న్యూఢిల్లీ: దత్తత బాధ్యతలు తీసుకున్న కేంద్ర మంత్రి ఆ యువకుడికి పెళ్లి కూడా ఘనంగా జరిపించారు. దళిత పేద విద్యార్థిగా ఉన్న ఆ యువకుడి విద్యాభ్యాసానికి రాజ్‌నాథ్ సింగ్ సహకారం అందించాడు. అతడి పెళ్లికి కూడా హాజరై నూతన దంపతులను ఆశీర్వదించాడు. రాజ్‌నాథ్ సహకారంతోనే ఆ యువకుడు ప్రస్తుతం వైద్యుడిగా పని చేస్తున్నాడు.
ఉత్తరప్రదేశ్ ఘాజీపూర్ జిల్లా మదరిపూర్‌కు చెందిన బిజేంద్రకుమార్. ఈ దళిత పేద విద్యార్థి 2000లో 8వ తరగతి పరీక్షల్లో టాపర్‌గా నిలిచాడు. ఉన్నత చదువులకు కుటుంబ పరిస్థితులు సహకరించలేదు. అప్పటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న రాజ్‌నాథ్ సింగ్‌కు ఈ విషయం తెలిసింది. వెంటనే స్పందించి బిజేంద్రకుమార్ విద్యాభ్యాసానికి సహకరించాడు. అప్పటి నుంచి బిజేంద్రకు అన్ని విధాల అండదండలు రాజ్‌నాథ్ సింగ్ అందించారు. అనంతరం రాజ్‌నాథ్ జాతీయ రాజకీయాల్లోకి వచ్చినా కూడా బిజేంద్ర బాగోగులు పర్యవేక్షించారు.
రాజ్‌నాథ్ సహకారంతో బిజేంద్ర ఎంబీబీఎస్ చదివి ఇప్పుడు వైద్యుడయ్యాడు. అయితే బిజేంద్ర వివాహం అని తెలిసి రాజ్‌నాథ్ సింగ్ ప్రత్యేకంగా యూపీలోని సైద్‌పూర్ గ్రామానికి వచ్చి ఆ దంపతులను ఆశీర్వదించేందుకు వచ్చాడు. 20 ఏళ్ల తర్వాత రాజ్‌నాథ్ సింగ్ తనను కలవడానికి రావడంతో బిజేంద్ర ఉబ్బితబ్బిబయ్యాడు. తనకు జీవితమిచ్చిన రాజ్‌నాథ్‌ను ఎప్పటికీ మరువలేని బిజేంద్ర తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment