సాక్షి, ముంబై: ముంబై మహానగరాన్ని భారీ వర్షం ముంచెత్తుతోంది. భారీ వర్షాలతో ముంబైలోని రహదారులు, లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. నగరంలోని రోడ్లు, రైల్వేట్రాక్‌లు నీటముగాయి. కుండపోత వానలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. వాన కారణంగా చెంబూర్, విక్‌రోలి ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాల్లో ఇప్పటివరకు 15మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. రోడ్లపై వర్షపు నీటి ప్రవాహన్ని తట్టుకోలేక బోరివలి ప్రాంతంలో పలు కార్లు కొట్టుకుపోతున్నాయి.
#WATCH | Maharashtra: Rainwater entered Mumbai's Borivali east area following a heavy downpour this morning pic.twitter.com/7295IL0K5K
— ANI (@ANI) July 18, 2021
చునాభట్టి, సియోన్, దాదర్, గాంధీ మార్కెట్, చెంబూర్, కుర్లా ఎల్బీఎస్ రోడ్ ప్రాంతాల్లో రోడ్లపై భారీగా వర్షపు నీరు ప్రవహిస్తోంది. సెంట్రల్ రైల్వే, వెస్ట్రన్ రైల్వేకు సంబంధించిన సబర్బన్ రైలు సర్వీసు ట్రాకుల్లో వర్షపు నీరు నిండిన కారణంగా పలు రైళ్లను నిలిపివేశారు. మరో ఐదు రోజుల్లో ముంబైలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ(ఐఎండి) పేర్కొంది.
#WATCH | Maharashtra: Daily commuters' movement affected as roads waterlogged, in Gandhi Market area following incessant rainfall. pic.twitter.com/1LpwYNVK0j
— ANI (@ANI) July 17, 2021
Comments
Please login to add a commentAdd a comment