కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే
న్యూఢిల్లీ: గత పదేళ్లుగా ప్రజాస్వామ్య వ్యవస్థలను, సంస్థలను నాశనం చేసేందుకు, వాటి సమగ్రతను దెబ్బతీసేందుకు మూకుమ్మడి ప్రయత్నాలు జరిగాయని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. అయితే, దేశ ప్రజాస్వామ్యానికి 2024 ఒక కీలకమలుపు వంటిదని ఖర్గే పేర్కొన్నారు. మన జాతి నిర్మాతలు ఎంతో కష్టపడి నిర్మించిన ప్రజాస్వామ్య సంస్థలపై నమ్మకం ఉంచుతూ 140 కోట్ల మంది భారతీయులు ఈ ఎన్నికల్లో విభిన్నమైన తీర్పు ఇచ్చారన్నారు.
‘ప్రజాస్వామ్య ప్రభుత్వం ఎంతో ఉత్తమమైంది. ప్రజలు తమను ఎలా పాలించాలో తెలిపేందుకు, నాయకులను జవాబుదారీగా ఉంచేందుకు ఈ విధానంలో అవకాశం ఉందన్న మన ప్రథమ ప్రధాని నెహ్రూ వ్యాఖ్యలను ఆదివారం అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం సందర్భంగా ఆయన ‘ఎక్స్’లో ఉటంకించారు. రాజ్యాంగాన్ని, పార్లమెంటరీ ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించుకునేందుకు మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉందని ఖర్గే పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment