నేటి ప్రధానాంశాలు.. | Major Events 7th December 2020 | Sakshi
Sakshi News home page

నేటి ప్రధానాంశాలు..

Published Mon, Dec 7 2020 9:10 PM | Last Updated on Tue, Dec 8 2020 4:38 AM

Major Events 7th December 2020 - Sakshi

ఏలూరులో సీఎం వైఎస్‌ జగన్‌
అంతుచిక్కని వ్యాధి లక్షణాలతో అస్వస్థతకు గురైన పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు వాసులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం ఉదయం పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తామని హామీయిచ్చారు. సీఎం జగన్‌ వెంట మంత్రి పేర్ని నాని, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ఉన్నారు.  బాధితుల పరామర్శ అనంతరం జడ్పీ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పూర్తి వివరాలు...

భారత్‌ బంద్‌కు విపక్షాల మద్దతు
ఢిల్లీ: రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్‌తో రైతు సంఘాలు ప్రకటించిన ‘భారత్‌ బంద్‌’కు ప్రతిపక్ష పార్టీలు మద్దతు ప్రకటించాయి. ఈ దేశవ్యాప్త బంద్‌కు కాంగ్రెస్, శివసేన, డీఎంకే, ఆప్‌ పార్టీలు, తృణమూల్‌ కాంగ్రెస్, ఆర్జేడీ, వామపక్షాలు, 10  కార్మిక సంఘాల ఐక్య కమిటీ తమ మద్దతు తెలిపాయి. పూర్తి వివరాలు...

పెట్రోల్‌, డీజిల్‌ ధరల మంట
పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. మరోసారి రెక్కలొచ్చాయి. సగటున లీటర్‌ పెట్రోల్‌పై 30-33 పైసలు, డీజిల్‌ లీటర్‌పై రూ. 25-31 పైసల చొప్పున పెరిగాయి. పూర్తి వివరాలు..

తెలుగు మహిళ ఘనత
పదిహేనుసార్లు మారథాన్‌ రన్‌.. పదిభాషల్లో ప్రావీణ్యం.. ఎనిమిది దేశాల్లో అమెరికన్‌ ఎంబసీల్లో కొలువు.. 22 ఏళ్ళకే ఇరాక్‌ యుద్ధ బంకర్లలో పని.. అమెరికాలో ఉంటూ ఇవన్నీ చేసి ఘనత సాధించారు సీత శొంఠి. ఆమె తెలుగు మహిళ. ఇప్పుడు ప్రతిష్టాత్మక ‘స్పేస్‌ ఎక్స్‌’ మిషన్‌ హెడ్‌గా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పూర్తి వివరాలు..

సునీత నిశ్చితార్థం
ప్రముఖ సినీ నేపథ్య గాయనీ సునీత నిశ్చితార్థం హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్తతో నిరాబండరంగా జరిగింది. దీంతో గత కొన్ని రోజులుగా ఆమె రెండో పెళ్లిపై వస్తున్న వదంతుల​కు ఫుల్‌స్టాప్‌ పడింది. పూర్తి వివరాలు..

వరంగల్‌ జిల్లాలో దారుణం
వరంగల్‌ జిల్లాలో దారుణం జరిగింది. దుగ్గొండి మండలం రేపల్లెలో అత్యాచార ఘటన కలకలం రేపింది. తీవ్ర రక్తస్రావం జరిగి వరంగల్ ఎంజీఎంలో చికిత్స పొందుతూ బాలిక మృతి చెందింది. పూర్తి వివరాలు..

కరోనాతో బాలీవుడ్‌ టీవీ
కరోనా వైరస్‌ బారిన పడి బాలీవుడ్‌ టీవీ నటి దివ్య భట్నాగర్‌(34) సోమవారం మృతి చెందారు. అధిక రక్తపోటుతో పాటు కరోనా మహమ్మారితో  పోరాడి ఈ రోజు తుది శ్వాస విడిచారు. పూర్తి వివరాలు..

నోకియా లేటెస్ట్‌ స్మార్‌ ఫోన్‌
ఈ నెల రెండు లేదా మూడో వారంలో నోకియా లేటెస్ట్‌ స్మార్‌ ఫోన్‌ 3.4 దేశీ మార్కెట్లో విడుదల కానుంది. దేశీయంగా దీని ధర సుమారు రూ. 12,000- 12,800 స్థాయిలో ఉండవచ్చని విశ్లేషకుల అంచనా. పూర్తి 
వివరాలు..

58 అంతస్థులు చేతులతోనే ఎక్కేశాడు!
వైరల్‌: పారిస్‌ మోంట్‌పార్నాస్సేలోని ఓ యూట్యూబర్‌ 58 అంతస్తుల భవంతిని చకాచకా చేతులతోనే ఎక్కేశాడు. ఈ విన్యాసానికి సంబంధించిన వీడియో, ఫోటోలు సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. పూర్తి  వివరాలు..

మా రాష్ట్రంలో బంద్‌ పాటించం: విజయ్‌ రూపాని
నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతులు డిసెంబర్‌ 8న తలపెట్టిన భారత్ బంద్‌ను తమ రాష్ట్రం పాటించదని గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ అన్నారు. ఈ చట్టాల విషయంలో రైతులలో అసంతృప్తి లేదని భావిస్తున్నానన్నారు. పూర్తి వివరాలు.. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement