నవంబర్‌ 30 వరకూ లాక్‌డౌన్‌ పొడిగింపు | Maharashtra Extends Ongoing Covid 19 Lockdown | Sakshi
Sakshi News home page

నవంబర్‌ 30 వరకూ లాక్‌డౌన్‌ పొడిగింపు

Published Thu, Oct 29 2020 7:12 PM | Last Updated on Thu, Oct 29 2020 8:45 PM

Maharashtra Extends Ongoing Covid 19 Lockdown - Sakshi

ముంబై : మహారాష్ట్రలో కరోనా వైరస్‌ కేసుల పెరుగుదల కొనసాగుతుండటంతో లాక్‌డౌన్‌ను నవంబర్‌ 30 వరకూ పొడిగించినట్టు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. దేశవ్యాప్తంగా కోవిడ్‌-19 రోజువారీ కేసులు పడిపోయినా దేశంలోనే అత్యధిక కేసులు నమోదవుతున్న మహారాష్ట్రలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. మహారాష్ట్రలో ప్రస్తుతం 1,30,286 యాక్టివ్‌ కేసులున్నాయి. అన్‌లాక్‌ ప్రక్రియలో భాగంగా ఈనెల ఆరంభంలో మహారాష్ట్ర ప్రభుత్వం 50 శాతం కెపాసిటీ మించకుండా హోటళ్లు, ఫుడ్‌కోర్టులు, రెస్టారెంట్లు, బార్లను తెరిచేందుకు అనుమతించింది.

అయితే స్కూళ్లు, కాలేజీలు విద్యాసంస్ధలను మాత్రం అనుమతించలేదు. అత్యవసర సేవల్లో విధులు నిర్వహించే ఉద్యోగుల కోసం ప్రత్యేక సబర్బన్‌ రైళ్ల రాకపోకలను అధికారులు అనుమతించారు. మరోవైపు సాధారణ ప్రజలకు లోకల్‌ రైళ్ల పునరుద్ధరణ కోరుతూ మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పశ్చిమ, కేంద్ర రైల్వేలకు లేఖ రాసింది. కరోనా వైరస్‌ నేపథ్యంలో దశలవారీగా సబర్బన్‌ రైళ్ల పునరుద్ధరించాలని లేఖలో ప్రభుత్వం రైల్వేలకు సూచించింది. చదవండి : మహారాష్ట్ర గంగవ్వ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement