కోల్‌కతా: కోవిడ్–19 నకిలీ వ్యాక్సిన్ తీసుకున్న నటి, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మిమి చక్రవర్తి అస్వస్థతకు లోనయ్యారు. ఆమె కడుపు నొప్పి, లో బీపీ, డీ హైడ్రేషన్‌తో బాధపడుతున్నట్టుగా శనివారం ఆమె సన్నిహితులు వెల్లడించారు. అయితే నకిలీ వ్యాక్సిన్ తీసుకున్నందువల్లే ఆమె అనారోగ్యం బారిన పడ్డారా అన్నది డాక్టర్లు ధృవీకరించాల్సి ఉంది..
‘‘ప్రస్తుతానికి మీమీ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది. ఆమె ఇంట్లోనే ఉండి చికిత్స పొందుతున్నారు. ఆమె అనారోగ్యానికి కారణం నకిలీ వ్యాక్సినేనా అన్నది ఇప్పుడే చెప్పలేమని మిమికి చికిత్స చేసిన వైద్యుడు వెల్లడించారు. హైపర్ టెన్షన్‌తో ఆమె బాధపడుతున్నార’’ ని మిమి సన్నిహితులు తెలిపారు. కాగా, 32 ఏళ్ల మిమి గత కొంతకాలంగా లివర్ సంబంధిత జబ్బుతో బాధపడుతున్నారు.
జాదవ్‌పూర్ పార్లమెంటు సభ్యురాలు మిమి చక్రవర్తిని ఐఎఎస్ అధికారిగా చెప్పుకున్న దేబాంజన్ దేబ్ అనే వ్యక్తి కరోనా టీకా కేంద్రానికి ముఖ్య అతిథి ఆహ్వానించడంతో ఆమె వెళ్లి టీకా తీసుకున్నారు. అయితే వ్యాక్సిన్ సర్టిఫికెట్ రాకపోవడంతో మిమి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారించగా అది నకిలీ వ్యాక్సిన్ కాంప్ అని తేలిన విషయం తెలిసిందే.
చదవండి: నటికి టోకరా ఇలా...
Comments
Please login to add a commentAdd a comment