![NHFS Survey Shows Marginal Increase in Women Employment - Sakshi](/styles/webp/s3/article_images/2022/05/8/woman_1.jpg.webp?itok=LJIXTB9A)
న్యూఢిల్లీ: మన దేశంలో పెళ్లయిన మహిళల్లో, 15–49 ఏళ్ల లోపు మహిళల్లో 32 శాతం మంది ఉద్యోగాలు చేస్తున్నారు. ఏదో ఒక ఉపాధి పొందుతున్నారు. ఇదేవర్గం మహిళల్లో 83 శాతం మంది సంపాదనపరులే. 15 శాతం మందికి ఎలాంటి సంపాదన లేదు.
2019 నుంచి 2021 వరకు దేశవ్యాప్తంగా నిర్వహించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే–5లో ఈ విషయం తేటతెల్లమయ్యింది. 15–49 ఏళ్ల మహిళల్లో గతంలో 31 శాతం మంది ఉద్యోగులు ఉండేవారు. ఇప్పుడు ఆ సంఖ్య 32 శాతానికి చేరింది. దేశంలో మహిళా ఉద్యోగుల సంఖ్య క్రమంగా పెరుగుతోందని సర్వే తెలిపింది.
చదవండి: (తండ్రి మైనపు విగ్రహం పక్కనే.. డాక్టర్ అపూర్వతో యతీష్ వివాహం)
Comments
Please login to add a commentAdd a comment