gather information
-
శివనామస్మరణతో మారుమోగిన ఆలయాలు
ఉత్తరాదిన ఈరోజు శ్రావణమాసంలోని నాల్గవ సోమవారం. ఈ సందర్భంగా భక్తులు శివాలయాలకు చేరుకుని పూజలు చేస్తున్నారు. దీంతో ఆలయాలలో భక్తుల రద్దీ కనిపిస్తోంది. ఈ నేపధ్యంలోనే ఉజ్జయిని మహాకాళీశ్వరునికి ఘనంగా భస్మహారతి నిర్వహించారు. దీనిని తిలకించేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. #WATCH | Ujjain, Madhya Pradesh: Bhasma Aarti performed at Mahakaleshwar Temple on the fourth Monday of the holy month of 'Sawan'. pic.twitter.com/8da9zfvocK— ANI (@ANI) August 11, 2024ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో భక్తులు గంగా నదిలో పవిత్ర స్నానాలు ఆచరించారు.#WATCH | Deoghar, Jharkhand: Devotees gather in huge numbers to offer prayers, on the fourth Monday of 'Sawan' month. pic.twitter.com/4zGvX14YB5— ANI (@ANI) August 11, 2024జార్ఖండ్‌లోని డియోఘర్‌లో శివాలయాయాలలో పూజలు నిర్వహించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.#WATCH | Uttar Pradesh: Devotees gather in huge numbers to offer prayers, on the fourth Monday of 'Sawan' month, at Shri Mankameshwar Mahadev Mandir in Prayagraj pic.twitter.com/qd3iu6iBPL— ANI (@ANI) August 12, 2024ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లోని మంకమేశ్వర్ మహాదేవ్ ఆలయానికి భక్తులు పోటెత్తారు.ఢిల్లీలోని గౌరీ శంకర్ ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. #WATCH | Devotees gather in huge numbers to offer prayers, on the fourth Monday of 'Sawan' month, at Shri Gauri Shankar Mandir in Delhi pic.twitter.com/JXKpEOSO8t— ANI (@ANI) August 12, 2024 -
కుంభమేళా నుంచి హత్రాస్ వరకు.. మహా విషాదాలు
ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో జరిగిన సత్సంగ్‌లో చోటుచేసుకున్న తొక్కిసలాటలో 116 మంది మృత్యువాత పడ్డారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. దేశంలో ఇలాంటి విషాదాలు గతంలోనూ చోటుచేసుకున్నాయి. 2005లో మహారాష్ట్రలోని మంధరాదేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 340 మంది మృతి చెందారు. 2008లో రాజస్థాన్‌లోని చాముండా దేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 250 మంది మృత్యువాత పడ్డారు. 2008లో హిమాచల్ ప్రదేశ్‌లోని నైనా దేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 162 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో గతంలో చోటుచేసుకున్న ఈ తరహా విషాదాలు..2023, మార్చి 31: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో శ్రీరామ నవమి వేళ ఒక ఆలయం స్లాబ్ కూలిపోవడంతో 36 మంది మృతి చెందారు.2022, జనవరి 1 : జమ్ముకశ్మీర్‌లోని మాతా వైష్ణో దేవి ఆలయంలో భక్తుల రద్దీ కారణంగా జరిగిన తొక్కిసలాటలో 12 మంది కన్నుమూశారు.2015, జూలై 14: ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రిలో పుష్కరాల మొదటి రోజున గోదావరి నది ఒడ్డున జరిగిన తొక్కిసలాటలో 27 మంది మృతి చెందారు. 20 మంది గాయపడ్డారు.2014, అక్టోబర్ 3: బీహార్‌లోని పట్నాలో దసరా వేడుకల సందర్భంగా గాంధీ మైదాన్‌లో చోటుచేసుకున్న తొక్కిసలాటలో 32 మంది మృతి చెందారు. 26 మంది గాయపడ్డారు.2013, అక్టోబరు 13: మధ్యప్రదేశ్‌లోని దతియా జిల్లాలోని రతన్‌ఘర్ దేవాలయం సమీపంలో నవరాత్రి ఉత్సవాల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 115 మంది మృతి చెందారు. 100 మందికి పైగా జనం గాయపడ్డారు.2012, నవంబర్ 19: బీహార్‌లోని పట్నాలో గంగా నది ఒడ్డున అదాలత్ ఘాట్ వద్ద ఛత్ పూజలు నిర్వహిస్తుండగా తాత్కాలిక వంతెన కూలిపోవడంతో తొక్కిసలాట జరిగి 20 మంది మరణించారు.2011, నవంబర్ 8: హరిద్వార్‌లోని గంగా నది ఒడ్డున హర్కీ పైడి ఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాటలో 20 మంది మృతి చెందారు.2011, జనవరి 14 : కేరళలోని ఇడుక్కి జిల్లాలోని పులమేడు వద్ద విషాదం చోటుచేసుకుంది. శబరిమల ఆలయాన్ని సందర్శించి వస్తున్న భక్తుల మధ్య జరిగిన తొక్కిసలాటలో 104 మంది మృతి చెందారు. 40 మంది గాయపడ్డారు.2010, మార్చి 4: ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లాలో కృపాలు మహారాజ్ రామ్ జానకి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 63 మంది మరణించారు.2008, సెప్టెంబరు 30 : రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో గల చాముండా దేవి ఆలయంలో బాంబు పేలుడు వదంతుల కారణంగా చోటుచేసుకున్న తొక్కిసలాటలో 250 మంది కన్నుమూశారు. 60 మందికి పైగా జనం గాయపడ్డారు.2008, ఆగస్ట్ 3: హిమాచల్ ప్రదేశ్‌లోని బిలాస్పూర్ జిల్లాలోని నైనా దేవి ఆలయంలో కొండ చరియలు విరిగి పడ్డాయనే వదంతులు రావడంతో జరిగిన తొక్కిసలాటలో 162 మంది మృతి చెందారు. 47 మంది గాయపడ్డారు.2005, జనవరి 25: మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని మంధరాదేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 340 మంది మృతి చెందారు. వందలాది మంది గాయపడ్డారు.2003, ఆగష్టు 27: మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో సింహస్థ కుంభమేళా పవిత్ర స్నానాల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 39 మంది మృతి చెందారు. 140 మంది గాయపడ్డారు. -
పక్కనే వుంటే పోయేదేముంది?
ఒక అడవిలో కోతుల గుంపు ఒకటి ఉండేది. ఒకరోజు అవన్నీ కలిసి ఏకాదశీ వ్రతం చేసుకోవాలనుకున్నాయి. ఆ ప్రకారం ఆ తర్వాత వచ్చే ఏకాదశినాడు కోతులన్నీ ఒక చెట్టుకింద సమావేశమై ఉపవాసాన్ని ప్రారంభించాయి. కాసేపటికి ఒక కోతి అంది– ఇలా ఎంతసేపని కింద కూర్చుంటాం? చెట్లకొమ్మల మీద ఉండటమే మనకు అలవాటు కాబట్టి చెట్లెక్కి కొమ్మల మొదట్లోనే కూర్చుందాం’’ అంది. ఆ మాటలు మిగతా కోతులకు నచ్చాయి. వెంటనే అమలు పరిచాయి. అలా కొంతసేపు గడిచింది. అప్పుడు మరోకోతి ఇలా సూచించింది– మనం కొమ్మలమీద కూర్చుంటే చెట్లెక్కగలిగిన ఏ చిరుతపులో వస్తే మన పరిస్థితి ఏమిటి? అందువల్ల ఇంకొంచెం పైకెళ్తే మంచిది. దానివల్ల నేలమీదకు చూస్తూ, శత్రువులు రాకుండా జాగ్రత్త పడడానికి వీలవుతుంది– అంది. ఈ ఆలోచన కూడా నచ్చడంతో వెంటనే అమలు పరిచాయి. మరికొంతసేపు గడిచింది. ఇంకొక కోతి అంది– నేలచూపులు ఎంతసేపు చూస్తాం... పండ్లవైపు చూస్తే మాత్రం ఉపవాస వ్రతానికి నష్టం ఏంటి– అని. వెంటనే ఆ సలహా కూడా అమలులోకి వచ్చేసింది. మరోకోతికి మరో ఆలోచన వచ్చింది. ఉపవాసం కారణంగా మనకు ఆకలి ఎక్కువగా ఉండి, మంచి పండ్లను ఏరుకునే సమయం ఉండకపోవచ్చు. అందువల్ల రేపటికి తినడానికి వీలుగా ఏం పండ్లు ఉంటాయో, ఇప్పుడే పరీక్షించి పెట్టుకుంటే బాగుంటుంది కదా– అని. ఇంకేం... కోతులన్నీ మంచి మంచి పండ్లను ఏరుకోవడం మొదలెట్టాయి. ‘రేపు మనకు ఎంత నీరసంగా ఉంటుందో ఏమో, కొన్ని పండ్లు పైకి బాగున్నా, లోపల పురుగులుండవచ్చు. కాబట్టి ఇప్పుడే వాటిని కొద్ది కొద్దిగా రుచి చూసి పక్కన పెట్టుకుంటే మన ఉపవాస వ్రతానికి నష్టం ఏమైనా వాటిల్లుతుందా ఏమిటి? మనుషులు కూడా అలాగే పొద్దున ఉపవాసం ఉంటూనే, రాత్రి పలహారానికి కావలసిన ఏర్పాట్లు చేసుకుంటూనే ఉంటారు’’ అంటూ అనుభవజ్ఞురాలైన ఓ వృద్ధ వానర ం తనలో తాను గొణుక్కుంటున్నట్లుగా అంది. అన్నింటికంటే ఈ సలహా కోతులన్నిటికీ బాగా నచ్చింది. కోతులన్నీ ఆవురావురుమని పండ్లన్నీ ఆరగించేయడం మొదలెట్టేశాయి. చివరికి వాటి ఉపవాస వ్రతం అలా ముగిసింది. మనం ఏదైనా ఒక పని ప్రారంభిద్దాం అనుకోగానే ఇలాగే నలుగురూ వచ్చి నాలుగు సలహాలు చెబుతారు. దాంతో మనం అనుకున్న పని కాస్తా అటక ఎక్కుతుంది. ఒకవేళ వాళ్లు చెప్పిన సలహాలు మంచివే అనుకోండి, వాటిని పాటించేందుకు తగిన సమయం సందర్భం, వాటిని పాటించే క్రమంలో నిగ్రహం, నిక్కచ్చితనం అవసరం. – డి.వి.ఆర్. -
జనం మధ్యకు బీసీ కమిషన్
ద్వారకాతిరుమల : బీసీ రిజర్వేషన్ల జాబి తాలో మార్పులు, చేర్పులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నియమించిన మంజునాథ కమిషన్ గురువారం క్షేత్రస్థాయి పర్యటన జరిపింది. ద్వారకాతిరుమల మండలం కొమ్మర, లింగపాలెం మండలం మఠంగూడెం గ్రామాలతోపాటు తణుకు పట్టణంలో జస్టిస్ కేఎల్ మంజునాథ, కమిషన్ సభ్యులు కాపులు, బీసీల ఆర్థిక, సామాజిక పరిస్థితులను స్వయంగా పరిశీలించారు. పలుచోట్ల పేదల ఇళ్లకు వెళ్లారు. కాపులు, బీసీ వర్గాల వారితో సమావేశమై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. కుల సంఘాల పెద్దల నుంచి వినతులు స్వీకరించారు. ద్వారకాతిరుమల మండలం కొమ్మరలో వివిధ కులాలకు చెందిన నాయకులు వాదనలు వినిపించారు. తమ కులస్తులు పేదరికంలో మగ్గుతున్నారని ఎవరికి వారు మొరపెట్టుకున్నారు. గోపాలపురం నియోజకవర్గ బీసీ సంఘ కన్వీనర్ కూరాకుల బుజ్జి మంజునాథ కమిషన్ కు వినతిపత్రం సమర్పించారు. జిల్లాలో బీసీ వర్గానికి చెందిన ఎమ్మెల్యే ఒక్కరే ఉన్నారని, మిగిలిన వారంతా అగ్రకులాల వారేనని వివరించారు. అన్ని రంగాల్లో ముందున్న కాపులకు బీసీ రిజర్వేషన్లు కల్పించడం సమంజసం కాదన్నారు. ద్వారకాతిరుమల మండల కాపు సంఘం అద్యక్షుడు పుప్పాల మురళి, కాపు నేత అంబటి గాంధీ, తదితరులు కమిషన్ కు వినతిపత్రం సమర్పించారు. కాపుల్లో ఎంతోమంది వెనుకబడి ఉన్నారని, కూలి పనులకు వెళితేనే గాని రోజు గడిచే పరిస్థితి లేదని వివరించారు. వాస్తవ పరిస్థితులను కమిషన్ క్షుణ్ణంగా పరిశీలించి కాపులకు బీసీ రిజర్వేషన్లు పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. కొమ్మర గ్రామానికి చెందిన మహిళ తీగల కనక మహాలక్ష్మి మాట్లాడుతూ కాపు కులానికి చెందిన తనకు నాలుగు ఎకరాల ఆయిల్‌పామ్ తోట ఉందని తెలిపింది. ఆ భూమిలో గతంలో వేసిన బోరు పాడైందని, కొత్తబోరు కోసం అర్జీ పెట్టుకుని నెలలు గడుస్తున్నా అధికారుల్లో స్పందన లేదని వివరించింది. తనలాంటి వారు ఎంతోమంది బోర్లు పాడై, పంటలు పండక పొలాలను అమ్ముకుంటున్నారని చెప్పింది. బోరు వేయాలంటే ఎంతోకొంత పొలం అమ్ముకోవాల్సిందేనని, ఈ రకంగా చాలా మంది ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నట్టు చెప్పింది. అనంతరం గ్రామంలో ఎంతమంది గ్యాస్ వినియోగిస్తున్నారు, ఎంతమంది కట్టెల పొయ్యిపై వంట చేస్తున్నారనే దానిపై బీసీ కమిషన్ వివరాలు సేకరించింది. కాపుల్లో ఎంతమంది ఉపాధి హామీ కూలి పనులకు వెళుతున్నారనే విషయంతోపాటు పలు అంశాలపై వివరాలు తీసుకుంది. కార్యక్రమంలో కమిషన్ సభ్యులు సత్యనారాయణ, ఎన్ .పూర్ణచంద్రరావు, వెంకటేశ్వర సుబ్రహ్మణ్యం, పి.రమేష్‌కుమార్, ఎస్పీ భాస్కర్ భూషణ్, ఏజేసీ ఎంహెచ్ షరీఫ్, బీసీ వెల్ఫేర్ అధికారి జి.లక్ష్మిప్రసాద్, ఏబీసీడబ్ల్యూఓ ఏవీ ఎ.హరిబాబు పాల్గొన్నారు.