భోపాల్: కరోనా వైరస్ రాకూడదంటే భౌతిక దూరం, ఫేస్ మాస్క్ ధరించడం, ఎప్పటికప్పుడు చేతులను శుభ్రపరుచుకోవడం వంటికి అందరికీ తెలుసు. ఇప్పటికే కరోనా బారిన పడినవారు శక్తివంతమైన ఆహారం తీసుకుంటూ రోగ నిరోధక శక్తిని పెంపొందించుకుంటూ మహమ్మారితో పోరాడుతున్నారు. మరోవైపు వీరికి వ్యాక్సిన్ అందుబాటులోకి తెచ్చేందుకు శాస్త్రవేత్తలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే వ్యాక్సిన్, మందులతో కాకుండా హనుమాన్ చాలీసా పఠిస్తే సరిపోతుందని బీజేపీ ఎంపీ ప్రగ్యా ఠాకూర్ సెలవిచ్చారు. (అకృత్యం: నిందితుడికి పాజిటివ్.. ఆమెకు నెగటివ్)
ఈమేరకు శనివారం ట్విటర్‌లో "కరోనాతో పోరాడేందుకు అందరూ జూలై 25 నుంచి ఆగస్టు 5 వరకు తప్పనిసరిగా రోజుకు ఐదు సార్లు హనుమాన్ చాలీసా పఠించండి. ఆఖరి రోజు ఇంట్లో దీపాలను వెలిగించి రాముడికి హారతి పట్టండి. దేశవ్యాప్తంగా ఉన్న హిందువులు హనుమాన్ చాలీసాను ఒకే స్వరంలో పఠిస్తే దానికి కచ్చితంగా ఫలితం ఉంటుంది. కరోనా నుంచి మనం విముక్తి పొందుతాం.. ఇది రాముడికి చేసే ప్రార్థన" అని చెప్పుకొచ్చారు. ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న భోపాల్‌లో వచ్చేనెల 4 వరకు లాక్‌డౌన్ అమల్లో ఉంది. ఈ విషయాన్ని ఆమె ప్రస్తావిస్తూ.. "4న లాక్‌డౌన్ ముగుస్తుంది, 5న మనం చేపట్టిన ఆధ్యాత్మిక కార్యక్రమం ముగుస్తుంది. పైగా అదే రోజు అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి భూమిపూజ జరగనుంది. ఆ రోజును మనం పండగలా వేడుక చేసుకుందాం" అని పిలుపునిచ్చారు. (సీఎం ఎడిటెడ్ వీడియో పోస్ట్ .. దిగ్విజయ్‌పై కేసు)
Comments
Please login to add a commentAdd a comment