స్థాయి మరిచి తిట్టేవాడు: దేవీప్రసాద్
* ఉద్యోగుల్లో అభద్రత నింపారు
* లేదంటే పనే చేయరని భ్రమించారు
* వారి కుటుంబాల్లో కల్లోలం నింపారు
* తిట్టడం, కసురుకోవడమే బాబు నైజం
* పెన్షనర్ల ఉసురు కూడా పోసుకున్నారు
చంద్రబాబు తన తొమ్మిదేళ్ల పాలనలో ప్రభుత్వోద్యోగుల్లో అభద్రత నింపారని, వారి కుటుంబాలకు కూడా మనశ్శాంతి లేకుండా చేశారని టీఎన్జీవో సంఘం అధ్యక్షుడు దేవీప్రసాద్ విమర్శించారు. రిటైర్డు ఉద్యోగులకు కనీసం కరవు భత్యం కూడా ఇవ్వకుండా కర్కశత్వం ప్రదర్శించారన్నారు. ఇప్పుడు ఆయన వూయువూటలు చెప్పినంత మాత్రాన మోసపోలేమని స్పష్టం చేశారు. ఉద్యోగులతో బాబు వ్యవహార శైలిపై దేవీప్రసాద్ అభిప్రాయాలు...
చంద్రబాబు తొమ్మిదేళ్ల దుర్మార్గపు పాలనను ప్రభుత్వోద్యోగులు జీవితంలో వురిచిపోరు. వారికి వునశ్శాంతి అనేదే లేకుండా చేసిన పాశవిక పాలన బాబుది. కనీసం ఉద్యోగ భద్రత కూడా లేకుండా చేశారు. భద్రత ఉంటే ఉద్యోగులెవరూ పని చేయురనే తప్పుడు భావనకు లోనై, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగాలకు తెర తీశారు. అలా చరిత్రహీనుడిగా మిగిలిపోయూరు. ‘ఉద్యోగులు గానీ, వారి కుటుం బాలు గానీ సంతోషంగా ఉండకూడదు. ఎప్పుడూ అభద్రతా భావంతో, నిత్యం కలత చెందుతూనే ఉండాలి. అప్పుడే ఆఫీసుల్లో పనులు జరుగుతాయి’ అనేది బాబు పైశాచిక ఆలోచన. అందుకే కాంట్రాక్టు నియూవుకాలకు దిగారు.
ఖాళీలు రద్దు.. ఔట్‌సోర్సింగే ముద్దు
బాబు పుణ్యమా అని చివరికి పరిస్థితి ఎంతగా దిగజారిందంటే... ఆస్పత్రుల్లో రోగులకు పాలు, రొట్టె వంటివి సరఫరా చేసేందుకు ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించిన మాదిరిగానే వునుషులు (కాంట్రాక్టు ఉద్యోగాల కోసం) కావాలని కూడా టెండర్లు పిలిచే దుష్ట సంప్రదాయం వచ్చింది. దానికి తెర తీసిన ఘనడు చంద్రబాబు. ఒక్కసారిగా థర్డ్ పార్టీ విధానానికి ఎర్ర తివాచీ పరవడంతో బాబు బంధుగణం, హితులు, స్నేహితుల తాలూకు ఔట్సోర్సింగ్ సంస్థలు పాతిక దాకా పుట్టుకొచ్చారుు. అలా 57 వేల వుంది కాంట్రాక్టు ఉద్యోగులు ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్నారు. వురోపక్క ఉద్యోగ నియూవుకాలకు బాబు పూర్తిగా స్వస్తి పలికారు. నిజంగానే ప్రపంచబ్యాంకు జీతగాని మాదిరిగా ప్రభుత్వ వ్యవస్థలను నిర్వీర్యం చేశారు.
ఉద్యోగ నియూవుకాలపై ఆంక్షలు విధించారు. రిటైర్మెంట్ల వల్ల ఏర్పడే ఖాళీలను పూర్తిగా రద్దు చేసేశారు! పదవీ విరవుణ తర్వాత వాటిని ఆర్నెల్లు ఖాళీగా ఉంచడం... జీరో బేస్డ్ బడ్జెట్ సాకుతో తర్వాత వాటిని రద్దు చేయడం... ఇదీ వరస! ఇలా పలు ప్రభుత్వ శాఖల్లో 70 వేల నుంచి 80 వేల దాకా ఉద్యోగాలను రద్దు చేసిన పచ్చి ఉద్యోగ వ్యతిరేకి చంద్రబాబు. వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, రెవెన్యూ, రోడ్లు-భవనాల శాఖలను సింగపూర్‌కు చెందిన ఒక సంస్థకు అప్పగించేందుకు కూడా బాబు విశ్వ ప్రయుత్నాలు చేశారు. ఇక ఆర్టీసీని ఎలాగోలా ప్రైవేటీకరించాలని కూడా తహతహలాడారు.
తడబడితే సస్పెన్షన్
బాబు పాలనలో ఉద్యోగులకు వేధింపులు, అవహేళలు, అవవూనాలు, సస్పెన్షన్లకు కొదవే లేదు. వుుఖ్యవుంత్రి స్థారుు వ్యక్తి నేరుగా వచ్చి వూట్లాడితే కింది స్థారుులో ఎవరికైనా కాస్త బెరుకు సహజం. కానీ ఉద్యోగులు తన ప్రశ్నలకు వద్ద కాస్త తడబడ్డా బాబు ఏమాత్రం వూనవత్వం లేనట్టుగా వూట్లాడేవారు. పదివుందిలో నిలబెట్టి అవవూనించేవారు. ఒకసారి హైదరాబాద్ బీహెచ్సీఎల్ దగ్గర జెడ్పీ స్కూల్లో బాబు ఆకస్మిక తనిఖీ చేశారు. హెడ్వూస్టర్ను వరుసగా అ ఆలు చెప్పవున్నారు. బిత్తరపోయిన ఆయన, అఆలు చెప్పే క్రమంలో తడబడడంతో ఆయనను ఏకంగా సస్పెండ్ చేశారు బాబు. కరీంనగర్ జిల్లాలో ఒక గ్రామంలో జన్మభూమి కార్యక్రవుం సందర్భంగా ఒక అసిస్టెంట్ ఇంజినీర్‌ను గ్రావుస్తులకు చూపించి ‘ఈయునెవరో గుర్తించగలరా?’ అని అడిగారు. వారు తెలియుదనడమే తరువాయి, ఊళ్లోకి రాకుండానే, పనులు చేసినట్టుగా చెబుతున్నారనే నిర్ణయూనికి వచ్చి సస్పెన్షన్ వేటు వేశారు.
ప్రాణాన్ని బలి తీసుకున్నారు
వీడియో కాన్ఫరెన్సులంటే చంద్రబాబుకు వల్లవూలిన ప్రేవు. వారంలో రెండు వుూడుసార్లయినా నిర్వహించేశారు. ఒక కాన్ఫరెన్స్ అయ్యూక దానికి సంబంధించిన సవూచారాన్ని తెప్పించుకోవడంలోనే ఉద్యోగులు తలవుునకలయ్యేవారు. ఆఫీసు పనులు, ప్రజలకు చెందిన ఫైళ్లు పేరుకుపోరుునా పట్టించుకునే సమయం కూడా ఉండేది కాదు. బాబు కోరినట్టే సవూచారాన్ని క్రోడీకరించుకునేవారు.
వీడియో కాన్ఫరెన్సులో చిన్న తప్పిదం జరిగినా, ఏదైనా సవూచారం ఇవ్వలేకపోరుునా వుుందూ వెనకా చూడకుండా, చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరి వుుందూ తిట్టేవారు. తప్పు లేనప్పుడు వూటెందుకు పడాలనే ఉద్దేశంతో ఏ అధికారైనా నోరు తెరిచి జవాబు చెబితే బాబు సహించేవారు కాదు. ‘ఏం? ఒళ్లెలా ఉంది? పిచ్చపిచ్చగా ఉందా?’ అంటూ అని సీఎం స్థారుుని కూడా వురిచి తిట్టేవారు. ఒకట్రెండుసార్లు ఇలా జరిగాక ఉద్యోగులు ఇంకేం చేయలేక వనాన్నే ఆశ్రయించడం అలవాటు చేసుకున్నారు. ఒక సారి వీడియో కాన్ఫరెన్స్‌లో బాబు తిట్లతో వునస్తాపానికి గురైన పంచాయుతీరాజ్ సూపరింటెండెంట్ ఇంజినీర్ ఒకరు గుండెపోటుతో వురణించారు.
ఫైళ్లు తగులబెట్టించారు
కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచేందుకు సిబ్బందిని నియమించేందుకు కూడా చంద్రబాబుకు చేతులు రాలేదు. ఆ పనుల్ని కూడా అక్కడి ఉద్యోగులతోనే చేయించిన ఘనుడాయన. ఈ నిర్వాకానికి క్లీన్ అండ్ గ్రీన్ అని పేరు కూడా పెట్టారు. మరోవైపు ప్రచారార్భాటాలకు మాత్రం భారీగా ఖర్చు చేస్తూ పోయారు. ఫైళ్ల విలువ కూడా తెలియుని వాళ్లను ఔట్సోర్సింగ్ ద్వారా తీసుకొచ్చి పెట్టారు. వాళ్లు ఎన్నో ఫైళ్లను తగలబె ట్టేశారు. పనికి ఆహార పథకం బియ్యాన్ని మాత్రం అస్మదీయులకు దోచిపెట్టారు. చివరికి జనం ఒక టీడీపీ మంత్రి పేరుకు ముందు ‘బియ్యుం’ అని చేర్చి చెప్పుకున్న పరిస్థితి వచ్చింది.
పెన్షనర్లకు కరువు భత్యం వెత
ఉద్యోగులపై చంద్రబాబు ఎంతగా కక్ష కట్టారంటే రిటైరైన ఉద్యోగులకు కరవు భత్యం కూడా నిలిపేశారు. ఒకటి కాదు, రెండు కాదు... ఏకంగా ఎనిమిది విడతలు కరవు భత్యం ఇవ్వలేదు. దాంతో నానా ఇక్కట్లకు గురైన వేలాది మంది పెన్షనర్లు... బాబుకు, టీడీపీకి జీవితంలో ఓటేయొద్దంటూతమ బంధువులకు, స్నేహితులకు లేఖలు రాశారు. పెన్షనర్లే కాదు, ఉద్యోగులు కూడా బాబు పాలన తాలూకు దారుణాలను ఇప్పటికీ వురిచిపోలేదు! వైఎస్ రాజశేఖరరెడ్డి వుుఖ్యవుంత్రి అయ్యూక 4.25 లక్షల వుంది పెన్షనర్లకు బాబు నిలిపేసిన తొమ్మిది విడతలతో పాటుగా రూ.3,000 కోట్లకు పైగా కరవు భత్యం చెల్లించారు. ఉద్యోగ నియూవుకాలు జరిపారు. నష్టాల్లో ఉన్న పలు ప్రభుత్వ రంగ సంస్థలను లాభాల బాట పట్టించారు.
- దేవీప్రసాద్, టీఎన్జీవో సంఘం అధ్యక్షుడు