Balharshah railway station
-
భారీ శబ్ధంతో కూలిన రైల్వే వంతెన.. ప్రయాణికులకు తీవ్ర గాయాలు!
మహారాష్ట్రలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ పురాతన రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జి మధ్యలో కొంత భాగం కుప్పకూలింది. దీంతో వంతెనపై ప్రయాణిస్తున్న ప్రయాణికులు గాయపడ్డారు. కొందరు ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. వివరాల ప్రకారం.. చంద్రాపూర్‌లోని బల్లార్ష రైల్వే స్టేషన్లో ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జి మధ్య భాగం ఒక్కసారిగా కూలిపోయింది. ఈ క్రమంలో బ్రిడ్జిపై ఉన్న ప్రయాణికులు కింద ఉన్న రైల్వే పట్టాలపై పడిపోయారు. దీంతో, వారందరూ గాయపడ్డారు. వంతెన కూలిపోయిన సందర్భంగా పెద్దశబ్ధం రావడంతో ప్లాట్‌ఫ్లామ్‌పైన ఉన్న ప్రయాణికులందరూ భయంతో పరుగుతీశారు. కాగా, ఈ ఘటనలో 20 గాయపడినట్టు సమాచారం. 8 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. క్షతగాత్రులను వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. -
‘పట్టాలు’ తప్పిన ప్రాజెక్టు నష్టం రూ. 2000 కోట్లు
సాక్షి, హైదరాబాద్: అది ఓ కీలక ప్రాజెక్టు.. పూర్తయితే అదనంగా రోజుకు వంద రైళ్లను నడిపేందుకు అవకాశమున్న కారిడార్. ఈ ప్రాజెక్టు విషయంలో రైల్వే జాప్యం చేసింది. ఆ ఆలస్యం ఖరీదు దాదాపు రూ.2 వేల కోట్లు కావడం గమనార్హం. రూ.2,063 కోట్ల వ్యయంతో సిద్ధం కావాల్సిన ప్రాజెక్టును ఇప్పుడు పూర్తి చేసేందుకు రూ.4 వేల కోట్ల కంటే ఎక్కువ ఖర్చు కానుంది. అంటే మరో ప్రాజెక్టు పూర్తి అయ్యేందుకు సరిపడా ప్రజాధనాన్ని రైల్వే వృథా చేసినట్టవుతోందన్నమాట. కాజీపేట– బల్లార్షా మూడో లైన్ (ట్రిప్లింగ్) ప్రాజెక్టులో ఈ జాప్యం చోటు చేసుకుంది. కీలకమైన అతిరద్దీతో కూడిన లైన్ దక్షిణ భారతాన్ని ఉత్తర భారతంతో జోడించే అతి కీలక రైల్వే లైన్ ఇది. దక్షిణ భారత్ ప్రజలు ఎగువ ప్రాంతాలకు వెళ్లాలంటే ఇదే ప్రధాన రైల్వే లైన్. అందుకే దీన్ని గ్రాండ్ ట్రంక్ రూట్‌గా పరిగణిస్తారు. నిత్యం వందల సంఖ్యలో ఎక్స్‌ప్రెస్ రైళ్లు పరుగులు పెడుతుంటాయి. లైన్ ప్రాధాన్యం దృష్ట్యా ఇటీవల ఆ కారిడార్‌లో రైలు వేగాన్ని గంటకు 130 కి.మీ.కు పెంచారు. ఈ మార్గంలోని మాణిక్‌ఘర్, రేచిని, ఉప్పల్, ఆసిఫాబాద్, మంచిర్యాల, మందమర్రి, రామగుండం, పెద్దంపేట, సిర్పూర్–కాగజ్‌నగర్.. ఈ ప్రాంతాల్లో బొగ్గు గనులు, సిమెంటు పరిశ్రమలు భారీగా ఉన్నాయి. ఎరువుల కర్మాగారం ఉంది. వెరసి వందలాది సరుకు రవాణా రైళ్లు కూడా రాకపోకలు సాగిస్తుంటాయి. దీంతో ఇది రైల్వేకు ప్రధాన ఆదాయ వనరుగా, గోల్డెన్ కారిడార్‌గా వెలుగొందుతోంది. ఒక్క రైలునూ కూడా అదనంగా నడపలేని పరిస్థితి ప్రస్తుతం ఈ మార్గంలో ప్రతిరోజూ 250 రైళ్లు తిరుగుతున్నాయి. అవసరమైన సందర్భాల్లో ప్రత్యేక రైళ్లతో కలిసి 300 రైళ్ల వరకు తిప్పుతున్నారు. ప్రస్తుతం ఆ రూట్లో 130 శాతం రైలు ట్రాఫిక్ రికార్డవుతోంది. దీంతో మరో రైలును కూడా అదనంగా తిప్పే పరిస్థితి లేకుండా పోయింది. దక్షిణాది రాష్ట్రాల నుంచి ఢిల్లీ, ముంబయి వైపు మరిన్ని రైళ్లు నడపాల్సి ఉన్నా, ఈ మార్గం ఇరుగ్గా మారటంతో నడపలేని దుస్థితి నెలకొంది. అత్యవసరంగా ఓ బొగ్గు రవాణా రైలు ముందుకు సాగాలంటే సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను కూడా నిలిపివేయాల్సి వస్తోంది. మూడో లైన్ ఆవశ్యకతను గుర్తించిన కేంద్రం మూడో లైన్ పూర్తయితే ఆ సమస్య తీరడంతో పాటు అదనంగా మరో 100 రైళ్లను నిత్యం నడిపే అవకాశం కలుగుతుంది. ఈ నేపథ్యంలోనే మూడో లైన్ నిర్మాణం అత్యంత ఆవశ్యకమని గుర్తించిన కేంద్రం 2015–16లో ప్రాజెక్టును మంజూరు చేసింది. దీని నిడివి 202 కి.మీ కాగా అంచనా వ్యయం రూ.2,063 కోట్లు. ప్రాజెక్టు ప్రారంభం, పనులు రెండూ జాప్యమే.. ఈ ప్రాజెక్టు పనులు సకాలంలో ప్రారంభం కాలేదు. ప్రారంభించాక వేగంగా పనులు చేశారా అంటే.. ఇప్పటికి పూర్తయింది కేవలం 71 కి.మీ (35 శాతం) మాత్రమే. మరో 68 కి.మీ పనులు (33 శాతం) కొనసాగుతున్నాయి. ఇవి 2023 మార్చి వరకు పూర్తి అయ్యే అవకాశం ఉంది. మరో 60 కి.మీ పైగా పనులు ప్రారంభం కావాల్సి ఉంది. కానీ ఇప్పటికే రూ.1,700 కోట్లు ఖర్చయ్యాయి. తాజా పరిస్థితుల్లో మిగతా పనులు పూర్తి కావాలంటే ప్రాజెక్టు వ్యయం రూ.4 వేల కోట్లు దాటుతుందని అంచనా. అంటే ప్రాజెక్టు పనులు ఆలస్యం కావటంతో అంచనా వ్యయం దాదాపు రెట్టింపు అవుతోందన్నమాట. అప్పట్లోనే గుర్తించి ఉంటే.. సరుకు రవాణాలో కీలక మార్గం కావటంతో దాదాపు 12 ఏళ్ల క్రితమే రాఘవాపురం–పెద్దంపేట, మంచిర్యాల–మందమర్రి మధ్య 24 కి.మీ, మంచిర్యాల–పెద్దంపేట మధ్య గోదావరి నదిపై భారీ వంతెన సహా 9 కి.మీ లైన్ మంజూరు చేశారు. ఆ పనులు చేపట్టి దశలవారీగా పూర్తి చేశారు. కానీ కారిడార్ యావత్తు మూడో లైన్ అవసరమన్న విషయాన్ని అప్పుడే గుర్తించి వెంటనే పనులు ప్రారంభించి వేగంగా పూర్తి చేసి ఉంటే ఇప్పుడు వ్యయం రెట్టింపు అయ్యే పరిస్థితే తలెత్తేది కాదని రైల్వేవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. -
మరిన్ని రైళ్లు.. మరింత వేగం
