సాక్షి ముంబై: ఉపాధ్యాయులు, పట్టభద్రుల నియోజకవర్గాలు ఐదింటికి జరిగిన ఎన్నికల ఫలితాలు బీజేపీకి షాక్ ఇచ్చాయి. అయిదింటిలో మూడు స్థానాలను శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల మహావికాస్ ఆఘాడి(ఎంవీఏ) కైవసం చేసుకుంది. ఒక స్థానాన్ని బీజేపీ, మరోస్థానంలో ఇండిపెండెంట్ విజయం సాధించారు. ఇటీవలే ఐదు ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం నుంచి ప్రారంభమైంది. శుక్రవారం వరకు లెక్కింపు కొనసాగింది. అనంతరం అయిదు నియోజకవర్గాల ఫలితాలు అధికారికంగా ప్రకటించారు.
జ్ఞానేశ్వర్ మాత్రే విజయంతో ఊరట
ఐదు నియోజకవర్గాల్లో మహావికాస్ ఆఘాడీ మూడింటిని కైవసం చేసుకోగా బీజేపీ ఒకస్థానానికే పరిమితమైంది. ముఖ్యంగా అమరావతి పట్టభద్రుల స్థానంలో బీజేపీ అభ్యర్థి రంజిత్‌పాటిల్ ఓడిపోయారు. మరాఠ్వాడాలో మహావికాస్ ఆఘాడి అభ్యర్థి విక్రమ్ కాలే విజయం సాధించారు. ఇక నాగపూర్ ఉపాధ్యాయుల స్థానంలో బీజేపీ బలపరిచిన నాగో గానార్‌లు పరాజయం పాలయ్యారు. మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ల సొంత నియోజకవర్గమైన నాగపూర్‌లో పరాజయం పాలవడం ఆ పార్టీని షాక్‌కు గురి చేసింది. కొంకణ్‌లో బీజేపీ అభ్యర్థి జ్ఞా్ఞనేశ్వర్ మాత్రే విజయం సాధించడం కొంత ఊరటనిచ్చింది.
నాసిక్‌లో కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థి సత్యజిత్ తాంబే ఇండిపెండెంట్‌గా పోటీ చేసి విజయం సాధించారు. ఆ స్థానంలో ఆయనకు బీజేపీ మద్దతు పలికింది. దీంతో ఫలితాల అనంతరం ఆయన కాంగ్రెస్‌లో కొనసాగుతారా లేదా బీజేపీలో చేరుతారా అనే అంశంపై అనేక ఊహగానాలు కొనసాగుతున్నాయి. తాంబే నుంచి మాత్రం ఈ అంశంపై ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన రాలేద
Comments
Please login to add a commentAdd a comment