలోనే ఉజ్జయిని మహాకాళీశ్వరునికి ఘనంగా భస్మహారతి నిర్వహించారు. దీనిని తిలకించేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు.
 

ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో భక్తులు గంగా నదిలో పవిత్ర స్నానాలు ఆచరించారు.

జార్ఖండ్‌లోని డియోఘర్‌లో శివాలయాయాలలో పూజలు నిర్వహించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లోని మంకమేశ్వర్ మహాదేవ్ ఆలయానికి భక్తులు పోటెత్తారు.

ఢిల్లీలోని గౌరీ శంకర్ ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement