న్యూఢిల్లీ: సెపె్టంబర్ చివరినాటికి ప్రధాని మోదీ అమెరికాలో పర్యటించే అవకాశాలున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. క్వాడ్ దేశాల నేతల తొలి ముఖాముఖి భేటీ ఎక్కడ జరగాలన్న విషయం కొలిక్కివస్తే మోదీ అమెరికా పర్యటన ఖరారవుతుందన్నారు. ఈనెల 22–27మధ్య జరిగే అవకాశమున్న ఈ పర్యటనలో భాగంగా ప్రధాని ఐరాస జనరల్ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించడం, క్వాడ్ సమావేశాల్లో పాల్గొనడం, జోబైడెన్‌తో ముఖాముఖి జరపడం ఉంటాయని సదరు వర్గాలు తెలిపాయి.
నిజానికి ఈ సమావేశంపై ఇప్పటికే నిర్దిష్ట ప్రకటన రావాల్సిఉండగా, పదవి నుంచి దిగిపోతానన్న జపాన్ ప్రధాని సుగా ప్రకటనతో సమావేశం డైలమాలో పడింది. సుగా ప్రకటనతో క్వాడ్ సమావేశమే కాకుండా త్వరలో జరగాల్సిన ఇండో–జపాన్ సమావేశం కూడా సందిగ్ధంలో పడింది. ఇప్పటికి రెండేళ్లుగా ఈ సమావేశం వాయిదా పడుతూ వస్తోంది. పరిస్థితులు అనుకూలించి మోదీ అమెరికా పర్యటన ఖరారైతే చేయాల్సిన ఏర్పాట్లపై ఇండో అమెరికా అధికారులు చర్చలు జరిపారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా ఆధిపత్యానికి చెక్ చెప్పాలనే ఉద్దేశంతో అమెరికా క్వాడ్‌ను ఏర్పాటుచేసింది. గత మార్చిలో క్వాడ్ నేతల ఆన్‌లైన్ సమావేశం జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment