బెంగుళూరు: కర్ణాటక రాజధాని బెంగళూర్‌లో చెలరేగిన హింసలో అల్లరి మూకలు డీ జే హళ్లిలోని తన ఇంటిపై దాడి చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యానని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ మూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో శ్రీనివాసమూర్తి స్పందిస్తూ.. తన ఇంటిపై దాడి జరగడానికి ఐదు నిమిషాల ముందే తన కుటుంబ సభ్యలందరూ కృష్ణాష్టమీ వేడుకలను సందర్శించడానికి దేవాలయానికి వెళ్లారని అన్నారు.అయితే తప్పు చేస్తే తన మేనల్లుడినైనా, ఎవరినైనా పోలీసులు శిక్షిస్తారని, కానీ తన ఇంటిని ధ్వంసం చేసే హక్కు ఎవరిచ్చారని విమర్శించారు.
స్పష్టమైన ప్రణాళికతో దుండగులు దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. తన నియోజక వర్గంలోని ప్రజలను సోదరుల్లాగా చూసుకుంటానని, ఎవరికైనా సమస్య ఉంటే తనను సంప్రదించవచ్చని అన్నారు. ఈ సంఘటనపై లోతైన విచారణ చేయాలని పోలీసులను శ్రీనివాస్ మూర్తి కోరారు. అయితే కాల్పులు జరగడానికి ఫేస్‌బుక్‌లో పెట్టిన ఓ పోస్ట్ కారణమని పోలీసులు చెబుతున్నారు. అయితే ఓ వర్గాన్ని కించపరిచేలా శ్రీనివాస్ మూర్తి బంధువు పోస్ట్ చేయడమే కారణమని పలువురు ఆరోపిస్తున్నారు.
కాగా, డీజే హళ్లి ప్రాంతంలో మంగళవారం చెలరేగిన హింసాత్మక ఘర్షణలు కలకలం రేపాయి. ఈ అల్లర్లలో ముగ్గురు మరణించగా.. 200 కార్లు దగ్దమయ్యాయి. దాడికి కారణమైన ఐదుగురి మీద పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. పులకేశీనగర్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ మూర్తి ఇంటి పై కొందరు దాడి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment