
జైపూర్: మహిళ స్నానం చేస్తున్నప్పుడు వీడియో తీసి బ్లాక్‌మెయిల్ చేసి ఆపై ఆత్యాచారం చేసిన ఘటన బార్మర్ జిల్లాలోని బాల్టోరా ప్రాంతంలో చోటుచేసుకుంది. ఈ విషయంలో బీజేపీ వార్డు కౌన్సిలర్ ఆరోపణ లు ఎదుర్కొంటున్నాడు. నిందితుడు బాధితురాలికి దూరపు బంధువు అని తెలుస్తోంది. వివరాలు.. బాధితురాలు నాలుగు ఏళ్ల క్రితం బాల్టోరాకు చెందిన వ్యక్తిని వివాహం చేసుకుంది. బాధితురాలి ఇంటికి కాంటిలాల్ అనే బీజేపీ కౌన్సిలర్ తరచు వచ్చేవాడు.
ఈ క్రమంలో స్నానం చేస్తున్నప్పుడు తనను వీడియో తీశాడు. దాంతో బ్లాక్ మెయిల్ చేసి అత్యాచారం చేశాడని, అంతేగాక అతని స్నేహితుడు జోధ్రామ్ తో కూడా సహజీవనం చేయాలని బలవంతం చేశాడు. ఈ మేరకు బాధఙతురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. వీడియోను వైరల్ చేస్తానని బెదిరించి బాధితురాలిపై అనేకసార్లు లైంగిక దాడికి పాల్పడ్డారని డీఎస్పీ సుభాష్ ఖోజా పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని, త్వరలో నిందితులను అరెస్టు చేస్తామని తెలిపారు. బాధితురాలిని వైద్య పరీక్ష నిమిత్తం ఆసుపత్రికి పంపినట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment