గోవా ఆసుపత్రిలో లీకైన ఆక్సిజ‌న్ ట్యాంక్ | Minor oxygen leakage at south Goa district hospital | Sakshi
Sakshi News home page

గోవా ఆసుపత్రిలో లీకైన ఆక్సిజ‌న్ ట్యాంక్

Published Tue, May 11 2021 7:19 PM | Last Updated on Tue, May 11 2021 7:55 PM

Minor oxygen leakage at south Goa district hospital - Sakshi

పనాజీ: నాసిక్‌లో ఆక్సిజ‌న్ లీకేజీ దుర్ఘ‌ట‌నను మ‌రిచిపోక‌ముందే నేడు తాజాగా మార్గో సిటీలోని సౌత్ గోవా జిల్లా ఆసుపత్రిలో(ఎస్‌జీడిహెచ్) మంగళవారం మధ్యాహ్నం ప్రధాన నిల్వ ట్యాంకులోకి ట్యాంకర్ నుంచి గ్యాస్ నింపేటప్పుడు ఆక్సిజన్ లీకేజీ అయింది. అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని పోలీసు అధికారులు తెలిపారు. కోవిడ్-19 రోగులకు చికిత్స అందిస్తున్న అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రులలో ఇది ఒకటి. సంఘటన స్థలానికి చేరుకున్న జిల్లా అధికారులు లీకేజీని అరిక‌ట్టే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. మ‌రోవైపు అగ్నిప్ర‌మాదం జ‌రిగితే మంట‌ల‌ను ఆర్ప‌డం కోసం అక్క‌డ ఫైరింజ‌న్‌ల‌ను కూడా సిద్ధంగా ఉంచారు. సాధ్య‌మైనంత త్వ‌ర‌గా లీకేజీని కంట్రోల్ చేయ‌క‌పోతే ఆస్ప‌త్రిలో వెంటి లేట‌ర్‌పై ఉన్న రోగులకు ప్రాణాపాయం త‌ప్ప‌ద‌ని వారి కుటుంబ‌స‌భ్యులు ఆందోళ‌న చెందుతున్నారు.

చదవండి:

ఘోరం: 4 గంటల్లో 26 మంది కరోనా రోగులు మృతి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement