మహిళలపై నేరాలకు వెంటనే తీర్పు రావాలి: ప్రధాని మోదీ | PM Narendra Modi Key Comments Over Supreme Court | Sakshi
Sakshi News home page

మహిళలపై నేరాలకు వెంటనే తీర్పు రావాలి: ప్రధాని మోదీ

Published Sat, Aug 31 2024 12:34 PM | Last Updated on Sat, Aug 31 2024 12:34 PM

PM Narendra Modi Key Comments Over Supreme Court

సాక్షి, ఢిల్లీ: సుప్రీంకోర్టు మన ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత బలోపేతం చేసిందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. అలాగే, వ్యవస్థల పట్ల గౌరవాన్ని, విశ్వాసాన్ని సుప్రీంకోర్టు నెలకొల్పిందని ప్రశంసలు కురిపించారు.

కాగా, సుప్రీంకోర్టు 75ఏళ్ల వార్షికోత్సవం పురస్కరించుకొని జిల్లా న్యాయవ్యవస్థపై ప్రత్యేక సదస్సు జరిగింది. ఈ ప్రత్యేక సదస్సులో ప్రధాని మోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై. చంద్రచూడ్‌, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు 75 ఏళ్ల స్మారక చిహ్నం స్టాంప్‌ను, 75 రూపాయా నాణెంను విడుదల చేశారు.

 

 

అనంతరం, ప్రధాని మోదీ మాట్లాడుతూ..‘సుప్రీంకోర్టు ప్రయాణంలో 75 ఏళ్లు పూర్తి కావడమంటే, రాజ్యాంగ విలువలకు, పరిపక్వమైన ప్రజాస్వామ్యానికి నిదర్శనం.  సుప్రీంకోర్టు మన ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత బలోపేతం చేసింది. వ్యవస్థల పట్ల గౌరవాన్ని, విశ్వాసాన్ని నెలకొల్పింది. ఎమర్జెన్సీ చీకటి కాలంలో కూడా సుప్రీంకోర్టు ప్రాథమిక హక్కులకు హామీ ఇచ్చింది. జాతీయ ప్రయోజనాలను, జాతీయ సమగ్రతను సుప్రీం కోర్టు ఎప్పుడూ కాపాడుతుంది. మన న్యాయవ్యవస్థ 140 కోట్ల మంది దేశ ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుంది. మహిళలపై నేరాలకు సత్వరమే తీర్పులు రావాలి. మహిళలపై చోటు చేసుకొనే నేరాలపై సత్వరమే విచారణ పూర్తి అయి తీర్పులు రావాలి. మహిళలు, చిన్నారుల భద్రత సమాజానికి ఆందోళనకరంగా మరిందన్నారు. కాగా, కోల్‌కతా ఆర్జీ కర్‌ ఆస్పత్రి ఘటన నేపథ్యంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement