గర్భిణిని కాటేసిన స్వైన్‌ఫ్లూ.. తీవ్ర జ్వరంతో బాధపడుతూ.. | Pregnant Woman Dies Of Swine Flu In Karnataka | Sakshi
Sakshi News home page

గర్భిణిని కాటేసిన స్వైన్‌ఫ్లూ.. తీవ్ర జ్వరంతో బాధపడుతూ..

Published Fri, Sep 2 2022 9:30 AM | Last Updated on Fri, Sep 2 2022 10:24 AM

Pregnant Woman Dies Of Swine Flu In Karnataka - Sakshi

సాక్షి, మైసూరు: స్వైన్‌ఫ్లూ (హెచ్‌1ఎన్‌1) లక్షణాలతో గర్భిణి మృతి చెందిన ఘటన మైసూరు జిల్లా హుణసూరు పట్టణంలో చోటు చేసుకుంది. ఇక్కడి కోణనహొసహళ్లి గ్రామానికి చెందిన స్వామినాయక కుమార్తె ఛాయ (26) తీవ్ర  జ్వరంతో బాధపడుతుండగా మైసూరులోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించగా హెచ్‌1ఎన్‌1గా గుర్తించారు.

చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు ఆస్పత్రి వైద్యులు తెలిపారు.  జిల్లా ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ హెచ్‌కే ప్రసాద్‌  వివరాలు తెలుసుకున్నారు. వర్షాకాలంలో ఈ వ్యాధి విజృంభించే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 
చదవండి: Karnataka: పోక్సో కేసులో మురుఘ మఠాధిపతి అరెస్ట్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement