సాక్షి, చెన్నై: కరోనాతో బెంగళూరు విక్టోరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నమ్మ శశికళ ఫిబ్రవరి 3న చెన్నైకు రాబోతున్నారు. ఈనెల 27న జైలు నుంచి విడుదల కాగానే, ప్రైవేటు ఆస్పత్రిలో చేరి కొద్ది రోజులు చికిత్స తీసుకోనున్నారు. అక్రమాస్తుల కేసులో చిన్నమ్మకు విధించిన నాలుగేళ్ల శిక్షాకాలం బుధవారంతో ముగియనుంది. ఈ క్రమంలో చిన్నమ్మ కరోనా బారిన పడ్డారు. ఆమెకు విక్టోరియా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. కరోనా నుంచి ప్రస్తుతం ఆమె కోలుకున్నారు. ఈనెల 27న జైలు నుంచి చిన్నమ్మ విడుదల కావడం దాదాపు ఖాయమైంది. బుధవారం విక్టోరియా ఆస్పత్రి నుంచి ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లి, పూర్తి స్థాయిలో వైద్య పరీక్షలు చేసుకునేందుకు చిన్నమ్మ నిర్ణయించారు. చిక్సిత తీసుకుని ఫిబ్రవరి 3న చెన్నైకు వచ్చే అవకాశాలు ఉన్నట్టు అమ్మ శిబిరం తెలిపింది. ఆమెకు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
వేదారణ్యంలో కలవరం
నాగపట్నం జిల్లా వేదారణ్యం పరిసరాల్లో వింత జ్వరాలు విలయతాండవం చేస్తున్నాయి. పది గ్రామాల్లో వైద్య బృందాలు పరీక్షలు చేస్తున్నాయి. ఇక ఇంగ్లాండ్ నుంచి చెన్నైకు ఆదివారం వచ్చిన వారిలో ఐదుగురికి పాజిటివ్ రావడంతో ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment