
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో శివసేన రెబల్ ఎమ్మెల్యేలకు భారీ ఊరట లభించింది. ఏక్‌నాథ్ షిండేతో సహా 16 మంది ఎమ్మెల్యేలపై డిప్యూడీ స్పీకర్ ఇచ్చిన అనర్హత పిటిషన్లపై జూలై 11 వరకూ ఎలాంటి చర్యలూ చేపట్టవద్దని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీచేసింది. మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ఏక్‌నాథ్ షిండే రెబల్ ఎమ్మెల్యేలు దాఖలుచేసిన పిటిషన్లను జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ పర్దివాలా నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారించింది.
జూలై 11కు వాయిదా
ఈ మేరకు రెబల్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్‌పై మహారాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. శివసేన శాసనసభా పక్షనేత అజయ్ చౌదరితోపాటు డిప్యూటీ స్పీకర్, కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. అయిదు రోజుల్లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని మహా సర్కార్‌ను ఆదేశించింది. జూలై 11న పిటిషన్లను తిరిగి విచారిస్తామని తెలిపింది. అప్పటి వరకూ రెబల్ ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని డిప్యూటీ స్పీకర్‌కు సుప్రీం ధర్మాసనం ఆదేశాలు జారీచేసింది.
చదవండి: Maharashtra Poliical Crisis: శివసేన రెబల్ ఎమ్మెల్యేల పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ
మరోవైపు ఎమ్మెల్యేల అనర్హతపై డిప్యూటీ స్పీకర్ ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఉద్దవ్ ఠాక్రే లాయర్ తెలిపారు. డిప్యూటీ స్పీకర్‌ను నిర్ణయం తీసుకోనివ్వండి అని కోర్టును కోరారు. అనర్హతపై డిప్యూటీ స్పీకర్ నిర్ణయం తీసుకున్న తరువాత సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోవచ్చన్నారు.
Comments
Please login to add a commentAdd a comment