ఇటీవల కాలంలో కొందరూ పనిలొంచి తీసేసిన లేక వారి తీరు నచ్చక పనిలో పెట్టుకోకపోయిన, లేదా వారి మంచి కోసమే చివాట్లు పెట్టినా పగలు పెంచేసుకుంటారు. ఆ తర్వాత ఆత క్షణికావేశంలో పిచ్చి పనులు చేసి కటకటాల పాలవ్వడమే గాక జీవితాలను నాశనం చేసుకుంటుంటారు. అచ్చం అలాంటి ఘటనే నొయిడాలో చోటు చేసుకుంది.
అసలేం జరిగిందంటే..నొయిడాలోని ఓ హౌసింగ్ సోసైటీలో ఓ వ్యక్తి క్లీనర్‌గా పనిచేస్తున్నాడు. ఐతే అతని పనితీరు నచ్చక అతన్ని పనిలోంచి తీసేయాలని నిశ్చయించుకున్నారు. దీంతో రగిలిపోయిన అతను డజనుకు పైగా కార్లపై యాసిడ్ పోసి తన ప్రతీకారం తీర్చుకున్నాడు. దీంతో కార్లన్ని ఘోరంగా డ్యామేజ్ అయ్యాయి. దీనికి గల కారణమేమిటని..సమీపంలోని సీసీటీవీ ఫుట్‌జ్ పరిశీలించగా అసలు విషయం బయటపడింది.
ఇదంత సదరు క్లీనర్ రామ్‌రాజ్ పని అని తెలిసి షాక్ గురువుతారు సోసైటీ వాసులు. ఆ వీడియోలో కనిపించిన అగంతుకుడిని రామ్‌రాజ్‌గా గుర్తించి సోసైటీ సెక్యూరిటీ సిబ్బంది అతన్ని ట్రాక్ చేసి అపార్టమెంట్ వాసుల వద్దకు తీసుకువచ్చారు. ఆ తర్వాత వారంతా సదరు క్లీనర్‌పై పోలీసులుకు ఫిర్యాదు చేశారు. ఐతే విచారణలో క్లీనర్ తనకు ఎవరో యాసిడ్ ఇచ్చారంటూ పొంతన లేని సమాధానాలు చెప్పడంతో ..పోలీసులు అతన్ని నేరస్తుడిగా అనుమానించి అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఆ క్లీనర్ సోసైటీలో 2016 నుంచి పని చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.
#बेरोजगार हो जाने के गुस्से की #आग
— Ruby Arun रूबी अरुण روبی ارون 🇮🇳 (@arunruby08) March 17, 2023
ऐसी भड़की की 15 गाड़ियों के अंदर #तेजाब डाल दिया इस शख्स ने 😳
मामला #Noida के #Sector_75 की सोसायटी का है, जहां के कार सफाईकर्मी
को नौकरी से निकाल दिया गया था. pic.twitter.com/sUhIvTyBPl
Comments
Please login to add a commentAdd a comment