
న్యూఢిల్లీ: రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్మును ఎంపిక చేయడాన్ని దేశంలోని అన్ని వర్గాలు స్వాగతిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. క్షేత్రస్థాయి సమస్యలపై ఆమెకు మంచి అవగాహన ఉందని, దేశాభివృద్ధిపై అద్భుతమైన ముందుచూపు ఉందని ట్విటర్‌లో ప్రశంసించారు. జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డీఏ) రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైన ద్రౌపది ముర్ము గురువారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ నేపథ్యంలో ఆమెను ప్రశంసిస్తూ ప్రధాని ట్వీట్ చేశారు.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కూడా ద్రౌపది ముర్ము మర్యాదపూర్వకంగా కలిశారు. శాలువా, పుష్పగుచ్ఛంతో ఆమెను అమిత్ షా స్వాగతించారు. బీజేపీ సీనియర్ నాయకులతోనూ ఆమె భేటీ అవుతారు. రాష్ట్రపతి ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని వివిధ పార్టీల నాయకులను కలిసి ఆమె కోరనున్నారు. కాగా, జూన్ 24న ఆమె నామినేషన్ దాఖలు చేయనున్నారు. జూలై 18న రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ జరుగుతుంది.
(క్లిక్: రాష్ట్రపతి ఎన్నిక ఎందుకు ప్రతిష్ఠాత్మకం?)
Comments
Please login to add a commentAdd a comment