![Sena Slams BJPs Silence On Kanganas Terrorist Remark - Sakshi](/styles/webp/s3/article_images/2020/09/22/kangana-ranaut.jpg.webp?itok=ZkIyHFGk)
సాక్షి, ముంబై : పైర్ బ్రాండ్ కంగనా రనౌత్‌పై శివసేన చేస్తున్న ఆరోపణలపై ఆమె తీవ్రంగా స్పందించింది. తాను రైతులను ఉగ్రవాదులు అని సంబోధించలేదని, ఒకవేళ అలా అనుంటే నిరూపించాలని డిమాండ్ చేసింది. తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని, ఇలాంటి ఆరోపణలు నిరూపిచంగలిగితే తక్షణమే క్షమాపణలు చెప్పి శాశ్వతంగా ట్విట్టర్ నుంచి వైదొలుగుతానంటూ పేర్కొంది. అంతేకాకుండా శ్రీకృష్ణుడికి నారాయణి సైన్యం ఉన్నట్లే, పప్పుకు తన చంపు సైన్యం ఉంటుందంటూ శివసేన గురించి విమర్శనాస్ర్తాలు సంధించింది. పార్లమెంటులో ఆమోదం పొందిన రెండు వ్యవసాయ బిల్లులు రాజ్యసభ ఆమోదం లభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ బిల్లులు రైతులు సాధికారికత సాధించేలా తోడ్పడతాయంటూ మోదీ చేసిన ట్వీట్‌కు స్పందనగా ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ చేసిన ట్వీట్ రాజకీయాల్లో హోట్ టాపిక్‌గా మారింది. (రైతులకు శుభాకాంక్షలు: ప్రధాని మోదీ)
ఈ బిల్లులను వ్యతిరేకిస్తూ కొందరు నిరసనకారులు సీఏఏ తరహాలోనే ఉగ్రవాదుల వలె రక్తపాతం సృష్టిస్తారంటూ కంగనా చేసిన ట్వీట్‌ను శివసేన తనకు అనుకూలంగా మరల్చుకుంది. వారి హక్కులకోసం పోరాడుతున్న రైతులను కంగనా ఉగ్రవాదులు అని సంబోధించడం ఏంటని ప్రశ్నించింది. శివసేన తన సంపాదకీయం సామ్నాలో కంగనాపై విరుచుకుపడింది. గతంలో ఓ నటి మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే చాలు రాజకీయ పార్టీలన్నీ పాముల్లా తమపై విషం చిమ్మారు..మరి ఇప్పుడేమైంది? రైతులను ఉగ్రవాదులుగా, ముంబైని పాకిస్తాన్‌తో పోల్చి మాట్లాడినా బీజేపీ ఎందుకు మౌనం వహిస్తోందంటూ ఆరోపించింది. మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన బిల్లులను పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రైతులు సహా పలువురు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని, కేంద్రం తెచ్చిన బిల్లులు నిరసనలకు దారితీశాయని సంపాదకియంలో పేర్కొంది. (డ్రగ్స్ వాడకం ఫలితమే డిప్రెషన్: కంగనా)
जैसे श्री कृष्ण की नारायणी सेना थी, वैसे ही पप्पु की भी अपनी एक चंपू सेना है जो की सिर्फ़ अफ़वाहों के दम पे लड़ना जानती है, यह है मेरा अरिजिनल ट्वीट अगर कोई यह सिद्ध करदे की मैंने किसानों को आतंकी कहा, मैं माफ़ी माँगकर हमेशा केलिए ट्वीटर छोड़ दूँगी 🙏 https://t.co/26LwVH1QD9
— Kangana Ranaut (@KanganaTeam) September 21, 2020
Comments
Please login to add a commentAdd a comment