సాక్షి, హైదరాబాద్: ఉత్తర–దక్షిణ భారత్‌లను రైల్వే లైన్ పరంగా అనుసంధానించే అతికీలక గ్రాండ్ ట్రంక్ రూట్లో భాగంగా ఉన్న కాజీపేట–బల్లార్షా మధ్య మూడో రైల్వే లైన్ వేగంగా అందుబాటులోకి వస్తోంది. మార్చి నాటికి ప్రా జెక్టులో సగభాగం అందుబాటులోకి రాబోతోంది. అందులో ఈ నెలాఖరుకు 20 కి.మీ. లైన్ మీదుగా రైళ్లను నడిపేందుకు వీలుగా కొత్త లైన్‌ను పాత ట్రాక్‌తో అనుసంధానించే నాన్ ఇంటర్‌లాకింగ్ పనులు ప్రారంభించారు. 234 కి.మీ. ప్రాజెక్టులో సగం ప్రాంతం అందుబా టులోకి రావడం పెద్ద ఊరటగా భావించొచ్చు. ఇప్పటికే సామర్థ్యానికి మించి రైళ్లను నడు పుతున్నారు. ఏమాత్రం తేడా వచ్చినా ప్రమా దాలు జరిగే అవకాశం ఉంది. ఆ పరిస్థితి ఇక దూరం కానుంది. దీంతోపాటు మరిన్ని రైళ్లను నడిపేందుకూ వీలు కలుగుతుంది. అన్నింటికి మించి రైళ్ల వేగం కూడా పెరగనుంది. రూ.2,063 కోట్లతో పనులు గ్రాండ్ ట్రంక్ రూట్లో కాజీపేట తర్వాత వచ్చే మహారాష్ట్రలోని బల్లార్షా మీదుగా నిత్యం 300 వరకు రైళ్లు (కోవిడ్‌కు ముందున్న పరిస్థితి) పరుగుపెడుతున్నాయి. ట్రాక్ సామర్థ్యానికి మించి 130 శాతం మేర రైళ్లను నడుపుతున్నారు. పైగా కాజీపేట–బల్లార్షా మధ్య సిమెంటు కర్మాగారాలు, బొగ్గు గనులు భారీగా ఉన్నాయి. రైల్వేకు భారీ ఆదాయాన్ని తెచ్చిపెడుతున్న సిమెంటు, బొగ్గు తరలింపు ప్రాజెక్టు అత్యంత కీలకమైంది. సాధారణంగా ప్రయాణికుల రైళ్లకు రూట్ క్లియర్ చేసేందుకు సరుకు రవాణా రైళ్లను లూప్‌లైన్లలో ఆపేస్తారు. కానీ ఈ మార్గంలో సరుకు రవాణా రైళ్లకే ప్రయాణికుల రైళ్లకు రెడ్‌సిగ్నల్ ఇచ్చి రూట్ క్లియర్ చేస్తుంటారు. దీంతో 2015–16లో మూడో లైన్ ప్రాజెక్టును రూ.2,063 కోట్లతో ప్రారంభించారు. 235 కి.మీ. నిడివిలో రాఘవాపురం–మందమర్రి మధ్య 34 కి.మీ. మధ్య మూడో లైన్‌ను పూర్తి చేసి గతంలోనే ప్రారంభించారు. రాఘవాపురం–మంచిర్యాల మధ్య ఈ ప్రాజెక్టులో భాగంగా పనులు పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చారు. రాఘవాపురం–కొలనూరు–పోత్కపల్లి సెక్షన్ల మధ్య 31 కి.మీ పనులు పూర్తయ్యాయి. వీటితోపాటు పనులు పూర్తయిన ప్రాంతాల్లో మూడోలైన్‌ను పాతలైన్లతో అనుసంధానించే నాన్ ఇంటర్ లాకింగ్ పనులు ప్రారం భించారు. ఇందులో వీరూర్–మాణిక్‌ఘర్ మధ్య నిర్మించిన మూడోలైన్ ఈ నెలాఖరు నుంచి వినియోగంలోకి రానుంది. మూడో లైన్ అందుబాటులోకి వస్తే వెంటనే అదనపు రైళ్లను నడిపేందుకు రైల్వే బోర్డు సిద్ధంగా ఉంది. ఇక ఆదాయాన్ని మరింత పెంచుకునే క్రమంలో సరుకు రవాణాపై అధికంగా దృష్టి సారించిన రైల్వే బోర్డు, మూడో లైన్‌ను గరిష్టస్థాయిలో గూడ్సు రైళ్లకు వినియోగించాలని భావిస్తోంది. అప్పుడు మిగతా రెండు లైన్లపై ప్రయాణికుల రైళ్లు అవాంతరాలు లేకుండా సాఫీగా పరిగెత్తేందుకు మార్గం సుగమమవుతుంది. -
హత్యా..? ఆత్మహత్యా?
కోల్‌సిటీ, న్యూస్‌లైన్: గోదావరిఖనిలో ఆదివారం ఉదయం అదృశ్యమైన తోట వంశీ(19) అనే యువకుడు, మహారాష్ట్రలోని బల్లార్షా రైల్వేస్టేషన్లో రైల్వేట్రాక్‌పై సోమవారం శవమై కనిపించాడు. తల, మొండెం వేరయ్యాయి. తల్లిందండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. పథకం ప్రకారం ఎవరైనా హత్య చేశారా? ఇతర కారణాలేమైనా ఉన్నాయా..? అనేది మిస్టరీగా మారింది. మృతుని కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గోదావరిఖని సీతానగర్‌లో తోట సత్యనారాయణ-పుష్ప దంపతులకు శ్రావణ్‌కుమార్, సాయికుమార్, వంశీ ముగ్గురు సంతానం. సత్యనారాయణ ఆటోరిక్షా డ్రైవర్. పుష్ప కూరగాయల మార్కెట్లో కూలీ. పదో తరగతి వరకు చదివిన చిన్న కొడుకు వంశీ(19) లారీపై పని చేస్తున్నాడు. ప్రేమ వ్యవహారంలో గొడవలు.. తన కాలనీలోని ఓ యువతిని వంశీ ప్రేమించాడనే విషయంలో కొంతకాలంగా రెండు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇవి గతంలో కోర్టు వరకు వెళ్లాయి. కొంతకాలం తర్వాత మళ్లీ గొడవలు మొదలయ్యాయి. యువతి చైన్‌ను వంశీ తీసుకున్నాడని వారం రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ మేరకు సోమవారం పంచాయితీ చేయడానికి పెద్దలు సూచించినట్లు సమాచారం. ఈ క్రమంలో ఆదివారం ఉదయం ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన వంశీ ఆచూకీ లభించలేదు. సిమ్ ఆధారంగా సమాచారం.. బల్లార్ష రైల్వేస్టేషన్ సమీపంలోని ఫ్లాట్‌ఫాం చివరన రైలు పట్టాలపై వంశీ మృతదేహం ఉందని రైల్వే పోలీసులు సోమవారం సమాచారం ఇవ్వడంతో తల్లిదండ్రులు హతాశులయ్యారు. మృతదేహం వద్ద మూడు రైల్వే టిక్కెట్లు, సెల్‌ఫోన్ సిమ్ లభించాయి. సిమ్ ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మూడు రైల్వే టిక్కెట్లలో రెండు టిక్కెట్లు రామగుండం నుంచి బల్లార్ష వరకు, ఒక టిక్కెట్ కాగజ్‌నగర్ నుంచి బల్లార్ష వరకు ఉండడం అనుమానాలకు తావిస్తోంది. ఆదివారం రాత్రి సుమారు 10.30 గంటల ప్రాతంలో గోదావరిఖనికి చెందిన ఓ యువకుడికి బల్లార్షలో కనిపించినట్లు తెలిసింది. తమ కొడుకు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. బల్లార్ష ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన కుటుంబసభ్యులు మృతదేహాన్ని గోదావరిఖనికి తరలించారు.