
మహారాష్ట్రలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ పురాతన రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జి మధ్యలో కొంత భాగం కుప్పకూలింది. దీంతో వంతెనపై ప్రయాణిస్తున్న ప్రయాణికులు గాయపడ్డారు. కొందరు ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు.
వివరాల ప్రకారం.. చంద్రాపూర్‌లోని బల్లార్ష రైల్వే స్టేషన్‌లో ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జి మధ్య భాగం ఒక్కసారిగా కూలిపోయింది. ఈ క్రమంలో బ్రిడ్జిపై ఉన్న ప్రయాణికులు కింద ఉన్న రైల్వే పట్టాలపై పడిపోయారు. దీంతో, వారందరూ గాయపడ్డారు. వంతెన కూలిపోయిన సందర్భంగా పెద్దశబ్ధం రావడంతో ప్లాట్‌ఫ్లామ్‌పైన ఉన్న ప్రయాణికులందరూ భయంతో పరుగుతీశారు. కాగా, ఈ ఘటనలో 20 గాయపడినట్టు సమాచారం. 8 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. క్షతగాత్రులను వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment