
న్యూఢిల్లీ: రష్యా సైనిక చర్య కారణంగా ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను తక్షణమే అక్కడి నుంచి స్వదేశానికి తీసుకురావాలని ప్రధాని మోదీ మంగళవారం భారత వైమానిక దళం(ఐఏఎఫ్)ను ఆదేశించారు. ప్రధాని ఆదేశాలతో ఆపరేషన్ గంగ మరింత వేగవంతం కానుందని అధికార వర్గాలు తెలిపాయి. భారతీయుల కోసం అతిపెద్ద సీ–17 రకం రవాణా విమానాలను సిద్ధం చేస్తున్నట్లు ఐఏఎఫ్ తెలిపింది. ఒక్కో విమానంలో 300 మంది ప్రయాణించవచ్చని వెల్లడించింది.
పక్కా వ్యూహం రూపొందించాలి: రాహుల్
ఉక్రెయిన్‌లోని ఖర్కీవ్‌లో రష్యా దాడుల్లో కర్ణాటక విద్యార్థి మృతి పట్ల కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సంతాపం ప్రకటించారు. ‘ఆ దేశంలో ఉన్న భారతీయులందరికీ సురక్షితంగా వెనక్కి తీసుకువచ్చేందుకు పక్కా వూహం రూపొందించాలి. ప్రతి నిమిషమూ విలువైందే’అని మంగళవారం రాహుల్ ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment