ఛంఢీఘర్: పంజాబ్ ఆరోగ్య శాఖ మంత్రి బల్బీర్ సింగ్ సిద్ధుకు మంగళవారం కరోనా టెస్ట్ నిర్వహించారు. పరీక్షలలో ఆయనకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఇటీవల సంగ్రూర్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీతో వేదికను పంచుకున్నారు. బల్బీర్ సింగ్ సిద్ధుకు తేలికపాటి జ్వరం, గొంతు నొప్పి ఉండటంతో పరీక్షలు చేశామని మొహాలి సివిల్ సర్జన్ మంజిత్ సింగ్ తెలిపారు. ‘బల్బీర్ సింగ్ తన ఇంట్లో ఐసోలేషన్‌లో ఉన్నారు. ఆయనతో ఉన్న వ్యక్తులకు కూడా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు’ అని డాక్టర్ తెలిపారు.
సంగ్రూర్‌లో సోమవారం నిర్వహించిన ఖేతి బచావోలో బల్బీర్ సింగ్ సిద్ధు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీతో కలిసి పాల్గొన్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో కేంద్రం చేసిన కొత్త వ్యవసాయ చట్టాలకు నిరసనగా ఈ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పంజాబ్ ముఖ్యమంత్రి అమరేందర్ సింగ్, పంజాబ్ ప్రధాన కార్యదర్శి హరీష్ రావత్, పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ సునీల్ జఖర్, మంత్రులు బల్బీర్ సిద్ధూ, విజయ్ ఇందర్ సింగ్లా, రానా గుర్మిత్ సోధి, రాజ్యసభ ఎంపీ దీపేందర్ హుడా తదితరులు పాల్గొన్నారు.
చదవండి: రైతులకు అన్యాయం జరగనివ్వం
Comments
Please login to add a commentAdd a comment