
పెట్రోల్, డీజిల్‌పై విధించిన పన్నులను తగ్గించాలని అని వర్గాల నుంచి ఒత్తిడి వస్తున్న కారణంగా కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ఈ విషయంపై స్పందించారు. ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ.. భారతదేశంలో ఇంధన ధరల పెరుగుదల తాత్కాలికమేనని అని అన్నారు. అయితే, ఇంధన ధరలపై విధించిన పన్నులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు క్రమంగా తగ్గించాల్సిన అవసరం ఉంది అన్నారు. "అంతర్జాతీయ ఇంధన ధరల పెరుగుదల కారణంగా భారతదేశం కూడా ఇంధన ధరలను పెంచవలసి వచ్చింది. కానీ, ఇది తాత్కాలికం త్వరలో క్రమంగా ధరలు తగ్గుతాయి" అని కేంద్ర మంత్రి అన్నారు.
కరోనా మహమ్మారి తర్వాత ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడం కోసం ఇంధనాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇంధనాలపై పన్నులను విధిస్తున్నాయి. ఈ నెల ప్రారంభంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. పెట్రోలియం ధరపై కేంద్రం మాత్రమే సుంకాలు విధించడం లేదు రాష్ట్రాలు కూడా సుంకాలు విధిస్తున్నాయి కాబట్టి రాష్ట్రాలు, కేంద్రం చర్చించాల్సిన అవసరం ఉంది అన్నారు. కేంద్రం వచ్చే ఆదాయంలో 41 శాతం రాష్ట్రాలకే వెళ్తున్నట్లు నిర్మలా సీతారామన్ పేర్కొంది.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment