Swept Away
-
మిచౌంగ్ బీభత్సం: కొట్టుకుపోయిన కార్లు, రన్‌వే పైకి వరద నీరు..
చెన్నై: మిచౌంగ్ తుపాను ప్రభావంతో తమిళనాడు రాజధాని చెన్నై కాకావికలమైతోంది. భారీ వర్షాలకు చెన్నైలో జనజీవనం స్తంభించింది. పలు చోట్ల వీధుల్లోకి భారీగా వరద నీరు బీభత్సం సృష్టిస్తోంది. వరద ప్రభావంతో కార్లు కొట్టుకుపోయాయి. చెన్నై ఎయిర్‌పోర్టు రన్‌వేపైకి భారీగా వరద చేరింది. వర్షాల ప్రభావంతో విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. ఇప్పటివరకు 16 విమాన సర్వీసులను అధికారులు రద్దు చేశారు. మరికొన్ని విమానాలను దారిమళ్లించారు. సోమవారం అర్ధరాత్రి వరకు ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. వర్ష బీభత్సానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. Deeply concerned about the impact of the Cyclone Michaung on Chennai city. I wish and pray for safety and well-being of the people. Stay strong, Chennai. We're with you. Prayers🙏🏼 #TakeCareChennai pic.twitter.com/cerOJbIAjf — Kavitha Kalvakuntla (@RaoKavitha) December 4, 2023 చెన్నై నగరంలో భారీ వార్షాలకు లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. రోడ్లపై మోకాలు వరకు నీరు చేరుకుంది. దీంతో రోడ్లపై రాకపోకలకు స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చెంగల్పట్టు సమీపంలోని సముద్రతీర ప్రాంతం నుంచి వేగవంతమైన గాలులు వీస్తున్నాయి. చెన్నై ఎయిర్‌పోర్టు రన్‌వేపైకి భారీగా వరద చేరింది. దీంతో విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. ఇప్పటివరకు 16 విమాన సర్వీసులను రద్దు చేశారు. Understand this is Chennai airport today. The sea seems to have taken it over. And the most lowly paid staff in an airline typically are out braving it all. 👏👍#ChennaiRains pic.twitter.com/vJWNTmtTez — Tarun Shukla (@shukla_tarun) December 4, 2023 చెంగల్పట్టులోని పలు ప్రాంతాలపై భారీ వర్షం, సముద్రపు గాలులు తీవ్రమైన ప్రభావం చూపుతోంది. భారీ వర్షాల కారణంగా చెన్నైలోని వెలచ్చేరి, పల్లికరణై ప్రాంతాల్లో రోడ్లపై వర్షపు నీరు కాలువలా ప్రవహిస్తున్నాయి. రోడ్లపై నిలిచి ఉన్న కార్లు వాన నీటిలో కొట్టుకుపోతున్నాయి. 🌀 Michaung CYCLONE Police in action. Man fell down in a deep construction site was rescued by police. #ChennaiRain #Update@SandeepRRathore@R_Sudhakar_Ips@ChennaiTraffic pic.twitter.com/gsqeUUFZXk — GREATER CHENNAI POLICE -GCP (@chennaipolice_) December 4, 2023 -
ముంబైలో భారీ వర్షం.. కొట్టుకుపోతున్న కార్లు
సాక్షి, ముంబై: ముంబై మహానగరాన్ని భారీ వర్షం ముంచెత్తుతోంది. భారీ వర్షాలతో ముంబైలోని రహదారులు, లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. నగరంలోని రోడ్లు, రైల్వేట్రాక్‌లు నీటముగాయి. కుండపోత వానలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. వాన కారణంగా చెంబూర్, విక్రోలి ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాల్లో ఇప్పటివరకు 15మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. రోడ్లపై వర్షపు నీటి ప్రవాహన్ని తట్టుకోలేక బోరివలి ప్రాంతంలో పలు కార్లు కొట్టుకుపోతున్నాయి. #WATCH | Maharashtra: Rainwater entered Mumbai's Borivali east area following a heavy downpour this morning pic.twitter.com/7295IL0K5K — ANI (@ANI) July 18, 2021 చునాభట్టి, సియోన్, దాదర్, గాంధీ మార్కెట్, చెంబూర్, కుర్లా ఎల్బీఎస్ రోడ్ ప్రాంతాల్లో రోడ్లపై భారీగా వర్షపు నీరు ప్రవహిస్తోంది. సెంట్రల్ రైల్వే, వెస్ట్రన్ రైల్వేకు సంబంధించిన సబర్బన్ రైలు సర్వీసు ట్రాకుల్లో వర్షపు నీరు నిండిన కారణంగా పలు రైళ్లను నిలిపివేశారు. మరో ఐదు రోజుల్లో ముంబైలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ(ఐఎండి) పేర్కొంది. #WATCH | Maharashtra: Daily commuters' movement affected as roads waterlogged, in Gandhi Market area following incessant rainfall. pic.twitter.com/1LpwYNVK0j — ANI (@ANI) July 17, 2021 -
కొట్టుకుపోయిన ఆయిల్ ట్యాంకర్; మగ్గురు గల్లంతు
లక్నో: దేశవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు తీవ్ర నష్టాన్ని చేకూరుస్తున్నాయి. తాజాగా ఉత్తరాఖండ్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు నదులు పొంగిపోర్లుతున్నాయి. దిగువ రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో ఈ ప్రభావం అధికంగా కనబడుతోంది. వరదల్లో చిక్కుకుని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓ ఆయిల్ ట్యాంకర్ వరదల్లో కొట్టుకుపోయిన ఘటనలో ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు. ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురవనున్నట్టు వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీచేశారు. అయితే వీటిని సరిగా అంచనా వేయని ఓ ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్ బిజ్నూర్ నుంచి ఉత్తరాఖండ్ వెళ్లేందుకు తన ప్రయాణాన్ని మొదలుపెట్టారు. మధ్యలో గాగ్రా నదిలో వరద ఉధృతి ఒక్కసారిగా పెరగడంతో ఆ వాహనం అందులో పడి కొట్టుకుపోయింది. ఆయిల్ ట్యాంకర్లో ప్రయాణిస్తున్న వ్యక్తులు తమను తాము రక్షించుకోవడానికి ప్రయత్నించినప్పటికీ లాభం లేకపోయింది. దీనిని నది ఒడ్డున ఉన్న కొందరు వ్యక్తులు వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విషయం తెలుసుకున్న రెస్క్యూ బృందాలు వెంటనే రంగంలోకి దిగాయి. గల్లంతయిన వారి కోసం గాలింపు చర్యలు ప్రారంభించాయి. ఉత్తరాఖండ్‌లో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ ప్రకటించింది. బిజ్నూర్, ఉధమ్‌సింగ్ నగర్ జిల్లాలో వరద ప్రభావం ఎక్కువగా ఉండనున్నట్టు అధికారులు తెలిపారు. -
వరదల్లో చిక్కున్న ట్యాంకర్; మగ్గురు గల్లంతు
-
యూఎస్‌లో భారతీయ కుటుంబం అదృశ్యం
సాక్షి, హైదరాబాద్ : అమెరికాలో భారతీయ కుటుంబం అదృశ్యం సంచలనం కలిగిస్తోంది. భారత్‌కు చెందిన సందీప్ తోటపల్లి, ఆయన భార్య సౌమ్య, ఇద్దరు పిల్లలు సిద్ధాంత్, సాచిలు ఏప్రిల్ 5న మెరూన్ హోండా పైలట్ కారులో పోర్ట్లాండ్ నుంచి శాన్‌జోష్ వెళ్తూ అకస్మాత్తుగా కనిపించకుండా పోయారని స్థానిక మీడియా ప్రచురించిది. అయితే స్థానికంగా ఏప్రిల్ 6న ఈల్ నదిలో వచ్చిన వరదల్లో ఒక కారు కొట్టుకుపోయిందని, అది అదృశ్యమైన భారతీయుడు కారును పోలిఉందని హైవే పెట్రోలింగ్ అధికారి విలియం తెలిపారు. ప్రాధమిక విచారణలో ప్రత్యక్ష సాక్షలను విచారించగా వరదల్లో కొట్టుకుపోయిన కారు 2016 లేదా 2017లో విడుదలైన హోండా కారుగా గుర్తించినట్లు చెప్పారు. ప్రస్తుతం సాక్షులు ఇచ్చిన సమాచారం ప్రకారం కారును గుర్తించే పనిలో ఉన్నామని, కానీ ఇప్పటి వరకూ ఆచూకీ దొరకలేదని అధికార వర్గాలు తెలిపాయి. సంపదీప్ కారు ఈల్ నదిలో కూడా కొట్టుకుపోయిన కారు ఒకే విధంగా ఉన్నాయని, కానీ ఖచ్చితంగా నిర్ధారించలేమని అధికారులు అన్నారు. ఆచూకీ తెలియగానే కుటుంబ సభ్యులకు సమాచారం అందిస్తామని అధికారులు తెలిపారు. దీనిపై భారత విదేశాంగ మంత్రి సుస్మాస్వరాజ్ స్పందించారు. ఈ సంఘటనసై వివరణ ఇవ్వాలంటూ శాన్ఫ్రాన్సిస్కోలోని భారత రాయబారిని ఆదేశించారు. -
చిరు కాపీ కాదు...
ఆ సీన్ - ఈ సీన్ దర్శకుల్లో వ్యక్తిగతంగా తమకంటూ ప్రత్యేక శైలి ఉన్నవాళ్లూ, సినిమాల్లోని పాత్రల ద్వారా తమ ప్రత్యేకతను చాటే డెరైక్టర్లూ కొంతమంది ఉంటారు. కథలు, కథనాల విషయంలోనే కాదు, పాత్రల చిత్రణలో కూడావీళ్లకు ఒక ప్రత్యేక శైలి ఉంటుంది. ఇది సినీ ప్రపంచంపై శాశ్వత ప్రభావాన్ని చూపగలదు. టాలీవుడ్లో అలాంటి ప్రత్యేకతను చూపిన, చూపుతున్న దర్శకుల్లో ఒకరు పూరి జగన్నాథ్. తన తొలి సినిమా నుంచే కథానాయకుడిని కొత్త హైట్స్‌కు తీసుకెళ్లిన ఈ దర్శకుడు క్రమంగా ఇండస్ట్రీలో తన హీరోని ప్రత్యేకంగా నిలబెట్టాడు. అతడి ఆటిట్యూడ్ ప్రత్యేకమనిపించాడు. మరి ఈ ప్రత్యేకత అంతా పూరి ఓన్ క్రియేషనేనా అంటే... ఒక్కోసారి ఆలోచనలో పడాల్సి వస్తుంది. ముఖ్యంగా ‘చిరుత’ హీరో క్యారెక్టరయిజేషన్ విషయంలో! పూరీ ‘హీరో’ ప్రత్యేకమైనవాడు. ఆ హీరో ఒక ‘ఇడియట్’, ఒక ‘పోకిరి’. మరి అదే హీరో ‘చిరుత’ దగ్గరికి వచ్చేసరికి తన ఒరిజినాలిటీని కోల్పోయాడు. హాలీవుడ్ సినిమాను గుర్తు చేశాడు. లోకల్ మేడ్ చంటిగాడిని తయారు చేసిన పూరీ, చిరుత హీరో కోసం హాలీవుడ్ వరకూ వెళ్లాడు. ‘స్వెప్ట్ అవే’ హీరో మాదిరిగా తన హీరోను మలిచాడు. అంతేనా... ఏకంగా ఆ సినిమా నుంచి సీన్లను తెచ్చుకొన్నాడు. అందులోని పాత్రలను తన సినిమాకు అన్వయించుకున్నాడు. వాటి ఆటిట్యూడ్‌ను తన సినిమాలోని పాత్రలకు అలవాటు చేశాడు. అంతిమంగా మంచి ఔట్పుట్ వచ్చింది. అయితే మాత్రం... కాపీ అన్న నిజాన్ని కాదనగలమా?! చిరుత సినిమాలోని సీన్లను తనకు ఎంతో ఇష్టమైన ప్రాంతమైన బ్యాంకాక్ బాట పట్టించిన తర్వాత... పూరీని ‘స్వెప్ట్ అవే’ చిత్రంలోని పాత్రలు ఆవహించాయి. ప్రధాన పాత్రలు షిప్ ఎక్కడం దగ్గర నుంచి చిరుత సినిమాలో ‘స్వెప్ట్ అవే’ ఛాయలే కనిపిస్తాయి.హీరోయిన్ పాత్ర పొగరుమోతుతనం, హీరో మంచితనం... ఈ రెండు నైజాలూ ఎలివేట్ అయ్యే సీన్లు ‘స్వెప్ట్ అవే’ సినిమాలోనివి. నిజం చెప్పాలంటే హీరో, హీరోయిన్ పాత్రలకు ఉండే ఆ ఆటిట్యూడ్‌తో జనరేట్ అయ్యే సన్నివేశాలే ‘చిరుత’ను ప్రత్యేకంగా నిలిపాయి. అయితే అవన్నీ కాపీయే. షిప్ ఎక్కబోతూ అందరూ ఒకరినొకరు పరిచయం చేసుకొంటూ సరదాగా షేక్‌హ్యాండ్ ఇచ్చుకునే సీన్లో హీరోయిన్ గర్వాన్ని ప్రదర్శించడం దగ్గర నుంచి తనకంటే గొప్పవాళ్లు ఎవరూ లేనట్టుగా ఆమె ప్రవర్తించే ప్రతి సన్నివేశం ‘స్వెప్ట్ అవే’లోనివే. ఆ సినిమాలో మడోన్నా ధరించిన పాత్ర తీరులోనే నేహా పాత్ర సాగిపోతుంది. ఆ తర్వాత హీరో, హీరోయిన్లు ఒక చిన్న దీవిలో ఆగి పోయాక వారిద్దరి మధ్య వచ్చే సీన్లన్నీ కాపీనే. హీరో చేపలు పట్టడానికి ఆయు ధాన్ని తయారు చేసుకోవడం, కొండ వాలు నుంచి జాలువారే నీళ్లను తెలివిగా బాటిల్లో పట్టుకొని తాగడం, హీరోయిన్ బుర్రకు అలా నీళ్లను తాగే నేర్పు తట్టక పోవడం... ఇవన్నీ కాపీనే! చేపలు పట్టి ఆహారాన్ని తయారు చేసుకున్న హీరోని డబ్బుతో కొనాలని ప్రయత్నిస్తుంది హీరోయిన్. తన ఆకలిని తీర్చుకోవడానికి ఆమె అతడికి డబ్బును ఎరగా వేస్తుంది. అందుకోసం వంద డాలర్లతో బేరాన్ని మొదలుపెట్టి వెయ్యి డాలర్ల వరకూ వెళ్లి చివరకు కొనలేక పోతుంది. ఇక్కడ హీరోయిన్ అహంభావ పూర్వమైన తీరు, హీరో ఆత్మాభిమానం రెండూ హైలెట్ అవుతాయి. తన బట్టలు ఉతికి తెచ్చిస్తే ఆహారాన్ని ఇస్తానని హీరో చెప్పడం, తప్పని పరిస్థితుల్లో హీరోయిన్ అతడికి సేవలు చేయడం, సార్ అని సంబోధించడం... ఇలా ప్రతి బిట్లోనూ ‘స్వెప్ట్ అవే’నే కనిపిస్తుంది. సిల్వర్ స్పూన్‌తో పుట్టిన హీరోయిన్ ఆ పరిస్థితుల మధ్య గర్వాన్ని వదులుకుని హీరో దగ్గర అణిగిమణిగి ఉంటూ.. చివరకు అతడి ప్రేమలో పడటం ఇక్కడి ఓవరాల్ కాన్సెప్ట్. ‘స్వెప్ట్ అవే’లోని ఈ కాన్సెప్ట్నే పూరీ ‘చిరుత’ సినిమాలోకి తీసుకొచ్చాడు. అంటే, క్యారెక్టర్ ఎలివేషనే కాదు, ట్రాన్స్ఫార్మేషన్ కూడా కాపీనే. ఏ మాత్రం తేడా లేకుండా లాగించేశాడు. రెండు సినిమాలకూ ప్రాణం ఈ సీన్లే. ఈ సీన్సకి ముందు హీరోయిన్ క్యారెక్ట రైజేషన్ ఒకలా ఉంటే.. పూర్తయ్యేసరికి మరోలా మారుతుంది. హీరోకు అనుకూల వతిగా మారిపోతుంది. దానికోసమే పైన చెప్పుకున్న సీన్లన్నీ క్రియేట్ చేయడం జరిగింది. అయితే క్రియేట్ చేసింది మాత్రం హాలీవుడ్‌వాళ్లు. కాపీ కొట్టింది మనం. అంతులేని కాపీతో అడుగడుగునా ‘స్వెప్ట్ అవే’ చిత్రాన్ని దించేశారు. ఎంత సినిమా హిట్టయినా క్రియేటివిటీ మనది కాదన్న నిజాన్ని ఒప్పుకుని తీరాలిగా! - బి.జీవన్‌రెడ్డి