సుస్థిర ప్రభుత్వంతో సఫలత సాధ్యం | PM Narendra shares tweets by citizens on 9 Years Of Modi Government | Sakshi
Sakshi News home page

సుస్థిర ప్రభుత్వంతో సఫలత సాధ్యం

Published Sun, May 28 2023 3:32 AM | Last Updated on Sun, May 28 2023 3:58 AM

PM Narendra shares tweets by citizens on 9 Years Of Modi Government - Sakshi

న్యూఢిల్లీ: ప్రజలు సుస్థిర ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం వల్లే వారికిచ్చిన వాగ్దానాలను ప్రభుత్వం నెరవేర్చగలిగిందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చి శుక్రవారంతో తొమ్మిదేళ్లు పూర్తయిన సందర్భంగా వచ్చిన అభినందనపై ఆయన స్పందించారు.

‘ పౌరులు సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం వల్లే ప్రజలకు మేం ఇచ్చిన కీలకమైన హామీల సాధన సాధ్యమైంది. ఈ ట్వీట్ల ద్వారా మీరు చూపించే ఆదరణ ప్రజల కోసం మరింత శ్రమించేందుకు కావాల్సిన స్థైర్యాన్ని నాకు అందిస్తోంది. గత తొమ్మిదేళ్లలో విస్తృతంగా క్షేత్రస్థాయిలో పనిచేశాం. ఈ అమృతకాలంలో మరింత పటిష్ట, సుసంపన్నమైన భారతావనిని ఆవిష్కరిస్తాం. మీ సాటిలేని మద్దతే మా శక్తిసామర్థ్యాలకు ఆధారం’ అని మోదీ ట్వీట్‌చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement