shashi kala
-
7న చెన్నైకి చిన్నమ్మ.. నేరుగా అమ్మ సమాధి వద్దకు
సాక్షి, చెన్నై: చిన్నమ్మ శశికళ ఈనెల 7న బెంగళూరు నుంచి చెన్నైకి రావడం ఖరారైంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నాలుగేళ్ల శిక్ష పూర్తి చేసుకుని గత నెల 27న విడుదలైన శశికళ కరోనా పాజిటివ్ కారణంగా ఆస్పత్రిలో చేరారు. గతనెల 31న ఆస్పత్రి నుంచి డిశ్చార్జయిన నాటి నుంచి బెంగళూరు శివార్లలోని లగ్జరీ ఫాంహౌస్‌లో విశ్రాంతి తీసుకుంటున్నారు. కరోనా నుంచి బైటపడినా వారంరోజులపాటు క్వారంటైన్లో ఉండాల్సి వచ్చింది. దీంతో ఈనెల 7న ఆమె బెంగళూరు నుంచి చెన్నైకి చేరుకోవడం ఖరారైంది. 7వ తేదీ ఉదయం 7.30 గంటలకు బెంగళూరులో బయలుదేరి కర్ణాటక–తమిళనాడు సరిహద్దులోని అత్తిపల్లి వద్ద ఆమెకు ఘనస్వాగతం చెప్పేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. చదవండి: వచ్చే ప్రభుత్వంలో శశికళ కీలక పాత్ర అమ్మ సమాధికి అడ్డంకి.. బెంగళూరు నుంచి చెన్నైకి చేరుకోగానే నేరుగా మెరీనా బీచ్‌లోని జయలలిత సమాధిని దర్శించుకుని తన రాజకీయ ప్రస్తానాన్ని ప్రారంభించేలా శశికళ కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. అయితే జయ సమాధికి తుదిమెరుగుల పనులు కొనసాగుతున్న కారణంగా సందర్శనకు 15 రోజులపాటు ప్రభుత్వం నిషేధం విధించింది. దీంతో శశికళకు కూడా దర్శించే అవకాశం లేకుండాపోయింది. 2017, ఫిబ్రవరి 24న అరెస్ట్ కాగానే నేరుగా జయలలిత సమాధి వద్దకు వెళ్లిన శశికళ ఆవేశంతో అరచేతితో మూడుసార్లు సమాధిపై చరచడం పెద్ద చర్చనీయాంశమైంది. నేడు జైలు నుంచి విడుదలైన తరువాత కూడా నేరుగా సమాధి వద్దకు చేరుకుంటే ఎలాంటి వ్యవహరశైలిని ఆమె అనుసరిస్తారో అనే అనుమానంతోనే ప్రభుత్వం ఈ ఎత్తుగడ వేసిందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. -
ఫిబ్రవరిలో చెన్నైకు చిన్నమ్మ..!
సాక్షి, చెన్నై: కరోనాతో బెంగళూరు విక్టోరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నమ్మ శశికళ ఫిబ్రవరి 3న చెన్నైకు రాబోతున్నారు. ఈనెల 27న జైలు నుంచి విడుదల కాగానే, ప్రైవేటు ఆస్పత్రిలో చేరి కొద్ది రోజులు చికిత్స తీసుకోనున్నారు. అక్రమాస్తుల కేసులో చిన్నమ్మకు విధించిన నాలుగేళ్ల శిక్షాకాలం బుధవారంతో ముగియనుంది. ఈ క్రమంలో చిన్నమ్మ కరోనా బారిన పడ్డారు. ఆమెకు విక్టోరియా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. కరోనా నుంచి ప్రస్తుతం ఆమె కోలుకున్నారు. ఈనెల 27న జైలు నుంచి చిన్నమ్మ విడుదల కావడం దాదాపు ఖాయమైంది. బుధవారం విక్టోరియా ఆస్పత్రి నుంచి ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లి, పూర్తి స్థాయిలో వైద్య పరీక్షలు చేసుకునేందుకు చిన్నమ్మ నిర్ణయించారు. చిక్సిత తీసుకుని ఫిబ్రవరి 3న చెన్నైకు వచ్చే అవకాశాలు ఉన్నట్టు అమ్మ శిబిరం తెలిపింది. ఆమెకు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వేదారణ్యంలో కలవరం నాగపట్నం జిల్లా వేదారణ్యం పరిసరాల్లో వింత జ్వరాలు విలయతాండవం చేస్తున్నాయి. పది గ్రామాల్లో వైద్య బృందాలు పరీక్షలు చేస్తున్నాయి. ఇక ఇంగ్లాండ్ నుంచి చెన్నైకు ఆదివారం వచ్చిన వారిలో ఐదుగురికి పాజిటివ్ రావడంతో ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. -
శశికళ విడుదల ఖాయం
సాక్షి, చెన్నై: జనవరి 27న జైలు జీవితం నుంచి చిన్నమ్మ శశికళ బయటకు రావడం ఖాయం అని అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఆమెకు బ్రహ్మరథం పట్టే రీతిలో ఆహ్వాన ఏర్పాట్లపై దృష్టి పెట్టారు. అక్రమాస్తుల కేసులో పరప్పన అగ్రహార చెరలో ఉన్న శశికళ శిక్షా కాలం జనవరిలో ముగియనున్న విషయం తెలిసిందే. ఆమె ముందుగానే విడుదల అవుతారన్న ప్రచారం సాగినా, అందుకు తగ్గ పరిస్థితులు కనిపించలేదు. తన ముందస్తు విడుదల విషయంగా శశికళ చేసుకున్న విజ్ఞప్తిని కర్ణాటక జైళ్లశాఖ వర్గాలు పరిశీలనలో ఉంచాయి. ఈ పరిస్థితుల్లో చిన్నమ్మ ముందుస్తుగాకాదు అని, శిక్షాకాలం ముగియగానే జనవరి 27న విడుదల కావడం తథ్యమని, ఇందులో మార్పు ఉండదని అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం వర్గాలు తాజాగా ధీమా వ్యక్తం చేసే పనిలో పడ్డాయి. చదవండి: నో పార్టీ.. ఓన్లీ సేవ మంగళవారం చిన్నమ్మ రాక గురించి చెన్నైలోని కార్యాలయంలో ఆ కళగం వర్గాలు సమావేశం కావడం, ఆహ్వాన ఏర్పాట్లపై దృష్టి పెట్టడం గమనించదగ్గ విషయం. జనవరి 27న చిన్నమ్మ జైలు నుంచి బయటకు రావడం ఖాయమని, నేరుగా మెరీనా తీరానికి వెళ్లి అమ్మ జయలలిత సమాధి వద్ద శపథం చేయనున్నారని, ఆ తర్వాత ఆమె ఇంటికి వెళ్తారని ఆ కళగం నేత ఒకరు పేర్కొన్నారు. చిన్నమ్మకు బ్రహ్మరథం పట్టే రీతిలో 65 చోట్ల ఆహ్వాన ఏర్పాట్లకు నిర్ణయించామని, ఇందుకు తగ్గ ఏర్పాట్లపై దృష్టి పెట్టనున్నామని తెలిపారు. మరో 28 రోజుల్లో చిన్నమ్మ బయటకు వస్తారని, ఇది జరిగి తీరుతుందని ఆ నేత ధీమా వ్యక్తంచేశారు. -
‘చిన్నమ్మ’కు ఇక నో ఎంట్రీ
సాక్షి, చెన్నై: వేదనిలయంతో చిన్నమ్మ శశికళకు ఇక, బంధం తెగినట్టే. ఆ గృహాన్ని ప్రభుత్వం తన గుప్పెట్లోకి తీసుకోవడంతో, అటువైపు వెళ్ల లేని పరిస్థితి. ఈ దృష్ట్యా, చిన్నమ్మ కోసం మరో షెల్టర్ సిద్ధం చేయడానికి తగ్గ కసరత్తులపై అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం వర్గాలు దృష్టి పెట్టారు. చెన్నై పోయెస్‌గార్డెన్‌లోని దివంగత సీఎం, అమ్మ జయలలితకు చెందిన వేదనిలయం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాష్ట్ర, జాతీయ రాజకీయాల చర్చలకు, ఎందరో ప్రతినిధులతో సంప్రదింపులు, భేటీలకు వేదికగా ఒకప్పుడు ఈ భవనం నిలిచింది. అమ్మ జయలలిత ఆశీర్వచనాల కోసం బారులు తీరిన వాళ్లు ఎందరో. (షూటింగ్‌లకు త్వరలోనే అనుమతి) అయితే, ఇప్పుడు అమ్మ లేని దృష్ట్యా, ఆ పరిసరాలే నిర్మానుష్యం అయ్యాయి. అయితే, ఈ భవనంతో చిన్నమ్మ శశికళకు ప్రత్యేక అనుబంధమే ఉంది. జయలలిత నెచ్చెలిగా రెండున్నర దశాబ్దాలకు పైగా చిన్నమ్మ శశికళ ఈ భవనంలో ఉన్నారు. జయలలిత తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక చిన్నమ్మ హస్తం ఉండేది. ఈ ఇంటికి సంబంధించిన అన్ని వ్యవహారాలు చిన్నమ్మకే ఎరుక. అమ్మ మరణం తర్వాత పరిణామాలతో చిన్నమ్మ శశికళ ఈ నివాసానికి నాయకిగా అవతరించినా, అమ్మకు దక్కిన గౌరవాన్ని ఈ నివాసం వేదికగా తనకు దక్కించుకున్నా, చివరకు అక్రమాస్తుల కేసు రూపంలో పరప్పన అగ్రహార చెరలో ఊచలు లెక్కించక తప్పలేదు. (ఆగస్టులోగా అంతర్జాతీయ విమానాలు!) ఇక అనుమతి లేనట్టే.. చిన్నమ్మ జైలు జీవితం తర్వాత చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందుకు కొనసాగింపుగా ప్రస్తుతం వేదనిలయంలోకి చిన్నమ్మ అడుగు పెట్ట లేని పరిస్థితి. ఈ నివాసాన్ని అమ్మ స్మారక మందిరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం నిర్ణయించినా, న్యాయ చిక్కులతో జాప్యం తప్పలేదు. ఎట్టకేలకు ప్రత్యేక చట్టం ద్వారా ఆ భవనాన్ని తన గుప్పెట్లోకి ప్రభుత్వం తీసుకుంది. ఈ దృష్ట్యా, ఇక, చిన్నమ్మ ఆ ఇంటి వైపుగా కన్నెత్తి చూడలేని పరిస్థితి. గతంలో ఓమారు పెరోల్‌పై బయటకు వచ్చిన సమయంలో న్యాయ వివాదాల కారణంగా పోయెస్‌గార్డెన్‌కు చిన్నమ్మ వెళ్ల లేని పరిస్థితి ఏర్పడింది. దీంతో చెన్నైలోని తన బంధువు ఇంట్లో ఉండక తప్పలేదు. ఆమె జైలు జీవింతం ముగించి బయటకు రాగానే, పోయెస్‌గార్డెన్ మీదే గురి పెట్ట వచ్చన్న సంకేతాలు మొదటి నుంచి ఉంటున్నాయి. మరికొన్ని నెలల్లో చిన్నమ్మ జైలు జీవితం ముగిసే అవకాశాలు ఉన్నాయి. 2021లో జైలు జీవితం ముగించి బయటకు వచ్చే చిన్నమ్మ గార్డెన్‌లోకి అడుగు పెట్టలేని రీతిలో నో ఎంట్రీ బోర్డుగా ఈ ప్రత్యేక చట్టానికి సంబంధించిన బోర్డును అక్కడ పెట్టడం గమనార్హం. ఈ చట్టానికి గవర్నర్ ఆమోదముద్ర వేయగానే, ఆ ఇంట్లో ఉన్న అన్ని రకాల వస్తువులు, స్థిర, చర ఆస్తుల్ని గుప్పెట్లోకి తీసుకుని వేద నిలయాన్ని అమ్మ స్మారకంగా మార్చేందుకు సీఎం పళనిస్వామి నేతృత్వంలోని ట్రస్టు పరుగులు తీస్తుండడం గమనార్హం. ఈ పరిణామాల దృష్ట్యా, చిన్నమ్మ కోసం కొత్త షెల్టర్‌పై అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం దృష్టి పెట్టింది. ఇప్పటికే చిన్నమ్మ ప్రతినిధిగా ఉన్న దినకరన్ అమ్మ మక్కల్ మున్నేట్ర కళగంకోసం రాయపేటలోని అన్నాడీఎంకే కార్యాలయానికి కూత వేటు దూరంలో బ్రహ్మాండంగా భవనం తీర్చిదిద్దారు. ఈ దృష్ట్యా, చిన్నమ్మ కోసం పోయెస్‌గార్డెన్ పరిసరాల్లోనే మరో భవనం షెల్టర్ కోసం ఎంపిక చేసే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. -
జానకి.. శశికళ
ఏ సినిమాకైనా సరైన ఆర్టిస్టులను ఎంపిక చేయడం ముఖ్యం. బయోపిక్ అయితే అది మరింత ముఖ్యం. ప్రస్తుతం జయలలిత బయోపిక్‌లోనూ ఆర్టిస్ట్‌ల ఎంపికలో రాజీ పడటం లేదు చిత్రబృందం. నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా ఏఎల్ విజయ్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘తలైవి’ (నాయకురాలు అని అర్థం). కంగనా రనౌత్ టైటిల్ రోల్ చేస్తున్నారు. దివంగత నటుడు యంజీ రామచంద్రన్ (యంజీఆర్)గా అరవింద స్వామి, నటుడు శోభన్‌బాబు పాత్రలో బెంగాలీ నటుడు జిష్షూ సేన్ గుప్తా నటిస్తున్నారు. తాజాగా జయ జీవితంలో కీలకమైన ఆప్తురాలు శశికళ పాత్రలో పూర్ణ నటిస్తున్నారు. యంజీఆర్ భార్య జానకి పాత్రలో ‘రోజా’ ఫేమ్ మధుబాల నటిస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు విజయ్ మాట్లాడుతూ – ‘‘శశికళ పాత్రకి ప్రియమణిని అనుకున్నాం. కానీ డేట్స్ సమస్య వచ్చింది. పూర్ణ అయితే ఈ పాత్రకు బావుంటారని తీసుకున్నాం. మధుబాలగారిని జయలలిత తల్లి సంధ్య పాత్రలో తీసుకుందాం అనుకున్నాను. కానీ ఆమెను కలిశాక యంజీఆర్ భార్య జానకి పాత్రకు కరెక్ట్‌గా సరిపోతారని తీసుకున్నాం. ప్రస్తుతం చెన్నైలో షూటింగ్ చేస్తున్నాం. మార్చి మొదటివారం వరకూ ఈ షెడ్యూల్ సాగుతుంది’’ అన్నారు. శైలేష్ ఆర్, విష్ణు వర్థన్ ఇందూరి నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది జూన్‌లో విడుదల కానుంది. -
చంద్రబాబు చెప్పేదొకటి. చేసేదొకటి
-
చిన్నమ్మ పిటిషన్ తిరస్కృతి..!
సాక్షి, చెన్నై: విదేశీ మారక ద్రవ్యం కేసులో వీడియో కాన్పెరెన్స్ విచారణ నిమిత్తం ముందుగా శశికళకు ప్రశ్నల జాబితా ఇవ్వడానికి ఎగ్మూర్‌కోర్టు నిరాకరించింది. ఆమె చేసుకున్న అభ్యర్థనను తిరస్కరించింది. పిటిషన్ విచారణ యోగ్యం కాదని తేల్చింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తీవ్ర ఆక్షేపణకు కోర్టు స్పందించింది. దివంగత సీఎం జయలలిత నెచ్చెలి శశికళపై ఉన్న కేసుల్లో విదేశీ మారక ద్రవ్యం కేసు కూడా ఒకటి. అక్రమాస్తుల కేసులో ఆమె కారాగార వాసంలో ఉన్న నేపథ్యంలో కేసుల విచారణలన్నీ వేగం పుంజుకుంటున్నాయి. ఇందులో 1996–2001 మధ్యకాలంలో శశికళ పై ఈడీ దాఖలు చేసిన కేసులు ఐదు ఉన్నాయి. జయ టీవీకి విదేశాల నుంచి పరికరాల కొనుగోళ్లల్లో సాగిన నగదు బట్వాడాలో విదేశీ మారక ద్రవ్యం వ్యవహారంపై చెన్నై ఎగ్మూర్కోర్టులో కేసు విచారణ సాగుతున్నది. కోర్టుకు శశికళ నేరుగా హాజరుకావాల్సి ఉన్నా, జైలు శిక్ష నేపథ్యంలో కుదరని పని. దీంతో వీడియో కాన్పెరెన్స్ విచారణకు అనుమతి ఇవ్వాలని కోరుతూ కోర్టులో పిటిషన్ వేశారు. కాగా, ముందస్తు ప్రశ్నల జాబితాకు చట్టంలో ఆస్కారం ఉందంటూ శశికళ తరపు న్యాయవాదులు వాదన వినిపించారు. చట్టంలో ఇందుకు ఆస్కారం లేదని, వీడియో కాన్పెరెన్స్ విచారణలో న్యాయవాదులకు పనేలేదంటూ ఈడి వాదన వినిపించింది. వీడియో కాన్ఫెరెన్స్ విచారణ కోర్టు, నింధితుల మధ్య మాత్రమే సాగుతుందన్న విషయాన్ని పరిగణించి శశికళ పిటిషన్ తిరస్కరించాలని ఈడి విజ్ఞప్తి చేసింది. సోమవారం ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి జాకీర్ హుస్సేన్ తీర్పువెలువరించారు. శశికళ తరపు పిటిషన్ విచారణ యోగ్యం కాదని తేల్చారు. కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నింధితులకు ముందుగానే ప్రశ్నలతో కూడిన జాబితా ఇవ్వడానికి వీలు లేదని, వీడియో కాన్ఫెరెన్స్ విచారణలో కోర్టు ప్రశ్నలను సందించాల్సి ఉంటుందంటూ, ఆమె పిటిషన్‌ను తిరస్కరిస్తున్నట్టు ప్రకటించారు. దీంతో తదుపరి ప్రయత్నాల్లో శశికళ తరపు న్యాయవాదలు నిమగ్నం అయ్యారు. పిటిషన్ తిరష్కరణ దృష్ట్యా, తదుపరి విచారణలో శశికళను కోర్టుకు హాజరుపరచాల్సిన అవసరం ఉంటుందా..? అన్న చర్చలో పడ్డారు. ఇందుకు తగ్గ అవకాశాలు ఉన్నాయా..? అని ఆమె తరపున న్యాయవాదులు పరిశీలనలో నిమగ్నం అయ్యారు.